X

Takshashila University: ప్రపంచానికి చదువు చెప్పిన భారతదేశం.. ఈ యూనివర్శిటీలో ఫీజులు కట్టక్కర్లేదు, పరీక్షలు ఉండవు..

ఆ యూనివర్శిటీలో ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు పరీక్షలు నిర్వహించరు. కేవలం నేర్చుకున్న విద్యే కొలమానం. అంతగొప్ప విశ్వవిద్యాలయం ఎక్కడుంది.. ఆ యూనివర్శిటీ ప్రత్యేకతలేంటి.. ఏబీపీ దేశం స్పెషల్ స్టోరీ

FOLLOW US: 

ప్రస్తుత రోజుల్లో ఉన్నత విద్య కోసం మనం విదేశాలకు వెళ్తున్నాం. కానీ కొన్ని వందల ఏళ్ళ క్రితమే ఆ దేశాలు మన దగ్గర పాఠాలు నేర్చుకున్నాయి. మన దేశం మీద దాడులు చేసి, మన గ్రంధాలను ఎత్తుకెళ్ళాయి. మన విజ్ఞాన సంపదను దోచుకెళ్లాయి. అలాంటి విశ్వవిద్యాలయాల్లో తక్షశిల ముఖ్యమైనది. దాదాపు వెయ్యేళ్ల పాటు ఓ వెలుగు వెలిగింది ఈ యూనివర్శిటీ. సాధారణంగా గురుకులాల్లో ప్రాధమిక విద్యాభ్యాసం పూర్తయ్యాక 16 వ ఏట విద్యార్ధులు ఈ విద్యాలయంలోకి ప్రవేశించేవారు. నేటి విద్యతో పోల్చుకుంటే తక్షశిలలో విద్యాభ్యాసం పూర్తి భిన్నంగా ఉండేది. భిన్నంగా ఏంటి అస్సలు అప్పటి విద్యకు ఇప్పటి విద్యకు సంబంధమే లేదు. తక్షశిల విశ్వవిద్యాలయంలో విద్య నేర్పించే విధానం తెలిస్తే ఆహా అంటారు , ఆశ్చర్యపోతారు.  ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో ఇలాంటి విశ్వవిద్యాలయాలు సాధ్యమా అనిపిస్తుంది.
తక్షశిల విశ్వవిద్యాలయం ప్రత్యేకతలివే...

 • తక్షశిల యూనివర్శిటీలో చేరడానికి ఎలాంటి అప్లికేషన్ ఫాంలు ఉండేవికాదు
 • గురువుగారు నిర్వహించిన ఇంటర్యూలో ఆయన్ని మెప్పిస్తే యూనివర్శిటీలో సీటొచ్చినట్టే
 • ఒకవేళ గురువు నచ్చకపోతే ఎలాంటి రికమండేషన్స్ ఉండవు
 • సీటున్న కోర్సులో చేరడం కాదు...చేరాలనుకునే విద్యార్థి తెలివితేటలు ఆధారంగా కోర్సు కేటాయిస్తారు
 • తక్షశిల విశ్వవిద్యాలయంలో ఎలాంటి ఫీజులు ఉండవు,  కోర్సుకి ఇంత కాలం అనే పరిమితి ఉండదు
 • ఏ శాస్త్రబోధనలోనూ పాఠ్యాంశానికి సంబంధించి ప్రత్యేకమైన సిలబస్ ఉండదు
 • నాలుగేళ్లు, ఐదేళ్లు అనే నిబంధన ఉండదు. అసలిక్కడ సంవత్సరాలు కొలమానం కాదు. నేర్చుకున్న విద్యే కొలమానం
 • విద్య నేర్పిస్తున్నంతకాలం ఉచితభోజనం, ఉచిత వసతి సదుపాయం కల్పిస్తారు
 • ఒకరి తర్వాత మరొక గురువు వద్ద విద్యాభ్యాసం చేసి సర్వశాస్త్రాలు అవగాహన చేసుకోవాలి
 • బోధనానంతరం పరీక్షలు , మార్కులు, పట్టా ప్రధానోత్సవం ఇలాంటివి అస్సలు ఉండవు
 • తక్షశిలలో అత్యంత ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు…అదే వర్శిటీలో ఆచార్యుడిగా అవకాశం లభిస్తుంది. చాణక్యుడు తక్షశిలలో విద్యనభ్యసించి ఆచార్యుడిగా చేరింది ఇలాగే.

Also Read: చేయి నాకి నాకి తింటున్నారా.. మీకు ఆ వ్యామోహం చాలా ఎక్కువట..
ఫీజుల్లేకపోతే నిర్వహణ ఎలా?
విద్యార్థులకు జ్ఞానాన్ని అందించడమే ఈ విశ్వవిద్యాలయం పరమావధి అయినప్పటకీ  నిర్వహణకు డబ్బు ఉండాలి కదా.  అయినప్పటికీ విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసేవారు కాదు. నగరంలో ఉండే ధనికులు కొందరు కొంత మొత్తాన్ని తమంతట తాముగా సహాయం చేసేవారు. ఆ ధనంతోనే విశ్వవిద్యాలయం నడిచేది. లాభాపేక్ష లేదు కాబట్టి ఆ కొంత మొత్తంతోనే అద్భుతమైన మేధావులను తయారు చేసింది తక్షశిల యూనివర్శిటీ.
మహామహాలు చదివిన విశ్వవిద్యాలయం తక్షశిల
ప్రపంచంలోనే గొప్ప విశ్వవిద్యాలయం అయిన తక్షశిలలో ఎందరో ప్రముఖులు విద్యనభ్యసించారు. ఆర్యచాణక్యుడు మొదలు ఆయుర్వేద వైద్యనిధి-ప్రసిద్ధ ఆయుర్వేద గ్రంథం చరకసంహిత రచయిత చరకుడు, ప్రపంచం మొత్తంమీద ఒక భాషకు వ్యాకరణం రాయడం అనే దానిని తన గ్రంథాలతోనే ప్రారంభించిన పాణిని తక్షశిలలో చదువుకున్నవారే. ఇంకా…అశోకుడు, చంద్రగుప్త మౌర్యుడు, విష్ణుశర్మ, బింబిసారుడు, కోసల దేశాధీశుడు ప్రసేనజిత్తు ఈ యూనివర్శిటీలోనే చదువుకున్నారు. అలెగ్జాండర్ భారతదేశ దిగ్విజయ యాత్ర సందర్భంలో తక్షశిల విశ్వవిద్యాలయాన్ని సందర్శించాడు. స్వదేశం తిరిగి వెళ్తునప్పుడు హైందవ మత సంబంధ గ్రంథాలను, పండితులను తన వెంట తీసుకుని వెళ్ళాడని చెబుతారు.
తక్షశిల యూనివర్శిటీలో కోర్సులు
వేదాలు, ఉపనిషత్తులు, తత్కశాస్త్రం, సంగీతం, నృత్యం, యుద్ధ తంత్రం, రాజనీతి శాస్త్రం సహా సుమారు 68 అంశాలపై బోధించేవారు. ఈ విశ్వవిద్యాలయాన్ని 1980 లో UNESCO ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తించింది.  ప్రస్తుతం ఈ తక్షశిల విశ్వవిద్యాలయం ఉన్న ప్రదేశం పాకిస్తాన్ లో ఉంది.  
Also Read:  పిల్లి మాత్రమే కాదు.. ఇవి ఎదురైనా తలచిన పనులు జరగవట..
Also Read:శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించిన రోజు ఇదే... ఈ నెలంతా ప్రత్యేకమే
Also Read: స్వర్గానికి షార్ట్ కట్! రూట్ మ్యాప్ క్లియర్‌గా ఉందిగా!  
Also Read: ఫెంగ్‌షుయ్ ప్రకారం ఆ రెండు బొమ్మలు ఇంట్లో ఉంటే భార్య భర్తల మధ్య ప్రేమ పెరుగుతుందట
Also Read: కిచెన్లో పూజామందిరం పెట్టేశారా... దేవుడి మందిరం ఎక్కడ ఉండాలి..ఎక్కడ ఉండకూడదు...
Also Read: ఔను.. అది రాముడి కట్టిన వారధి ! నిర్మాణానికి ఎన్ని రోజులు పట్టిందంటే..
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Takshashila University Pakistan Shocking and unknown facts Ashokudu chankya cherakudu chandragupta mowrya vishnu sharma bimbisarudu alexzander

సంబంధిత కథనాలు

Vizag IIPE: పెట్రోలియం వర్సిటీకి సొంత క్యాంపస్, 157.36 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం

Vizag IIPE: పెట్రోలియం వర్సిటీకి సొంత క్యాంపస్, 157.36 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం

మొబైల్‌, యాప్స్‌ అప్‌డేట్‌ చేస్తున్నారు సరే... మరి మీరు అప్‌డేట్‌ అవ్వరా?... అలా కాకుంటే ఎంత ప్రమాదమో ఎప్పుడైనా ఆలోచించారా?

మొబైల్‌, యాప్స్‌ అప్‌డేట్‌ చేస్తున్నారు సరే... మరి మీరు అప్‌డేట్‌ అవ్వరా?... అలా కాకుంటే ఎంత ప్రమాదమో ఎప్పుడైనా ఆలోచించారా?

NEET-PG 2022: నీట్‌ పీజీ ప్రవేశాల కోసం రిజిస్ట్రేషన్ స్టార్ట్‌.. త్వరగా అప్లై చేయకుంటే జరిగే నష్టం తెలుసా!

NEET-PG 2022: నీట్‌ పీజీ ప్రవేశాల కోసం రిజిస్ట్రేషన్ స్టార్ట్‌.. త్వరగా అప్లై చేయకుంటే జరిగే నష్టం తెలుసా!

Telangana Schools: ఓమిక్రాన్ ఎఫెక్ట్.. తెలంగాణలో స్కూళ్లకు సెలవులు పొడిగింపు, ప్రభుత్వం కీలక నిర్ణయం

Telangana Schools: ఓమిక్రాన్ ఎఫెక్ట్.. తెలంగాణలో స్కూళ్లకు సెలవులు పొడిగింపు, ప్రభుత్వం కీలక నిర్ణయం

Army Public School Recruitment 2022: ఆర్మీ స్కూల్స్‌లో టీచర్ ఉద్యోగాలు.. 57ఏళ్ల వయసు వాళ్లు అప్లై చేసుకోవచ్చు..

Army Public School Recruitment 2022: ఆర్మీ స్కూల్స్‌లో టీచర్ ఉద్యోగాలు.. 57ఏళ్ల వయసు వాళ్లు అప్లై చేసుకోవచ్చు..

టాప్ స్టోరీస్

Shyam SinghaRoy: నానిని పెళ్లి చేసుకోమని అడిగిన వేశ్య.. వీడియో చూశారా..? 

Shyam SinghaRoy: నానిని పెళ్లి చేసుకోమని అడిగిన వేశ్య.. వీడియో చూశారా..? 

Moto Tab G70 LTE Sale: మోటొరోలా బడ్జెట్ ట్యాబ్లెట్ సేల్ నేడే.. ధర తక్కువే!

Moto Tab G70 LTE Sale: మోటొరోలా బడ్జెట్ ట్యాబ్లెట్ సేల్ నేడే.. ధర తక్కువే!

HBD Namrata Mahesh Ghattamaneni: నమ్రతా శిరోద్కర్ గురించి ఈ విషయాలు తెలుసా..

HBD Namrata Mahesh Ghattamaneni: నమ్రతా శిరోద్కర్ గురించి ఈ విషయాలు తెలుసా..

Groom Slaps Bride: వధువును కొట్టిన వరుడు.. అదే ముహూర్తానికి కజిన్‌ను పెళ్లాడిన యువతి

Groom Slaps Bride: వధువును కొట్టిన వరుడు.. అదే ముహూర్తానికి కజిన్‌ను పెళ్లాడిన యువతి