అన్వేషించండి

IND vs AUS: బ్రిస్బేన్‌లో భారత్‌ ముందు భారీ స్కోర్‌- ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌట్‌; బుమ్రాకు 6 వికెట్లు 

IND vs AUS 3rd Test: బ్రిస్బేన్ టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు కుప్పకూలింది. భారత్ తరఫున జస్ప్రీత్ బుమ్రా 6 వికెట్లు పడగొట్టాడు.

IND vs AUS 3rd Test: బ్రిస్బేన్ టెస్టులో భారత్‌ ముందు ఆస్ట్రేలియా భారీ స్కోర్ ఉంచింది. తన తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 445 పరుగులు చేసింది. ఏడు వికెట్ల నష్టానికి 405 ఓవర్‌ నైట్‌ స్కోర్‌తో మూడో రోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా 40 మాత్రమే జోడించి అలౌట్ అయింది. మూడో రోజు భారత్‌ తరఫున జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌, ఆకాశ్‌దీప్‌ ఒక్కో వికెట్‌ తీశారు. అలెక్స్ కారీ 70 పరుగులు చేశాడు. రెండో రోజు ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ ఆస్ట్రేలియా తరఫున సెంచరీలు సాధించారు. టీమిండియా తరఫున జస్ప్రీత్‌ బుమ్రా ఆరువికెట్లు తీసుకున్నాడు. 

రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 7 వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసింది. క్రీజ్‌లో ఉన్న అలెక్స్ కారీ. మిచెల్ స్టార్క్ మూడో రోజు ఇన్నింగ్స్‌ను వేగంగా ప్రారంభించారు. ఈ క్రమంలోనే స్టార్క్ 18 పరుగుల స్కోరు వద్ద ఫాస్ట్ షాట్ ఆడేందుకు ప్రయత్నించి రిషబ్ పంత్ చేతికి చిక్కాడు. ఇటు వికెట్లు పడుతున్నా ఓ వైపు గోడలా నిలబడిపోయిన అలెక్స్ కారీ 70 పరుగులు చేశాడు. మిచెల్ స్టార్క్‌ వికెట్‌ను తీసిన జస్ప్రీత్ బుమ్రా మూడో రోజు భారత్‌కు మంచి ఆరంభాన్ని అందించాడు. ఆ తర్వాత మహ్మద్‌ సిరాజ్‌, ఆకాశ్‌దీప్‌ వరుస ఓవర్లలో ఒక్కో వికెట్‌ తీసి ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను 445 పరుగుల వద్ద ముగించారు. 

జస్ప్రీత్ బుమ్రాపై జాత్యాంహకార వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి. బుమ్రా ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లలో ఒకడు. భారతదేశం. ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడవ టెస్ట్ మ్యాచ్‌లో 6 వికెట్లు తీశాడు. ఒక టెస్ట్ మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో 5 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీయడం టెస్ట్ క్రికెట్‌లో ఇది పన్నెండోసారి. అలాంటి బౌలర్‌ను ఉద్దేశించిఒక ప్రముఖ మహిళా వ్యాఖ్యాత 'ప్రైమేట్' అనే పదాన్ని ఉపయోగించారు. కోతి జాతిగా చేసిన ఈ వ్యాఖ్య కారణంగా ఏళ్ల నాటి 'మంకీ గేట్ స్కాండల్' మళ్లీ చర్చల్లోకి వచ్చింది.

బ్రిస్బేన్ టెస్టు రెండో రోజు తొలి సెషన్‌లో బుమ్రా 2 వికెట్లు తీయగా ఆస్ట్రేలియన్ లెజెండ్ బ్రెట్ లీ చాలా ప్రశంసించాడు. అదే టైంలో ఇంగ్లిష్ వ్యాఖ్యాత ఇసా గుహా చేసిన కామెంట్స్ పెద్ద వివాదంగా మారాయి. "బుమ్రా జట్టుకు MVP. జస్ప్రీత్ బుమ్రా అత్యంత విలువైన ప్రైమేట్ . అతను భారతదేశానికి అత్యంత ప్రభావవంతమైన ప్లేయర్."

ఇసా గుహా క్షమాపణలు 
తర్వాత ఇసా గుహా తన 'ప్రైమేట్' వ్యాఖ్యకు క్షమాపణలు చెప్పారు. జస్ప్రీత్ బుమ్రాకు గౌరవం ఇవ్వడమే తన ఉద్దేశమని చెప్పారు. క్షమాపణలు కోరుతూ, "నిన్న కామెంటరీ టైంలో నేను వేల అర్థాలు చెప్పగల పదాన్ని ఉపయోగించాను. నా వ్యాఖ్య వల్ల ఎవరైనా బాధపడి ఉంటే ప్రతి ఒక్కరికీ క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. నేను ఇతరులను చాలా గౌరవిస్తాను." అని పేర్కొన్నారు. 

'ప్రైమేట్' అనే పదానికి అర్థం పెద్ద మెదడు ఉన్న కోతి అని అర్థం వచ్చేలా ఉంది. 2008లో జరిగిన 'మంకీగేట్ స్కాండల్'ని 'కోతి' ప్రస్తావన మళ్లీ గుర్తుకు తెచ్చినందున అది వివాదానికి కారణమైంది. వాస్తవానికి 2008లో సిడ్నీలో భారత్-ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఆ సమయంలో భారత దిగ్గజ స్పిన్ బౌలర్ హర్భజన్ సింగ్ ఆండ్రూ సైమండ్స్‌ను 'కోతి' అని సంబోధించాడని ఆరోపించారు.

నిబంధనలను ఉల్లంఘించినందుకు హర్భజన్ సింగ్ ఆ సమయంలో మూడు మ్యాచ్‌ల నిషేధానికి గురయ్యాడు. ఇప్పుడు 2024లో బ్రిస్బేన్ టెస్ట్ గురించి మాట్లాడుతూ, ఇసా గుహా 'ప్రైమేట్' అని పిలిచిన వెంటనే ప్రజలు సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం ప్రారంభించారు.  దీంతో ఆమె క్షణమాపణలు చెప్పారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ustad Zakir Hussain : అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన జాకీర్ హుస్సేన్ - అస్తమించారని పుకార్లు- ఆయన సోదరి ABPతో ఏమని చెప్పారంటే? 
అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన జాకీర్ హుస్సేన్ - అస్తమించారని పుకార్లు- ఆయన సోదరి ABPతో ఏమని చెప్పారంటే? 
Bigg Boss 8 Telugu Winner: బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్‌గా నిఖిల్ - రన్నర్‌తో సరిపెట్టుకున్న గౌతమ్!
బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్‌గా నిఖిల్ - రన్నర్‌తో సరిపెట్టుకున్న గౌతమ్!
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
IND vs AUS: బ్రిస్బేన్‌లో భారత్‌ ముందు భారీ స్కోర్‌- ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌట్‌; బుమ్రాకు 6 వికెట్లు 
బ్రిస్బేన్‌లో భారత్‌ ముందు భారీ స్కోర్‌- ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌట్‌; బుమ్రాకు 6 వికెట్లు 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ustad Zakir Hussain : అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన జాకీర్ హుస్సేన్ - అస్తమించారని పుకార్లు- ఆయన సోదరి ABPతో ఏమని చెప్పారంటే? 
అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన జాకీర్ హుస్సేన్ - అస్తమించారని పుకార్లు- ఆయన సోదరి ABPతో ఏమని చెప్పారంటే? 
Bigg Boss 8 Telugu Winner: బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్‌గా నిఖిల్ - రన్నర్‌తో సరిపెట్టుకున్న గౌతమ్!
బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్‌గా నిఖిల్ - రన్నర్‌తో సరిపెట్టుకున్న గౌతమ్!
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
IND vs AUS: బ్రిస్బేన్‌లో భారత్‌ ముందు భారీ స్కోర్‌- ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌట్‌; బుమ్రాకు 6 వికెట్లు 
బ్రిస్బేన్‌లో భారత్‌ ముందు భారీ స్కోర్‌- ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌట్‌; బుమ్రాకు 6 వికెట్లు 
Telangana Weather: తెలంగాణలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు- హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పతనం- ఏపీలోని ఈ జిల్లాలకు వర్షసూచన
తెలంగాణలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు- హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పతనం- ఏపీలోని ఈ జిల్లాలకు వర్షసూచన
Best Chess Apps: ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
TSPSC Group 2 Exam: సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
Manchu Manoj Vs Manchu Vishnu: మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
Embed widget