Telangana Weather: తెలంగాణలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు- హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పతనం- ఏపీలోని ఈ జిల్లాలకు వర్షసూచన
Telangana And Hyderabad Weather:తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. తెలంగాణలో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంది. బయటకు రావాలంటే జనం భయపడుతున్నారు.
Telangana and Andhra Pradesh Weather Today : తెలంగాణలో చలి పంచా విసురుతోంది. రికార్డుస్థాయిల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. హైదరాబాద్‌లోని వాతావరణ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం... మరో రెండు రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోనున్నాయి. ఆకాశం మేఘావృతమై ఉంటుందని పేర్కొంది. ఉదయం వేళలో పొగమంచు ఇబ్బంది పెట్టనుంది. దీని కారణంగా ఉదయం నడకకు వెళ్లే వాళ్లకు, వాహనదారులు ఇబ్బంది పడనున్నారు. తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు 11.73 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు అయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 11.70 డిగ్రీల సెల్సీయస్‌గా నమోదైనట్టు వాతావరణ శాఖ పేర్కొంది. ఆదిలాబాద్, కొమరం భీం ఆసీఫాబాద్, మెదక్ జిల్లాలలో కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీలుగా నమోదు అయింది. ఇవాళ రాష్ట్రంలో 15 డిగ్రీల కంటే తక్కువ నమోదు అయ్యే అవకాశం ఉంది. గరిష్ణ ఉష్ణోగ్రత దాదాపు 25 డిగ్రీల వరకు నమోదు అయ్యే ఛాన్స్ ఉంది.
హైదరాబాద్‌లో వాతావరణం(Hyderabad Weather Today):-
హైదరాబాద్లో కనిష్ట ఉష్ణోగ్రత 15.67 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రత27.97 డిగ్రీలు నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. సోమవారం మంగళవారం కూడా మరో రెండు నుంచి నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టొచ్చని తెలుస్తోంది. హైదరాబాద్‌లో రాత్రి 9 గంటల సమయంలో రికార్డు స్థాయిలో మౌలాలీ, హైదరాబాద్ యూనివర్శిటీ వద్ద 13.9 సెల్సియస్ డిగ్రీలుగా నమోదు అయింది. ఉదయానికి ఇది సిటీ శివారులో 8 నుంచి 9 డిగ్రీలకు పడిపోయే ప్రమాదం ఉంది. సిటీ మధ్యలో 10-11°డిగ్రీలు నమోదు అయ్యే అవకాశం ఉంది.
Also Read:'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
తెలంగామలో ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలలో శీతల గాలులు కారణంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయి. ఈ జిల్లాలతోపాటు హైదరాబాద్, రాజేంద్రనగర్, పటాన్చెరువు, హకీంపేట, మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాద్, రామగుండంలలో ఉష్ణోగ్రతలు పడిపోనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ వాతావరణం (Andhra Pradesh Weather Today)
దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ తెలిపింది. ఇదిఅల్పపీడనంగా మారి ఆ తదుపరి 48 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశం ఉంది. దీని కారణంగా రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంటుంది. దీని ప్రభావంతో సోమవారం ప్రకాశం, నెల్లూరు,రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళవారం కోస్తా, రాయలసీమలో విస్తారంగా మోస్తరు వర్షాలు, చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ తెలిపింది.
Also Read: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
దీని ప్రభావంతో సోమవారం ప్రకాశం,నెల్లూరు,రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) December 13, 2024
మంగళవారం కోస్తా,రాయలసీమలో విస్తారంగా మోస్తరు వర్షాలు, కుచెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
(2/2) pic.twitter.com/R4Ilw22d7G
16th December:
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) December 15, 2024
• Light to Moderate rain is likely to occur at isolated places in Nellore, Annamayya, Chittoor and Tirupathi districts.
~#APSDMA