అన్వేషించండి

Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!

SCR: శబరిమలకు భక్తుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. విజయవాడ - కొల్లాం, కాకినాడ - కొల్లాం వరకు అదనపు సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి.

SCR Special Trains To Sabarimala: తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల (Sabarimala) వెళ్లే అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) గుడ్ న్యూస్ చెప్పింది. రద్దీ దృష్ట్యా ఇప్పటికే పలు ప్రత్యేక రైళ్లను (Special Trains) ప్రకటించగా.. మరిన్ని అదనపు రైళ్లను నడపనుంది. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన జారీ చేసింది. ఈ నెల 21, 28 తేదీల్లో విజయవాడ - కొల్లాం (రైలు నెం. 07177) ప్రత్యేక రైలు విజయవాడలో రాత్రి 10:15కి బయలుదేరి, రెండో రోజు ఉదయం 6:20కి కొల్లాం చేరుకుంటుంది. ఈ నెల 16, 23, 30 తేదీల్లో కొల్లాంలో రైలు (నెం. 07178) ఉదయం 10:45కి బయలుదేరి, రెండో రోజు రాత్రి 9 గంటలకు కాకినాడ టౌన్ చేరుతుంది.

వచ్చే ఏడాది జనవరి 1, 8 తేదీల్లో కాకినాడ - కొల్లాం ప్రత్యేక రైలు (నెం. 07179) రాత్రి 11:50కి కాకినాడలో బయలుదేరి, రెండో రోజు ఉదయం 5:30 కు కొల్లాం చేరుకుంటుంది. జనవరి 15, 22 తేదీల్లో నర్సాపూర్ - కొల్లాం (నెం. 07183) ప్రత్యేక రైలు నర్సాపూర్‌లో రాత్రి 9 గంటలకు బయలుదేరి, రెండో రోజు ఉదయం 5:30 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు జనవరి 17, 24 తేదీల్లో కొల్లాంలో ఉదయం 8:40 కు బయలుదేరి, రెండో రోజు సాయంత్రం 06:30 కు నర్సాపూర్ చేరుతుంది.

మరిన్ని సర్వీసుల వివరాలు

కాగా, ఇటీవలే మరిన్ని అదనపు సర్వీసులు సైతం దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. జనవరి 3 నుంచి ఫిబ్రవరి 1 వరకూ 34 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. హైదరాబాద్ - కొట్టాయం, కొట్టాయం - సికింద్రాబాద్, మౌలాలి - కొట్టాయం, కాచిగూడ - కొట్టాయం, మౌలాలి - కొల్లం మధ్య జనవరి 3 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకూ ఈ ప్రత్యేక సర్వీసులు సేవలందించనున్నాయి.

హైదరాబాద్ - కొట్టాయం - సికింద్రాబాద్ ప్రత్యేక రైళ్లు (07065/07066) మొత్తంగా 8 సర్వీసులు మంగళ, బుధవారాల్లో అందుబాటులో ఉండనున్నాయి. మౌలాలి - కొట్టాయం - సికింద్రాబాద్ (07167/07168) శుక్ర, శనివారాల్లో, మాలాలి - కొల్లం - మాలాలి (07170/07172) ప్రత్యేక రైళ్లు శని, సోమవారాల్లో అందుబాటులో ఉండనున్నాయి. కాచిగూడ - కొట్టాయం - కాచిగూడ (07169/07170) ప్రత్యేక రైళ్లు ఆది, సోమవారాల్లో నడపనున్నారు. ఈ రైళ్లల్లో ఏసీ బోగీలతో పాటు స్లీపర్, జనరల్ కోచ్‌లు సైతం ఉంటాయని ద.మ.రైల్వే అధికారులు తెలిపారు. ఇప్పటివరకూ దాదాపు 100కు పైగా అదనపు సర్వీసులను ద.మ రైల్వే శబరిమలకు అందుబాటులోకి తెచ్చింది. అటు, క్రిస్మస్, సంక్రాంతి దృష్ట్యా మరిన్ని సర్వీసులను ఏర్పాటు చేసే ఛాన్స్ ఉంది.

Also Read: Viral News: దెయ్యం దెబ్బకు అక్కడ మొత్తం ఇళ్లు ఖాళీ, రెవెన్యూ రికార్డుల్లో మాత్రమే ఆ ఊరి పేరు

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
TDP First List: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ తొలి జాబితా విడుదల.. బీసీలు, మహిళలకు పెద్దపీట
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ తొలి జాబితా విడుదల.. బీసీలు, మహిళలకు పెద్దపీట
Special Trains: విజయవాడ - విశాఖ మధ్య సహా పలు ప్రత్యేక రైళ్లు.. సికింద్రాబాద్ – నహర్లగూన్ స్పెషల్ సర్వీస్
విజయవాడ - విశాఖ మధ్య సహా పలు ప్రత్యేక రైళ్లు.. సికింద్రాబాద్ – నహర్లగూన్ స్పెషల్ సర్వీస్
Dasara Holidays: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Holidays: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Ranabaali Day 1 Collections : రణబాలి ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీ... విరోష్ కపుల్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?
రణబాలి ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీ... విరోష్ కపుల్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఒక్క మూవ్‌తో గేమ్ మార్చేసిన త్రిగుణ్! ముకేశ్‌ని హర్ట్‌ చేసిన ఝాన్సీ! కెప్టెన్‌గా రాంప్రసాద్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఒక్క మూవ్‌తో గేమ్ మార్చేసిన త్రిగుణ్! ముకేశ్‌ని హర్ట్‌ చేసిన ఝాన్సీ! కెప్టెన్‌గా రాంప్రసాద్!
Surya Luxury Living:  దుబాయ్‌లో షారుఖ్ ఖాన్ ప్రాజెక్టులో లగ్జరీ ఇల్లు కొన్న సూర్యకుమార్ యాదవ్, వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ సరికొత్త ఇన్వెస్ట్‌మెంట్
దుబాయ్‌లో షారుఖ్ ఖాన్ ప్రాజెక్టులో లగ్జరీ ఇల్లు కొన్న సూర్యకుమార్ యాదవ్, వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ సరికొత్త ఇన్వెస్ట్‌మెంట్
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
కారు ధరకు బైక్.. Royal Enfield Classic 650 హైపర్‌షిఫ్ట్- ఫీచర్లు, ప్రత్యేకతలు ఇవే
కారు ధరకు బైక్.. Royal Enfield Classic 650 హైపర్‌షిఫ్ట్- ఫీచర్లు, ప్రత్యేకతలు ఇవే
Embed widget