అన్వేషించండి

Viral News: దెయ్యం దెబ్బకు అక్కడ మొత్తం ఇళ్లు ఖాళీ, రెవెన్యూ రికార్డుల్లో మాత్రమే ఆ ఊరి పేరు

అదో చక్కని పల్లె. చుట్టూ కొండలతో ప్రకృతి రమణీయత ఉట్టిపడే గ్రామం. కానీ కొన్నేళ్లుగా ఆ గ్రామం కేవలం రెవెన్యూ రికార్డుల్లో మాత్రమే కనిపిస్తోంది. దెయ్యం దెబ్బకు అక్కడ నివాసాలన్ని ఖాళీ అయిపోయాయి.

Srikakulam News | శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం నర్సింగపల్లి పంచాయితీలోని అక్కువరం సీతాపురం గ్రామం ఓ ప్రత్యేకమైంది. సీతాపురం... ఈ గ్రామం పేరు వినటానికి ఎంత అందంగా ఉందో.... దాని గురించి తెలిస్తే మాత్రం అంతకు మించి వణుకు పుడుతుంది. అక్కువరం సీతాపురం గ్రామo వెళ్ళటానికి దారి ఎటు అని చుట్టుపక్కల గ్రామాల ప్రజలను ఎవరైనా అడిగితే చాలు, వారంతా వణికి పోతారు. ఇదంతా ముప్ఫై ఏళ్ల కిందటిదే అయినా ఆ గ్రామ పొలిమేరల్లోకి వెళ్లాలంటే చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఇప్పటికీ భయమే. ఇప్పటికీ ఆ గ్రామం ముఖం కూడా చూడరు.

మార్గం తెలియక దారి అడిగితే వణికిపోతున్నారు

సీతాపురం వెళ్లాలంటే తిరుచనాపల్లి అనే గ్రామం నుంచి కిలో మీటరున్నర దూరం కాలినడకన వెళ్ళాలి అప్పటి గ్రామంలోని వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు వెళ్లిన బృందానికి ఆ గ్రామం వెల్లే మార్గం తెలియక గ్రామస్తులను రమ్మని కోరగా ఆ దెయ్యాల గ్రామానికి తాము రామంటూ తెగేసి చెప్పేసారు. చివరకు కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళాక మార్గమధ్యంలో పొలాల్లో తారసపడిన ఇద్దరు స్థానికులను కౌన్సిలింగ్ ఇచ్చి బతిమలాడితే సీతాపురం గ్రామానికి తోవ చూపేందుకు సాహసించి వచ్చారు. అంటే అక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు సీతాపురం గ్రామానికి తీసుకువెళ్లాక ముందుగా అక్కడి గ్రామదేవత గుడికి తీసుకువెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకున్నాకే కవర్ చేయండి అంటూ సూచించారు.


Viral News: దెయ్యం దెబ్బకు అక్కడ మొత్తం ఇళ్లు ఖాళీ, రెవెన్యూ రికార్డుల్లో మాత్రమే ఆ ఊరి పేరు

ముప్పయ్యేళ్లు వెనక్కి వెళ్లాలి..

అంతటి ప్రత్యేకమైన ఈ అక్కువరం సీతాపురం గ్రామం గురించి తెలుసుకోవాలి అంటే మాత్రం ఒక ముప్పయ్యేళ్ళు వెనక్కి వెళ్లాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ గ్రామం కేవలం రెవెన్యూ రికార్డుల్లో మాత్రమే ఉంది. ఈ గ్రామంలోని వారంతా 30 ఏళ్ల క్రిందటే ఊరును ఖాళీ చేసి తలో దిక్కు వెళ్లిపోయారు. బతికుంటే బడిస ఆకైన తిని ఉండవవచ్చనీ బతుకు జీవుడా అంటూ ఇళ్లను, ఉపాధినిచ్చిన పచ్చని పొలాలను సర్వస్వాన్ని వదిలి కుటుంబాలతో సహా వెళ్లిపోయారు. ఒకప్పుడు ఈ గ్రామం నివాసాలతో కలకలాడుతూ ఉండేది. తాగునీరు,సాగునీటికి ఇక్కడ కొదవలేదు. సారవంతమైన పంట పొలాలు. గ్రామాన్ని అనుకొని పర్వతాలు. ఎటు చూసినా ఆహ్లాదకరమైన ప్రకృతి రమణీయత. ఈ గ్రామంలో పిల్ల పాపలతో దాదాపు 30 కుటుంబాలు జీవనం కొనసాగించేవి. కానీ ఇదంతా ముప్పై ఏళ్ల కిందటి మాట.

ప్రస్తుతం ఆ పర్వతాలు, నీటి వసతి, సారవంతమైన భూములు అలాగే ఉన్నాయి కానీ గ్రామంలో మాత్రం మనిషి లేరు. అక్కడి నివాసాలు కూడా పూర్తిగా శిథిలమై పోయాయి. దట్టమైన తోటలతో ఓ అడవిని తలపించేలా,నిర్మానుష్యంగా గ్రామం మారిపోయింది. గ్రామంలో దెయ్యాలు ఉన్నాయన్న భయం ఆ గ్రామాన్ని పూర్తిగా ఖాళీ చేయించేసింది. ఆ గ్రామం గురించి చుట్టుపక్కల ఏ గ్రామస్తుల్ని అడిగిన ఆ గ్రామంలోని దెయ్యాల గురించి కథలు కథలుగా చెబుతారు. ఇప్పటికీ ఆ గ్రామంలో చెట్ల కొమ్మలు ఊగటం, వింత వింత శబ్దాలు రావటం వంటివి జరుగుతూ ఉంటాయని చెబుతారు. అమావాస్య వంటి రోజుల్లో అటువైపు నుండి మరింత పెద్ద శబ్దాలు వినిపిస్తూ ఉంటాయని అంటున్నారు.అందుకే మనుష్యులే కాదు కనీసం మేత కోసం వెల్లే పశువుల్ని సైతం అటువైపు వెళ్ళనీయరు సమీప గ్రామస్తులు.

చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య

అప్పట్లో గ్రామంలో ఓ ఇద్దరు వ్యక్తులు చెట్టుకు ఉరివేసుకొని చనిపోయారు. తర్వాత క్రమంలో వివిధ కారణాలవల్ల గ్రామంలో వేరు వేరు సందర్భాలలో పదిమంది వరకు గ్రామంలోని వారు చనిపోయారు. దీనికి తోడు చెట్లపై నుంచి మట్టి, రాళ్లు,గాజులు వంటివి పడటం  జరిగేవట. జుత్తులు విరబోసుకుంటూ వింత ఆకారంలో మహిళ కనిపించేదని... మరికొందరు ఏ ఆకారం కనిపించకుండా  దగ్గరగా ఎవరో సమీపిస్తున్నట్లు శబ్దాలు వచ్చేవని ఇలా  చుట్టుపక్కల గ్రామాలలోని అప్పటి వారు ఎవరికి తోచిన అనుభవాలను వారు చెబుతు ఉంటారు.పొలం కి వెళ్ళవలసిన వాళ్లు కూడా ఈ దయ్యం భయంకి అటు వైపు కూడా తొంగి చూడటం లేదు.

అటువైపు వెళ్తే తెల్లటి ఆకారం, రా బాబు అంటూ పిలుపు

అటువైపు వెళ్తే తెల్లని ఆకారం పిలుస్తూ ఉంటుందని కొందరు చెబుతుంటారు. మరి కొంతమందికి రా బాబు అని పిలుస్తున్నారని నిన్ను ఏమి అనను అని నాలుగు చేతులతో అంత దూరం నుంచి కనిపిస్తారు అని కొంతమంది గ్రామస్తులు చెబుతున్నారు. సాయంకాలం అయితే అటువైపు వెళ్ళవలసిన వారు కూడా ఆ వైపు కూడా తొంగి చూడరు. చుట్టుపక్కల గ్రామస్తులు కూడా ఆ ఊరు పేరు చెబితే అటువైపు వెళ్తాను అంటే వద్దు అనే అంటారు ఎందుకంటే ఆ దెయ్యం అంతగా భయపెట్టింది. రెవెన్యూ రికార్డుల ప్రకారంగా ఆ ఊరి పేరు ప్రస్తుతానికి ఉంది కానీ అక్కడ ఎటువంటివి మనుషులు ఉండట్లేదు అని రెవెన్యూ అధికారులు కూడా చెబుతున్నారు. గతంలో దెయ్యాలు ఉండేవి అని అందువల్లే అక్కడ ఖాళీ చేసి వెళ్లిపోయారని స్థానికులు చెబుతూ ఉంటారు. మా పరంగా అయితే రెవెన్యూ రికార్డులో అది నమోదు చేయాలి కనుక ఆ గ్రామాన్ని నమోదు చేయడానికి ఆ ప్రాంతానికి వెళ్లి మేము కూడా నమోదు చేసుకొని వచ్చాము అక్కడ చూస్తే పునాదులు మట్టి గోడల తప్ప ఇంకేమీ లేవు అని రెవెన్యూ అధికారి ఆ గ్రామ విఆర్వో భానుమూర్తి ఏబీపీతో చెప్పారు.

Also Read: Fake Currency Case: దొంగనోట్ల ముఠా గుట్టురట్టు చేసిన క్యాష్‌ డిపాజిట్‌ మెషీన్‌, చిన్న డౌట్‌తో తేలిన స్కామ్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
PV Sindhu Engagement: ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
Daaku Maharaaj First Single: దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
What is KYC Scam: కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?
కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
PV Sindhu Engagement: ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
Daaku Maharaaj First Single: దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
What is KYC Scam: కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?
కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?
Allu Arjun Vs Revanth: సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్
సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్
Vaikunta Dwara Darshanam: వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు, 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు, 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
Best Budget CNG Cars: రోజువారీ వాడకానికి బెస్ట్ బడ్జెట్ సీఎన్‌జీ కార్లు ఇవే - టాప్-3 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
రోజువారీ వాడకానికి బెస్ట్ బడ్జెట్ సీఎన్‌జీ కార్లు ఇవే - టాప్-3 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
Suchir Balaji: మన సుచిర్ బాలాజీని అమెరికాలో చంపేశారా ? - మస్క్‌కీ డౌటే - ఎవరిపని ?
మన సుచిర్ బాలాజీని అమెరికాలో చంపేశారా ? - మస్క్‌కీ డౌటే - ఎవరిపని ?
Embed widget