Ustad Zakir Hussain : అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన జాకీర్ హుస్సేన్ - అస్తమించారని పుకార్లు- ఆయన సోదరి ABPతో ఏమని చెప్పారంటే?
Ustad Zakir Hussain Death News | జాకీర్ హుస్సేన్ సోదరి ఖుర్షీద్ ఆలియా ఏబీపీతో మాట్లాడుతూ తబలా ప్లేయర్ మృతి వార్త అబద్ధమని పేర్కొన్నారు. ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.
Zakir Hussain: లండన్‌లో ఉంటున్న జహీర్ హుస్సేన్ అక్క ఖుర్షీద్ ఔలియాతో ఏబీపీ న్యూస్ మాట్లాడింది. తన సోదరుడు జాకీర్ హుస్సేన్ మరణ వార్త అబద్ధమని ఖుర్షీద్ ఔలియా అన్నారు.
ప్రస్తుతం శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ ఆసుపత్రిలో ఉన్నారని, మరణ వార్తలన్నీ అవాస్తవమని తన కూతురు చెప్పిందని ఖుర్షీద్ చెప్పారు. పరిస్థితి విషమంగా ఉందని, అయితే ఆయన బతికే ఉన్నారని ఖుర్షీద్ ABP న్యూస్‌తో అన్నారు. జాకీర్ హుస్సేన్ సోదరి తన అసహనం వ్యక్తం చేస్తూ.. ఆయన మరణ వార్తను ఎవరి తరపున ప్రచారం చేస్తున్నారని, ఆయన మరణాన్ని ధృవీకరిస్తూ కుటుంబ సభ్యులు ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయనప్పుడు ఎందుకు అలా చేస్తున్నారని అన్నారు.
తను కూడా అమెరికా వెళ్లాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల వెళ్లలేకపోయానని, కూతుర్ని అక్కడికి పంపాల్సి వచ్చిందని ఖుర్షీద్ తెలిపారు. విపరీతమైన పని, పరుగు, అలసట, విశ్రాంతి లేకపోవడం, ఆహారంపై శ్రద్ధ పెట్టకపోవడం జకీర్ గుండె, కాలేయంపై ప్రభావం చూపాయని ఖుర్షీద్ తెలిపారు.
మరణ వార్తను ఈ విధంగా ప్రచారం చేయవద్దని ఖుర్షీద్ ప్రజలకు, మీడియాకు విజ్ఞప్తి చేశారు.
జాకీర్ హుస్సేన్ ఎవరు?
జాకీర్ హుస్సేన్ ప్రముఖ తబలా వాద్యకారుడు అల్లా రఖా ఖాన్ కుమారుడు. జాకీర్ హుస్సేన్ 7 సంవత్సరాల వయస్సు నుంచే తబలా నేర్చుకోవడం ప్రారంభించారు.12 సంవత్సరాల వయస్సులో అతను దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ప్రదర్శన ఇవ్వడం ప్రారంభించారు.
జాకీర్ హుస్సేన్ అవార్డులు
భారత ప్రభుత్వం జాకీర్ హుస్సేన్‌ను 1988లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్ 2023లో పద్మవిభూషణ్ వంటి అత్యున్నత పురస్కారాలతో సత్కరించింది. జాకీర్ హుస్సేన్‌కు 1990లో సంగీత అత్యున్నత పురస్కారమైన 'సంగీత నాటక అకాడమీ అవార్డు' కూడా లభించింది. ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ తన కెరీర్‌లో 7 సార్లు గ్రామీ అవార్డుకు నామినేట్ అయ్యారు. అందులో అతను నాలుగు సార్లు ఈ అవార్డును గెలుచుకున్నారు