అన్వేషించండి

Andhra Pradesh News: జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!

Jogi Ramesh News: జగన్ మోహన్ రెడ్డికి మరో షాక్ ఇచ్చేందుకు కీలక వైసీపీ నేత సిద్ధమవుతున్నారా? అందుకే కూటమి నేతలతో ర్యాలీలో పాల్గొన్నారా అనే చర్చ నడుస్తోంది.

Krishna District News: ఉమ్మడి కృష్ణాజిల్లా నూజివీడులో చాలా ఆసక్తికర సంఘటన జరిగింది. వైసిపి కీలక నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కూటమి నేతలతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. మంత్రి పార్థసారథితో కలిసి ఊరు మొత్తం ర్యాలీగా తిరిగారు. గౌత లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం సందర్భంగా టిడిపి నేతలతోపాటు వైసిపి నేత హాజరు కావడంపై ఒక్కసారిగా రాజకీయాల్లో చర్చ మొదలైంది.

2024 ఎన్నికల తర్వాత వైసీపీకి పలువురు గుడ్‌ బై

ఇప్పటికే పలువురు వైసిపి నేతలు 2024 ఎన్నికల ఫలితం తర్వాత జగన్‌కు బై బై చెప్పి కూటమి వైపు అడుగులు వేశారు. వారిలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, కిలారు రోశయ్య లాంటి వారు ఉన్నారు. ప్రస్తుతానికి ఏ పార్టీలోనూ చేరకపోయినా వైసీపీ నుంచి బయటకు వచ్చేసిన వాళ్ళలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, ఆళ్ళ నాని,గ్రంధి శ్రీనివాస్,రాపాక వర ప్రసాద్,వాసిరెడ్డి పద్మ లాంటి ప్రముఖులు ఉన్నారు. ఇక పార్థసారథి, లావు శ్రీకృష్ణదేవరాయలు, వసంత కృష్ణ ప్రసాద్ లాంటి వారు ఎన్నికలకు ముందే జగన్‌కు టాటా చెప్పేసి కూటమి వైపు వచ్చేశారు. ఇప్పుడు జోగి రమేష్ కూటమినేతలతో కలిసి కనపడేసరికి ఏపీ పాలిటిక్స్‌లో కొత్త డిస్కషన్ మొదలైంది.

Also Read: పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు

ఇటీవల కాలంలో కాస్త జోరు తగ్గిన జోగి రమేష్ 
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ కు అత్యంత విధేయుల్లో ఒకరిగా జోగి రమేష్ మెలిగారు. దానికి తగ్గట్టే ఆయనను మంత్రిని చేసిన జగన్ అప్పటి మైలాపురం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, జోగి రమేష్ మధ్య నెలకొన్న వివాదాల్లో ఇద్దరూ తన పార్టీ వారే అయినా జోగి రమేష్ వైపే నిలబడ్డారు. వసంత కృష్ణ ప్రసాద్ పార్టీ మారడం వెనక ఇది కూడా ఒక కారణం అని ఆయనే చెప్పుకొచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి చేశారన్న ఆరోపణ కూడా జోగి రమేష్ ఎదుర్కొంటున్నారు. దీనిపై నమోదైన కేసులో ఇప్పటికే పోలీసులు జోగి రమేష్‌ను విచారించారు. వీటన్నిటి నేపథ్యంలో గత కొంతకాలంగా జోగి రమేష్ రాజకీయంగా తన స్పీడ్ తగ్గించారు. అయితే ఎప్పుడూ జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాత్రం మాట్లాడలేదు.

విగ్రహ ఆవిష్కరణ కోసమే ర్యాలీ 
రాజకీయంగా చర్చ ఎలా ఉన్నా తాజాగా వైసీపీ నేత జోగి రమేష్ నూజివీడులో జరిగిన ర్యాలీలో పాల్గొన్నది కేవలం ఒక ప్రైవేట్ కార్యక్రమం గానే చూడాలని జోగి రమేష్ వర్గీయులు చెబుతున్నారు. ఇందులో సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణ కోసమే కూటమి నేతలు పార్థసారథి, కొనికళ్ళ నారాయణ లాంటి వారితో కలిసి పాల్గొన్నారని చెబుతున్నారు. తన పార్టీ నేతలు తనతో మాత్రమే ఉండాలని భావిస్తారని పేరున్న వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి ఈ అంశాన్ని ఎలా తీసుకుంటారో చూడాలి.

Also Read: 2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Indigo Issue: ఇండిగోకు వెసులుబాట్లు, ఇతర సంస్థల అదనపు సర్వీసులు - విమానాల సమస్య పరిష్కారానికి రామ్మోహన్ నాయుడు వార్ రూమ్
ఇండిగోకు వెసులుబాట్లు, ఇతర సంస్థల అదనపు సర్వీసులు - విమానాల సమస్య పరిష్కారానికి రామ్మోహన్ నాయుడు వార్ రూమ్
Russia India trade ties: మరో ఐదేళ్లు వాణిజ్య బంధం బలోపేతం - మోదీ, పుతిన్ ఉమ్మడి ప్రకటన
మరో ఐదేళ్లు వాణిజ్య బంధం బలోపేతం - మోదీ, పుతిన్ ఉమ్మడి ప్రకటన
Hawala money seizure: కారులో ఎక్కడ చూసినా నోట్ల కట్టలే .. షాక్ అయిన పోలీసులు - ఎవరి డబ్బు ?
కారులో ఎక్కడ చూసినా నోట్ల కట్టలే .. షాక్ అయిన పోలీసులు - ఎవరి డబ్బు ?
Minister Ponguleti: ఎల్పీనగర్ సీరీస్ భూముల్ని రియల్ ఎస్టేట్‌కు ఇచ్చింది కేటీఆరే - మంత్రి పొంగులేటి సంచలన ఆరోపణలు
ఎల్పీనగర్ సీరీస్ భూముల్ని రియల్ ఎస్టేట్‌కు ఇచ్చింది కేటీఆరే - మంత్రి పొంగులేటి సంచలన ఆరోపణలు

వీడియోలు

Vintage Virat Kohli | సఫారీలతో రెండో వన్డేలో వింటేజ్ స్టైల్లో సెలబ్రేట్ చేసుకున్న విరాట్
Ruturaj Gaikwad Century in India vs South Africa ODI |  అన్నా! నువ్వు సెంచరీ చెయ్యకే ప్లీజ్ | ABP Desam
Harbhajan Singh about Rohit Sharma Virat Kohli | రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్‌పై హర్బజన్ సింగ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్
PM Modi Protocol Break at Putin Welcome | రష్యా అధ్యక్షుడికి ఆత్మీయ ఆలింగనంతో మోదీ స్వాగతం | ABP Desam
Akhanda 2 Premieres Cancelled | భారత్ లో నిలిచిన బాలకృష్ణ అఖండ 2 ప్రీమియర్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indigo Issue: ఇండిగోకు వెసులుబాట్లు, ఇతర సంస్థల అదనపు సర్వీసులు - విమానాల సమస్య పరిష్కారానికి రామ్మోహన్ నాయుడు వార్ రూమ్
ఇండిగోకు వెసులుబాట్లు, ఇతర సంస్థల అదనపు సర్వీసులు - విమానాల సమస్య పరిష్కారానికి రామ్మోహన్ నాయుడు వార్ రూమ్
Russia India trade ties: మరో ఐదేళ్లు వాణిజ్య బంధం బలోపేతం - మోదీ, పుతిన్ ఉమ్మడి ప్రకటన
మరో ఐదేళ్లు వాణిజ్య బంధం బలోపేతం - మోదీ, పుతిన్ ఉమ్మడి ప్రకటన
Hawala money seizure: కారులో ఎక్కడ చూసినా నోట్ల కట్టలే .. షాక్ అయిన పోలీసులు - ఎవరి డబ్బు ?
కారులో ఎక్కడ చూసినా నోట్ల కట్టలే .. షాక్ అయిన పోలీసులు - ఎవరి డబ్బు ?
Minister Ponguleti: ఎల్పీనగర్ సీరీస్ భూముల్ని రియల్ ఎస్టేట్‌కు ఇచ్చింది కేటీఆరే - మంత్రి పొంగులేటి సంచలన ఆరోపణలు
ఎల్పీనగర్ సీరీస్ భూముల్ని రియల్ ఎస్టేట్‌కు ఇచ్చింది కేటీఆరే - మంత్రి పొంగులేటి సంచలన ఆరోపణలు
Mega PTM: ఇష్టపడి చదివితే విజయం మీదే - మెగా పీటీఎంలో విద్యార్థులకు చంద్రబాబు సలహా
ఇష్టపడి చదివితే విజయం మీదే - మెగా పీటీఎంలో విద్యార్థులకు చంద్రబాబు సలహా
Hydra Ranganath: చెరువుల కబ్జాకు సహకరించిన అధికారులకు హైడ్రా దెబ్బ -రంగనాథ్ ఫిర్యాదులతోనే ఏసీబీ దాడులు
చెరువుల కబ్జాకు సహకరించిన అధికారులకు హైడ్రా దెబ్బ -రంగనాథ్ ఫిర్యాదులతోనే ఏసీబీ దాడులు
IndiGo Flights Cancelled: ఇండిగో విమానం రద్దుతో పెళ్లి జంట లేకుండానే రిసెప్షన్, ఆన్‌లైన్‌లో పాల్గొన్న న్యూ కపుల్!
ఇండిగో విమానం రద్దుతో పెళ్లి జంట లేకుండానే రిసెప్షన్, ఆన్‌లైన్‌లో పాల్గొన్న న్యూ కపుల్!
Ram Gopal Varma : హీరోగా RGV... సెన్సేషనల్ 'షో మ్యాన్' - విలన్ ఎవరో తెలుసా?
హీరోగా RGV... సెన్సేషనల్ 'షో మ్యాన్' - విలన్ ఎవరో తెలుసా?
Embed widget