Shakunam: పిల్లి మాత్రమే కాదు.. ఇవి ఎదురైనా తలచిన పనులు జరగవట..
శకునం..ఈ మాట పట్టించుకోని వాళ్లపై పెద్దగా ప్రభావం ఉండదో ఏమో కానీ పట్టించుకునేవారికి మాత్రం ఆ లెక్కే వేరు. ఆ రోజు మొత్తం ఏ జరిగినా శకునమే కారణం అని ఫిక్సైపోతారు. ఇంతకీ మంచి శకునాలేవి,చెడు శకునాలేవి.
పిల్లి మనకి ఎదురు పడితె..పనులు ఏవి జరగవంట
మనం పిల్లికెదురుపడితే కర్మకాలి చచ్చునంట
బల్లి పలుకు సత్యమంట..బల్లి పలుకు దోషమంట
నక్క తోక లక్కు అంట..నక్క అరుపు మృత్యువంట
ఇది ఓ పాటలో సాహిత్యం. వింటుంటే ఇది నిజమే అనేవారు కొందరైతే...మీరు మరీనూ శకునం అంటే అంత తేలిగ్గా తీసుకునే విషయం కాదంటారు మరికొందరు. అందుకే కొంతమంది తిధి, వారం, నక్షత్రం లాంటివి కూడా చూసుకుని బయలుదేరితే మరికొందరు శకునాలు, సంకేతాలు చూసుకుంటారు. మన పూర్వీకుల నుంచి వస్తున్న నమ్మకమేంటంటే మంచి శకునం చూసుకుని వెళ్లడం వలన, తలపెట్టిన కార్యం ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తవుతుందని. అందుకే మంచి శకునాలు, చెడు శకునాలు అంటూ కొన్ని చెబుతుంటారు పెద్దలు.
Also Read: ఈ రాశివారు ఈ రోజంతా పాత జ్ఞాపకాల్లోనే..మీ రాశి ఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి...
మంచి శకునాలు
- మీరు ఇంటి నుంచి బయటకు ఎక్కడికైనా బయలుదేరే సమయంలో పసుపు, కుంకుమలతో, జడవేసుకుని కలకళలాడే ముత్తైదువు ఎదురైనట్లైతే అంతా శుభమే జరుగుతుంది.
- ఆ ముత్తైదువే జుట్టు విప్పుకుని కనిపిస్తే కీడు జరుగుతుందట
- నీళ్ళు, పాలు, పెరుగు, అన్నం పట్టుకున్న వారు, చాకలి, చెఱకు గెడలు మేసుకొచ్చేవాడు, ఇద్దరు బ్రాహ్మణులు ఎదురుగా వస్తే ఇవన్నీ మంచి శకునాలు.
- జీవరాశుల్లో నెమలి, కోడి, చిలుక, కొంగ, కుందేలు, నక్క, గాడిద, ఆవు, జింక, ఉడత..ఇవి మనకు ఎడమ నుంచి కుడికి వెళితే మంచి శకునాలట.
- ప్రయాణానికి సిద్ధమైనప్పుడు మగళధ్వనుల వినిపించినా , గంట ధ్వని వినిపించినా శుభప్రదమే
- బయట అడుగుపెట్టేటప్పుడు ఏదైనా శుభవార్త వినిపించినా, పిల్లలతో కలసి దంపతులు ఎదురైనా నిస్సందేహంగా బయలుదేరొచ్చు
Also Read: మీ ఇంటి ఆవరణలో ఈ మొక్కలు ఉన్నాయా… అయితే దురదృష్టాన్ని తెచ్చిపెట్టుకున్నట్టే..
చెడు శకునాలు
- బయలుదేరే సమయంలో ఏడుపు వినిపించడం అస్సలు శుభసూచకం కాదంటారు పండితులు
- అకాల వర్షం, తుమ్ములు , బల్లి మీదపడడం, గొడవ పెట్టుకుని వెళ్లడం ఇవన్నీ చెడు శకునాలే
- వితంతువు, జుట్టువిరబోసుకున్న స్త్రీ, గుండుతో ఉన్న స్త్రీ ఎదురొస్తే తలపెట్టిన పని జరగదని చెబుతారు
- ముగ్గురు వైశ్యులు, జంటశూద్రులు, కషాయబట్టలు కట్టినవారు, ఒక్క బ్రాహ్మణుడు, అంగ వైకల్యం ఉన్నవారు, గర్భిణీ,బిచ్చగాడు ఎదురొస్తే అన్నీ అశుభాలే అంటారు
- పిల్లి, పాము, కొత్తకుండ, నూనె, కట్టెలమోపు, కుంటికుక్క, ఉప్పు, బొగ్గులు, రాళ్ళు, నువ్వులు, మినుములు, గొర్రెలు, పంది, దూది, మజ్జిగ, బూడిద చెడు శకునాలు
- ఆయుధం చేతపట్టుకున్నవాడు, విరోధి, దెబ్బతగలడం, తొట్రుపాటు, మనసు కీడు శంకించడం, అనారోగ్యంగా ఉండడం, గుడ్లగూబ అరవడం ఇవన్నీ అశుభాలే అంటారు
- ఎవరైనా బయలుదేరే సమయంలో వెళ్లొద్దని కోరడం, భోజనం చేసి వెళ్లమని అడగడం అస్సలు చేయరాదట.
- ఇంట్లోంచి ఎవరైన ప్రయాణమై వెళ్లిన వెంటనే ఇల్లు కడగడం , ఇల్లాలు తలస్నానం చేయడం అస్సలు మంచిదికాదంటారు.
ఒకవేళ ఏదైనా శకునం చెడుగా అనిపించినా, బయలుదేరే ముందు చెడువార్త విన్నా ఇంట్లోకి తిరిగొచ్చి కాళ్లు కడుక్కుని కాసేపు కూర్చుని మంచినీళ్లు తాగి ఇష్టదైవానికి నమస్కరించుకుని తిరిగి బయలు దేరితే మంచి జరుగుతందని చెబుతారు వాస్తు పండితులు. ఇవన్నీ మూఢ నమ్మకాలు అస్సలు పట్టించుకోవాల్సిన అవసరం లేదనే వారికి ఏలాంటి టెన్షన్ లేదు.
Also Read: రోజూ ఇంటిముందు ముగ్గేస్తున్నారా.. ఈ విషయాలు తెలుసా మరి..
Also Read: శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించిన రోజు ఇదే... ఈ నెలంతా ప్రత్యేకమే
Also Read: స్వర్గానికి షార్ట్ కట్! రూట్ మ్యాప్ క్లియర్‌గా ఉందిగా!
Also Read: ఫెంగ్‌షుయ్ ప్రకారం ఆ రెండు బొమ్మలు ఇంట్లో ఉంటే భార్య భర్తల మధ్య ప్రేమ పెరుగుతుందట
Also Read: కిచెన్లో పూజామందిరం పెట్టేశారా... దేవుడి మందిరం ఎక్కడ ఉండాలి..ఎక్కడ ఉండకూడదు...
Also Read: ఔను.. అది రాముడి కట్టిన వారధి ! నిర్మాణానికి ఎన్ని రోజులు పట్టిందంటే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి