Spirituality: ఈ సింబల్ మీ ఇంటి ఎంట్రన్స్ లో ఉంటే దృష్టి దోషాలు తగలవు, దుష్ట శక్తులు పారిపోతాయట...
సు+ఆస్తిక్ = స్వస్తిక్ అంటే మంచి జరగాలని అర్థం. శుభకార్యాల సమయంలో స్వస్తిక్ గీయడం వెనుక అర్థం ఇదే. ఆ కార్యక్రమం శుభప్రదంగా విజయవంతం అవుతాయని విశ్వాసం. ఇంకా ఈ గుర్తు ఎంత పవర్ ఫుల్లో తెలుసా…
స్వస్తిక్ విశిష్టత
ఈ చిహ్నం సూర్యుడి గతిని సూచిస్తుందంటారు. అందుకే పూర్వకాలంలో సూర్యుడి పూజలకు చిహ్నంగా ఉండేదట. ఈ గుర్తును మహాలక్ష్మి ప్రతీకగా కూడా చెబుతారు. అందుకే లక్ష్మీపూజ చేసే వ్యాపారులు స్వస్తిక్ గీస్తారు. సరస్వతీ పూజ సమయంలో పుస్తకాలపై కూడా ఈ గుర్తు గీస్తారు. కొందరు పెళ్లిసమయంలో కట్టే బాసికం స్వస్తిక్ ఆకారంలో ఉంటుంది. అంటే వారి దాంపత్య జీవితం సుఖంగా ఉండాలని శుభసూచకంగా కడతారట. కేవలం హిందువులు మాత్రమే కాదు చాలా మతాల వారు దీన్ని ఆధ్యాత్మికంగా ఉపయోగిస్తున్నారట. జుడాయిజం, క్రిస్టియానిటీ, ఇస్లాం , బుద్ధిజం , జైనిజం, టిబెట్, చైనా, జపాన్, గ్రీస్, అజ్టెక్, సెయ్లాన్, హోపీ, సెల్ట్ , మాల్టా వంటి దేశాల్లో ఈ చిహ్నాన్ని దైవసమానంగా భావిస్తారట. సుమారు 12వేల ఏళ్ల క్రితం నుంచి స్వస్తిక్ మనుగడలో ఉందని చరిత్రకారులు చెబుతారు. ఉక్రెయిన్లోని మెజిన్ అనే ప్రాంతంలో ఓ ఏనుగు దంతంపై చెక్కిన పక్షి బొమ్మలో స్వస్తిక్ చెక్కడం చూశారు. సంస్కృ తంలో 'సు' అంటే మంచి, శుభం అని అర్థం. ' అస్తి' అంటే కలుగుగాక అని అర్థం. అందుకే మంచి కలుగుగాక అనే అర్థం రావడంతో అందరికీ ఇదో సెంటిమెంట్.
Also Read: 1 నుంచి 10వ తేదీ వరకూ పుట్టిన వారి ఆలోచనా విధానం ఇలా ఉంటుంది..
పునర్జన్మని సూచించే స్వస్తిక్
- స్వస్తిక్ చిహ్నంలో ఉండే నాలుగు శాఖలు ప్రకృతి , పునర్జన్మను సూచిస్తాయి. అంటే జీవుల పుట్టుక, మరణం ఒకదాని తరువాత ఒకటి నిరంతరాయంగా జరుగుతుందని అర్థం .
- స్వస్తిక్ చుట్టూ వృత్తం గీస్తే వచ్చే చిహ్నం సూర్యుడిని ప్రతిబింబిస్తుంది. అది కాంతికి జన్మస్థానంగా చెబుతారు.
- నాలుగు రేఖలు నాలుగు దిక్కులను..మధ్యలో ఉండే స్థానం శ్రీ మహావిష్ణువు స్థానం అంటారు. అంటే విష్ణువు నాభిలో నుంచి బ్రహ్మ పుట్టాడు కాబట్టి స్వస్తిక్ మధ్యస్థానం నుంచి విశ్వం ఆవిర్భవించిందంటారు.
- స్వస్తిక్ గురించి ఎన్నో చెబుతారు.. స్వస్తిక్ చిహ్నంలో ఒక రేఖను బ్రహ్మదేవుడిగా, మరొక రేఖను నాలుగు వేదాలకు గుర్తుగా, మూడో రేఖను నాలుగు పురుషార్థాలకి సూచికగా, నాలుగో రేఖను ఆశ్రమ ధర్మాలు, నాలుగు వేదాలుగా చెబుతారు.
- ఆఫ్రికా, అమెరికా దేశాల్లో స్వ స్తిక్ చిహ్నాన్ని ఆధ్యా త్మికతకు చిహ్నంగా ఉపయోగిస్తారు.
- జర్మన్ నియంత హిట్లర్ కూడా స్వస్తిక్ చిహ్నాన్ని తన సైన్యంలో ఉపయోగించడంతో దీన్ని చెడుగా కూడా భావించేవారున్నారు.
Also Read: 11 నుంచి 20వ తేదీ వరకూ పుట్టిన వారి ఆలోచనా విధానం ఇలా ఉంటుంది..
స్వస్తిక్ గురించి మరికొన్ని విషయాలు
- ఎడమ వైపుకు తిరిగి ఉండేది లేదా ఎడమ చేతి వాటం ఒకటి
- కుడి వైపు తిరిగి ఉండేది లేదా కుడిచేతి వాటం ఒకటి
- ఎక్కువ మంది వినియోగించేది కుడివైపు తిరిగి ఉండే స్వస్తిక్ నే.
- స్వస్తిక్, ఓం, త్రిశూలం ఈ మూడింటిని ఇంటి ప్రధాన ద్వారంపై అంటించి పెడితే ఇంట్లో దుష్టశక్తులు పారిపోతాయంటారు.
- స్వస్తిక్ ను డోర్ కి అతికిస్తే శుభఫలితాలు ఉంటాయని, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని చెబుతారు.
- పూజా గదిలో స్వస్తిక్ ను ఉంచి పూజ చేస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయంటారు
- స్వస్తిక్ ఉన్న చోట నెగిటివ్ ఎనర్జికి చోటు లేదంటారు
- గృహప్రవేశాలు,పెళ్ళి పత్రికలు,వాహన పూజలు,నూతన యంత్రాలు వాడే సమయంలో పూజలో స్వస్తిక్ తప్పనిసరిగా కనిపిస్తుంది
- ఈ సింబల్ ని ఇంటి గుమ్మానికి కట్టుకుంటే దృష్టి దోషాలు పోతాయంటారు
Also Read: నెలకు రెండుసార్లు మంటతో స్నానం చేసే అమ్మవారు..
ఓవరాల్ గా చెప్పాలంటే అన్నీ ప్రతికూల పరిస్థితులే అనిపించినప్పుడు స్వస్తిక్ ని ఇంటి గుమ్మానికి కట్టినా, పూజా మందిరంలో పెట్టి పూజ చేసినా మనశ్సాంతి లభిస్తుందని, బాధలు దూరమవుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అయితే ఇవన్నీ నమ్మకం, విశ్వాసం ఉన్నవారికి మాత్రమే. వీటిపై నమ్మకం లేదనుకున్న వారు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఫైనల్ గా ఎవరి నమ్మకం వారిదన్నమాట.
Also Read: భారతదేశం అనే పేరుకి కారణం ఒకరు, గోదావరి నదిని భూమిపైకి తీసుకొచ్చింది మరొకరు.. ఈ ఏడుగురి కథే వేరు..
Also Read: శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించిన రోజు ఇదే... ఈ నెలంతా ప్రత్యేకమే
Also Read: స్వర్గానికి షార్ట్ కట్! రూట్ మ్యాప్ క్లియర్‌గా ఉందిగా!
Also Read: ఫెంగ్‌షుయ్ ప్రకారం ఆ రెండు బొమ్మలు ఇంట్లో ఉంటే భార్య భర్తల మధ్య ప్రేమ పెరుగుతుందట
Also Read: కిచెన్లో పూజామందిరం పెట్టేశారా... దేవుడి మందిరం ఎక్కడ ఉండాలి..ఎక్కడ ఉండకూడదు...
Also Read: ఔను.. అది రాముడి కట్టిన వారధి ! నిర్మాణానికి ఎన్ని రోజులు పట్టిందంటే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి