By: ABP Desam | Updated at : 09 Dec 2021 03:25 PM (IST)
Edited By: RamaLakshmibai
న్యూమరాలజీ
ఏ నెలలో అయినా 1 నుంచి 10వ తేదీ వరకూ పుట్టిన వ్యక్తుల ఆలోచనా విధానం, ప్రవర్తన ఎలా ఉంటుందో ఇక్కడ తెలుసుకోండి.
1 వ తేదీ
ఏ నెలలో అయినా 1వ తేదీన పుట్టిన వాళ్లు భవిష్యత్ పై ఓ లక్ష్యం కలిగి ఉంటారు. వీరు స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటారు. నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉండడంతో ఎవ్వరి కిందా పనిచేయడానికి మనస్కరించరు. సొంతంగా వ్యాపారాలు చేసే కెపాసిటీ కలిగి ఉంటారు. పెద్ద పెద్ద సంస్థలు నిర్వహించే మేధస్సు వీరి సొంతం.
2వ తేదీ
ఈ తేదీన పుట్టిన వారు చాలా సున్నిత మనస్తత్వం కలిగి ఉంటారు. వీరు అందాన్ని, అటెన్షన్ ని ఇష్టపడతారు. సున్నిత స్వభావం కావడంతో చాలా ఎమోషనల్ గా ఉంటారు. ఇదే స్వభావం మీకు హానిచేస్తుంది. ఇతరుల ఆలోచనలు అర్థం చేసుకుని మాట్లాడేందుకు ప్రయత్నిస్తారు. వీళ్లు కళాత్మకంగా ఉంటారు. సంగీతంపై ఎక్కువ మక్కువ ఉంటుంది.
3వ తేదీ
వీరు చాలా క్రియేటివ్ గా ఆలోచిస్తారు. ఆర్ట్స్, పెయింటింగ్ లో మంచి టాలెంట్ ఉంటుంది. మిమ్మల్ని ఇతరులు ఇన్సిపిరేషన్ గా తీసుకుంటారు. సేల్స్ జాబ్స్ లో బాగా రాణిస్తారు.
Also Read: ఆర్థిక సమస్యలు తీరి ఐశ్వర్యాన్నిచ్చే వ్రతం ఇది..
4 వ తేదీ
నాలుగో తేదీన పుట్టిన వారు చాలా హార్డ్ వర్క్ చేస్తారు. చేసే పనిపట్ల నీతి నియమాలు కలిగి ఉంటారు. క్రమశిక్షణగా వ్యవహరిస్తారు, బాధ్యతలు తెలుసుకుని ప్రవర్తిస్తారు. కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. సహోద్యోగులు, బంధువుల్లో చాలామంది మీపై ఆధారపడతారు.
5 వ తేదీ
ఐదో తేదీన పుట్టిన వారు అడ్వెంచర్, ట్రావెల్ ని ఇష్టపడతారు. వీరికి క్యూరియాసిటీ ఎక్కువ, ఎక్సైట్ మెంట్ కోరుకుంటారు. ఎక్కడైనా సర్దుకుపోయే మనస్తత్వాన్ని కలిగిఉంటారు. పబ్లిక్ రిలేషన్స్, రాయడంలో టాలెంట్ ఉంటుంది. వీళ్లు తొందరగా అలసిపోతారు. కొంచెం బాధ్యతారహిత్యం ఉంటుంది కాబట్టి మార్చుకోవాల్సి ఉంటుంది.
6 వ తేదీ
మీరంతా ఫ్యామిలీ పర్సన్స్. కుటుంబాన్ని, చేస్తున్న ఉద్యోగాన్ని బ్యాలెన్స్ చేయగలుగుతారు. ఇతరుల సంరక్షణ బాధ్యత తీసుకుంటారు. చాలా బాధ్యతాయుతంగా ఉంటారు. చాలా నిజాయితీగా ఉంటారు. జాలెక్కువ, అర్థం చేసుకునే మనస్తత్వం కలిగి ఉంటారు.
Also Read: నెలకు రెండుసార్లు మంటతో స్నానం చేసే అమ్మవారు..
7 వ తేదీ
మీరు చాలా డెవలప్డ్ మైండ్. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. మీకున్న సామర్థ్యాన్ని ఎక్కడ వినియోగించాలో మీకు తెలుసు. విశ్లేషనాత్మకంగా ఉంటారు.
8వ తేదీ
మీకు నాయకత్వ లక్షణాలు ఎక్కువ. టాలెంటెండ్ పర్సన్స్ కావడంతో ఏ వ్యాపారంలో అయినా దూసుకుపోతారు. క్రియేటివ్ గా ఆలోచిస్తారు, దూసుకుపోతారు. మీకు భాగస్వామ్య వ్యాపారాలు కన్నా ఇండివిడ్యువల్ వ్యాపారాలే ఎక్కువ కలిసొస్తాయి. ప్రాక్టికల్ గా వ్యవహరిస్తారు.
9 వ తేదీ
మీది చాలా బ్రాడ్ మైండ్. ఆదర్శవంతులుగా ఉంటారు. చాలామంది గొప్ప ఆర్టిస్ట్ లు ఈ తేదీనే పుట్టారు. వీరికి త్యాగం చేసే గుణం ఉంటుంది. క్షమా గుణం మాత్రం తక్కువ.
10 వ తేదీ
లక్ష్యసాధన దిశగా అడుగేస్తారు. స్వతంత్రత కోసం కష్టపడతారు. బలమైన లీడర్ షిప్ క్వాలిటీస్ కలిగి ఉంటారు. సక్సెస్ కోసం.. చాలా కష్టపడతారు. చాలా షార్ప్ మైండ్ కలిగి ఉంటారు. అనలిటికల్ స్కిల్స్ కలిగి ఉంటారు. చాలా పక్కాగా ప్లాన్ చేసి.. ఆర్గనైజ్ చేసే సత్తా ఉంటుంది.
మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా ఈ ఫలితాల్లో మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…
( 11 వ తేదీ నుంచి 20 వ తేదీల్లో పుట్టినవారి వివరాలు రేపటి కథనంలో చూద్దాం)
Also Read: కర్మ అంటే ఏంటి.. పదే పదే ఈ మాట అనొచ్చా.. పురాణాలు ఏం చెబుతున్నాయి...
Also Read: చేయి నాకి నాకి తింటున్నారా.. మీకు ఆ వ్యామోహం చాలా ఎక్కువట..
Also Read: భారతదేశం అనే పేరుకి కారణం ఒకరు, గోదావరి నదిని భూమిపైకి తీసుకొచ్చింది మరొకరు.. ఈ ఏడుగురి కథే వేరు..
Also Read: శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించిన రోజు ఇదే... ఈ నెలంతా ప్రత్యేకమే
Also Read: స్వర్గానికి షార్ట్ కట్! రూట్ మ్యాప్ క్లియర్‌గా ఉందిగా!
Also Read: ఫెంగ్‌షుయ్ ప్రకారం ఆ రెండు బొమ్మలు ఇంట్లో ఉంటే భార్య భర్తల మధ్య ప్రేమ పెరుగుతుందట
Also Read: కిచెన్లో పూజామందిరం పెట్టేశారా... దేవుడి మందిరం ఎక్కడ ఉండాలి..ఎక్కడ ఉండకూడదు...
Also Read: ఔను.. అది రాముడి కట్టిన వారధి ! నిర్మాణానికి ఎన్ని రోజులు పట్టిందంటే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Gorintaku: గోరింట ఆషాడమాసంలోనే ఎందుకంత ప్రత్యేకం, దీని పుట్టుక వెనుక ఇంత కథ ఉందా!
Panchang 8th July 2022: జులై 8 శుక్రవారం తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, శుక్రవారం పఠించాల్సిన మహాలక్ష్మి అష్టకం
Tholi Ekadashi 2022: జులై 10 తొలి ఏకాదశి, ఈ రోజు ఉపవాసం ఉంటే మంచిదని ఎందుకంటారు!
Horoscope7th July 2022: ఈ రాశివారు కెరీర్లో ఎదురైన సమస్యలను అధిగమిస్తారు, జులై 7 గురువారం రాశిఫలాలు
Horoscope 6th July 2022: ఈ రాశులవారి దృష్టి తప్పుడు కార్యకలాపాలపైకి మళ్లుతుంది , జులై 6 బుధవారం రాశిఫలాలు
2024 Elections India: రాజ్యసభ నామినేషన్లు, సౌత్ ఇండియా మిషన్లో భాగమేనా? భాజపా స్ట్రాటెజీలు రెడీ!
YSRCP Permanent President : వైఎస్ఆర్సీపీ శాశ్వత అధ్యక్షుడిగా సీఎం జగన్ ! ఎందుకంటే ?
UK Prime Minister Resignation: బ్రేకింగ్ న్యూస్- బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా!
Why Nagababu Target Modi : మోదీపైనా నాగబాబు సెటైర్లు ! జనసేన డైరక్ట్గానే చెబుతోందా ?