News
News
X

Idana Mata Temple: నెలకు రెండుసార్లు మంటతో స్నానం చేసే అమ్మవారు..

శుద్ధోదక స్నానం, పంచామృత స్నానం, అభిషేకం అనడం వింటుంటాం. కానీ అగ్నితో స్నానం అనే మాట విన్నారా. రాజస్థాన్ లో ఉన్నఓ ఆలయంలో అమ్మవారి ప్రత్యేకత ఇదే..

FOLLOW US: 
Share:

సంప్రదాయాలకు నిలయమైన మన దేశంలో ఎన్నో చిత్రవిచిత్రమైన ఆలయాలున్నాయి. వందల వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి మరీ భక్తులు ఆయా స్వామి, అమ్మవార్లను దర్శించుకుంటుంటారు. అలాంటి విచిత్ర మైన ఆలయం రాజస్ధాన్ లో ఒకటుంది. అదే ఇడాన మాతా ఆలయం. ఉదయపూర్ కి 60 కిలోమీటర్ల దూరంలో ఆరావళి పర్వతాల్లో  ఉన్న ఈ దేవాలయం పైన రూఫ్ లేకుండా నిర్మించారు. ఇక్కడ అమ్మవారు అగ్ని స్నానం చేస్తారట. నెలకు రెండు మూడుసార్లు ఆలయంలో భారీ ఎత్తున మంటలు చెలరేగుతాయని స్థానికులు చెప్పారు. ఎక్కడి నుంచి మంట వస్తుందో  తెలియదని ఆలయం మొత్తం దాదాపు 20 అడుగుల ఎత్తులో మంటలుచెలరేగుతాయని చెబుతారు. ఈ  పవిత్ర దృశ్యాన్ని చూసేందుకు భక్తులు తండోపతండాలుగా విచ్చేస్తుంటారు. ఈ మంటలు ఎలా వస్తున్నాయో తెలుసుకునేందుకు ఎందరో పరిశోధకులు ప్రయత్నించినా ఇప్పటికీ కారణం కనిపెట్టలేకపోయారు. 
Also Read: కర్మ అంటే ఏంటి.. పదే పదే ఈ మాట అనొచ్చా.. పురాణాలు ఏం చెబుతున్నాయి...
​ఇడాన మాత విశిష్టత..
ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేక గుర్తింపు వల్ల అమ్మవారి సన్నిధి ఎప్పుడూ భక్తులతో కళకళలాడుతుంటుంది. ముఖ్యంగా పక్షవాతం, మానసిక ఆందోళకు గురవుతున్న వారు ఈ ఆలాయన్ని సందర్శిస్తే రోగాల నుంచి విముక్తి కలుగుతుందని విశ్వాసం. ముఖ్యంగా మంటలు చూసినవారికి అంతా మంచే జరుగుతుందట. ఈ మంటల కారణంగా ఇక్కడ ఆలయాన్ని విస్తృత పరచలేదు. ఇక్కడకు వచ్చే భక్తులు అమ్మవారి అగ్నిని చూడడంతో పాటూ అక్కడున్న త్రిశూలానికి ప్రత్యేక పూజలు చేస్తారు. సంతానం లేని వారు త్రిశూలానికి పూజచేస్తే ఫలితం ఉంటుందని భక్తుల విశ్వాసం. 

ఇందులో వాస్తవమెంత అంటే మాత్రం చెప్పేలేమంటారంతా. ఎందుకంటే కొన్ని సంఘటనలు నమ్మేలా ఉంటాయి. మరికొన్ని సంఘటనలను చూసి నమ్మాల్సి వస్తుంది. ఓవరాల్ గా ఎవరి నమ్మకాలు, విశ్వాసాలు వారివి. 
Also Read: ప్రపంచానికి చదువు చెప్పిన భారతదేశం.. ఈ యూనివర్శిటీలో ఫీజులు కట్టక్కర్లేదు, పరీక్షలు ఉండవు..
Also Read: చేయి నాకి నాకి తింటున్నారా.. మీకు ఆ వ్యామోహం చాలా ఎక్కువట..
Also Read: పిల్లి మాత్రమే కాదు.. ఇవి ఎదురైనా తలచిన పనులు జరగవట..
Also Read: స్వర్గానికి షార్ట్ కట్! రూట్ మ్యాప్ క్లియర్‌గా ఉందిగా!  
Also Read: ఫెంగ్‌షుయ్ ప్రకారం ఆ రెండు బొమ్మలు ఇంట్లో ఉంటే భార్య భర్తల మధ్య ప్రేమ పెరుగుతుందట
Also Read: కిచెన్లో పూజామందిరం పెట్టేశారా... దేవుడి మందిరం ఎక్కడ ఉండాలి..ఎక్కడ ఉండకూడదు...
Also Read: ఔను.. అది రాముడి కట్టిన వారధి ! నిర్మాణానికి ఎన్ని రోజులు పట్టిందంటే..
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 08 Dec 2021 06:01 PM (IST) Tags: ఉదయ్ పూర్ Fire Bath Idana Mata Idana Mata Temple Devi Temple In Rajasthan

సంబంధిత కథనాలు

Ratha Sapthami 2023 Slokas: రథసప్తమి రోజు తప్పనిసరిగా  చదువుకోవాల్సిన  శ్లోకాలు

Ratha Sapthami 2023 Slokas: రథసప్తమి రోజు తప్పనిసరిగా చదువుకోవాల్సిన శ్లోకాలు

Ratha Saptami 2023 Wishes In Telugu: జనవరి 28 శనివారం రథసప్తమి సందర్భంగా శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి

Ratha Saptami 2023 Wishes In Telugu:  జనవరి 28 శనివారం రథసప్తమి సందర్భంగా శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి

Love Horoscope Today 28th January 2023: ఈ రాశులవారి వైవాహిక జీవితంలో టెన్షన్ తప్పదు

Love Horoscope Today 28th January 2023: ఈ రాశులవారి వైవాహిక జీవితంలో టెన్షన్ తప్పదు

Horoscope Today 28th January 2023: ఏదైనా భిన్నంగా చేసే అలవాటు ఈ రాశివారిని ప్రత్యేకంగా నిలుపుతుంది, జనవరి 28 రాశిఫలాలు

Horoscope Today 28th January 2023: ఏదైనా భిన్నంగా చేసే అలవాటు ఈ రాశివారిని ప్రత్యేకంగా నిలుపుతుంది, జనవరి 28 రాశిఫలాలు

Antarvedi Utsavalu : జనవరి 28 నుంచి అంతర్వేది కల్యాణ మహోత్సవాలు

Antarvedi Utsavalu :  జనవరి 28 నుంచి అంతర్వేది కల్యాణ మహోత్సవాలు

టాప్ స్టోరీస్

Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !

Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !

CCL 2023: మూడేళ్ల తర్వాత జరగనున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ - క్రికెటర్లుగా మారనున్న హీరోలు!

CCL 2023: మూడేళ్ల తర్వాత జరగనున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ - క్రికెటర్లుగా మారనున్న హీరోలు!

Jagan To Delhi : అమరావతిలోనే సీఎం జగన్ -మరి టూర్లు ఎందుకు క్యాన్సిల్ ? ఢిల్లీకి ఎప్పుడు ?

Jagan To Delhi : అమరావతిలోనే సీఎం జగన్ -మరి టూర్లు ఎందుకు క్యాన్సిల్ ? ఢిల్లీకి ఎప్పుడు ?

Australian Open 2023: చరిత్ర సృష్టించిన సబలెంకా - మొదటి గ్రాండ్‌స్లామ్ విజేతగా నిలిచిన బెలారస్ ప్లేయర్!

Australian Open 2023: చరిత్ర సృష్టించిన సబలెంకా - మొదటి గ్రాండ్‌స్లామ్ విజేతగా నిలిచిన బెలారస్ ప్లేయర్!