By: ABP Desam | Updated at : 10 Dec 2021 07:08 AM (IST)
Edited By: RamaLakshmibai
Nnumerology
పుట్టిన తేదీ ఆధారంగా వ్యక్తిత్వాన్ని అంచనా వేయొచ్చంటారు సంఖ్యాశాస్త్ర నిపుణులు. మీరు పుట్టిన తేదీ మీ వ్యక్తిత్వం, అలవాట్లు, ప్రవర్తన, ఆలోచనలు, తెలివితేటలు, మీరు ఏ రంగంలో సక్సెస్ అవుతారు అనేది తెలియజేస్తుందంటారు. అవేంటో చూద్దాం..
11వ తేదీ
ఆదర్శవాదంగా ఉంటారు. ఏం విన్నా వాస్తవం ఏంటో తెలుసుకోవాలనే ఆలోచన ఉంటుంది. ఎదుటివాళ్ల అంతర్గత ఆలోనచలను ముందుగానే తెలుసుకునే సత్తా ఉంటుంది. తోటివారిని మోటివేట్ చేస్తారు. మీరు చాలా సెన్సిటివ్, ఎమోషనల్ గా ఉంటారు.
12వ తేదీ
ఈ తేదీన పుట్టినవారిలో కళాత్మక ఎక్కువ. ఊహాత్మకంగా ఉంటారు. స్టోరీస్, జోక్స్ తో అందర్నీ బాగా నవ్విస్తారు. మీరు ఎక్కడుంటే అక్కడ వాతావరణం ఆహ్లాదరకరంగా ఉంటుంది. ఏదైనా అనారోగ్యం బారిన పడినా తొందరగా కోలుకుంటారు. వెర్బల్, రైటింగ్ స్కిల్స్ ఉంటాయి. యాక్టింగ్ ఫీల్డ్ కూడా మీకు బాగా కలిసొస్తుంది.
13వ తేదీ
కుటుంబం, సంప్రదాయాలు, కమ్యూనిటీపై చాలా ప్రేమ ఉంటుంది. ప్రకృతిని ప్రేమిస్తారు. ప్రతి విషయంలో క్లారిటీ కావాలని కోరుకుంటారు. చాలా కష్టపడతారు. అతిగా పనిచేయడం కూడా మీకు మంచిది కాదని తెలుసుకోండి.
Also Read: 1 నుంచి 10వ తేదీ వరకూ పుట్టిన వారి ఆలోచనా విధానం ఇలా ఉంటుంది..
14వ తేదీ
14 వ తేదీన పుట్టిన వారిలో అత్సుత్సాహం ఎక్కువ. ప్రయాణాలు చేయడాన్ని ఇష్టపడతారు. రచయితగా, ఎడిటర్ గా రాణిస్తారు.
15వ తేదీ
వీరిలో క్రియేటివిటీ ఎక్కువగా ఉంటుంది. కళాత్మక కూడా ఎక్కువ. విజువల్ ఆర్ట్స్, పెయింటింగ్, కాలిగ్రాఫీ, స్కల్చర్ ని ఇష్టపడతారు. జీవితంలో ది బెస్ట్ ఉండాలని కోరుకుంటారు. మీ జీవితంలో ఇల్లు, మ్యారేజ్ అనేది ప్రధాన సమస్య. మీ భాగస్వామికి మంచి స్పేస్ ఇస్తే సంతోషంగా ఉంటారు.
16వ తేదీ
ఈ తేదీన పుట్టినవారికి దేవుడిపై భక్తి ఎక్కువ. చేసేపనిపై ఏకాగ్రత ఉంటుంది. మంచి విలువలు కలిగి ఉంటారు.
Also Read: ఆర్థిక సమస్యలు తీరి ఐశ్వర్యాన్నిచ్చే వ్రతం ఇది..
17వ తేదీ
ఎందరి మధ్య ఉన్నా ప్రత్యేకంగా కనిపిస్తారు. వ్యాపారం, ఫైనాన్స్ లో బాగా రాణిస్తారు. స్వతంత్ర భావాలు కలిగి ఉంటారు. జడ్జ్ మెంట్ టాలెంట్ ఉంటుంది. సెల్ఫ్ కాన్ఫిడెంట్ కలిగి ఉంటారు.
18వ తేదీ
నాయకత్వ లక్షణాలు ఉండడం వల్ల మ్యానేజర్ గా, బిజినెస్ లో రాణిస్తారు. ఇతరులకు ఇన్సిపిరేషన్ గా ఉంటారు. రాజకీయాలు, ఆర్ట్స్, న్యాయసేవల్లో టాలెంట్ ఉంటుంది. ఆలోచనలు రోజు రోజుకీ మెరుగుపరుచుకుంటారు.
19వ తేదీ
ఇండివిడ్యవల్ గా ఉండాలని కోరుకుంటారు. ఎవ్వరికీ ఇబ్బంది కలిగించనంతవరకూ నా లైఫ్ నా ఇష్టం అని గడపాలనే ఆలోచనతో ఉంటారు. రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. మార్పులను చాలా ఇష్టపడతారు.
20వ తేదీ
ఈ తేదీన పుట్టిన వారు సున్నిత స్వభావం కలిగి ఉంటారు. ఇతరుల ఫీలింగ్స్ ని ఇట్టే గుర్తుపట్టేస్తారు. చాలా ఎమోషనల్ గా ఉంటారు. జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. లైఫ్ లో సమస్యలు తగ్గుతాయి. ఈ తేదీన పుట్టినవారి ముఖంలో మంచి కళ ఉంటుంది. ప్రేమ పంచడంలో వీరికి వీరే సాటి.
మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా ఈ ఫలితాల్లో మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…
( 21 వ తేదీ నుంచి 30 వ తేదీల్లో పుట్టినవారి వివరాలు రేపటి కథనంలో చూద్దాం)
Also Read: నెలకు రెండుసార్లు మంటతో స్నానం చేసే అమ్మవారు..
Also Read:కర్మ అంటే ఏంటి.. పదే పదే ఈ మాట అనొచ్చా.. పురాణాలు ఏం చెబుతున్నాయి...
Also Read: చేయి నాకి నాకి తింటున్నారా.. మీకు ఆ వ్యామోహం చాలా ఎక్కువట..
Also Read: భారతదేశం అనే పేరుకి కారణం ఒకరు, గోదావరి నదిని భూమిపైకి తీసుకొచ్చింది మరొకరు.. ఈ ఏడుగురి కథే వేరు..
Also Read: శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించిన రోజు ఇదే... ఈ నెలంతా ప్రత్యేకమే
Also Read: స్వర్గానికి షార్ట్ కట్! రూట్ మ్యాప్ క్లియర్‌గా ఉందిగా!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Gorintaku: గోరింట ఆషాడమాసంలోనే ఎందుకంత ప్రత్యేకం, దీని పుట్టుక వెనుక ఇంత కథ ఉందా!
Panchang 8th July 2022: జులై 8 శుక్రవారం తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, శుక్రవారం పఠించాల్సిన మహాలక్ష్మి అష్టకం
Tholi Ekadashi 2022: జులై 10 తొలి ఏకాదశి, ఈ రోజు ఉపవాసం ఉంటే మంచిదని ఎందుకంటారు!
Horoscope7th July 2022: ఈ రాశివారు కెరీర్లో ఎదురైన సమస్యలను అధిగమిస్తారు, జులై 7 గురువారం రాశిఫలాలు
Horoscope 6th July 2022: ఈ రాశులవారి దృష్టి తప్పుడు కార్యకలాపాలపైకి మళ్లుతుంది , జులై 6 బుధవారం రాశిఫలాలు
2024 Elections India: రాజ్యసభ నామినేషన్లు, సౌత్ ఇండియా మిషన్లో భాగమేనా? భాజపా స్ట్రాటెజీలు రెడీ!
UK Prime Minister Resignation: బ్రేకింగ్ న్యూస్- బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా!
Why Nagababu Target Modi : మోదీపైనా నాగబాబు సెటైర్లు ! జనసేన డైరక్ట్గానే చెబుతోందా ?
Balakrishna: బాలయ్య సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ - యాక్షన్ తో పాటు ఎమోషన్ కూడా!