అన్వేషించండి

Tirupati: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్... అన్నమయ్య కాలిబాటకు టీటీడీ గ్రీన్ సిగ్నల్... తిరుమలకు 40 కి.మీ తగ్గనున్న దూరం

శ్రీవారి పరమ భక్తుడు అన్నమయ్య నడిచిన కాలిబాటకు ఎట్టకేలకు మోక్షం లభించింది. అన్నమయ్య కాలిబాట అభివృద్ధికి టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు.

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తుల కల సాకారం చేసే దిశగా టీటీడీ అడుగులు వేసింది. శ్రీవారి భక్తుల కోసం కడప జిల్లా రాజంపేట మండలం తాళ్లపాక గ్రామ నివాసి వాగ్గేయ కారుడు, పద కవితా పితామహుడు అన్నమయ్య నడయాడిన కాలిబాటను అభివృద్ధి చేసేందుకు టీటీడీ నిర్ణయించినట్లు వైవీ సుబ్బారెడ్డి బోర్డు సమావేశంలో ప్రకటించారు. అన్నమయ్య కాలిబాట అభివృద్ధికి కడప జెడ్పీ ఛైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గత కొన్ని దశాబ్దాలుగా కృషి చేస్తున్నారు. గతంలో అన్నమయ్య కాలిబాట అభివృద్ధి విషయమై ఆకేపాటి దివంగత సీఎం వైఎస్.రాజశేఖర్ రెడ్డి వద్ద తన ప్రతిపాదనను వినిపించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా అన్నమయ్య కాలిబాట అభివృద్ధికి చర్యలు చేపట్టారు. అయితే ఆయన మరణానంతరం ఆ విషయం అటకెక్కింది. ఇదిలా ఉంటే 19వ సారి అన్నమయ్య కాలి బాట కోసం ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి ఈనెల 17న తిరుమల పాదయాత్ర చేపడుతున్న తరుణంలో అన్నమయ్య కాలిబాట అభివృద్దిపై కీలక నిర్ణయం వెలువడింది. 

Also Read: తిట్ల నుంచి హత్య కుట్ర ఆరోపణల వరకూ ఏపీ రాజకీయాలు ! రాజకీయం అంటే అదేనా ? నేతలకు నైతికతే ఉండదా?

తిరుమలకు మూడో మార్గం 

అన్నమయ్య నడిచిన కాలిబాటను పునరుద్ధరించడమే కాకుండా ఆ మార్గాన్ని పూర్తిగా అభివృద్ధి చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఈ నిర్ణయంపై కడప జిల్లా వాసులు తీసుకోవడంతో కడప జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కాలిబాట అందుబాటులోకి వస్తే కడప, కర్నూలు, అనంతపురం, కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి ప్రాంత వాసులకు తిరుమలకు వచ్చే సమయం మరింత తగ్గుతుంది. అన్నమయ్య కాలిబాట అందుబాటులోకి వస్తే తిరుమలకు సుమారు 40 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. ఇకపై తిరుపతికి వెళ్లే అవసరం లేకుండా... కడప నుంచి రైల్వేకోడూరు మీదుగా కుక్కలదొడ్డి, మామండూరు వెళ్లి అక్కడి నుంచి శేషాచలం కొండల్లో 18 కి.మీ వెళ్తే తిరుమలకు చేరుకుంటారు. ఇప్పటి వరకూ ఉన్న రెండు ఘాట్ రోడ్ల కన్నా ఇది సులభమైన మార్గం. అన్నమయ్య మార్గం ఇటు కాలిబాటతో పాటు రోడ్డు మార్గాన కూడా తిరుమలకు చేరుకోవచ్చు. భారీ వర్షాల సమయంలో రెండు ఘాట్ రోడ్లలో కొండ చరియలు విరిగిపడి రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. అలాంటప్పుడు అన్నమయ్య మార్గం తిరుమలకు చేరుకోవడానికి మరో మార్గం ఉంటుంది.   

Also Read:  ఫిట్‌మెంట్ ప్రకటన మంగళవారమే .. కొన్ని ఉద్యోగ సంఘాలకు సజ్జల సమాచారం !

అన్నమయ్య నడిచిన మార్గం

రాజంపేట సమీపంలో ఉన్న తాళ్లపాక నుంచి 17వ శతాబ్దంలో శ్రీవారి భక్తుడు అన్నమయ్య ఈ మార్గం ద్వారా తిరుమలకు వెళ్తుండేవారని ప్రతీతి. ఇప్పటికీ ఈ మార్గం ద్వారా వేలాది మంది భక్తులు తిరుమలకు నడచి వెళ్తుంటారు. కడప-రేణిగుంట మార్గంలో రైల్వేకోడూరు మీదుగా మామండూరు వరకు హైవేపై వెళ్లి అక్కడి నుంచి 18 కిలోమీటర్లు అన్నమయ్య మార్గంలో నడిచి తిరుమలకు చేరుకోవచ్చు. 

Also Read: జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై టీఎస్ హైకోర్టులో విచారణ... నోటీసులు జారీ చేసిన హైకోర్టు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

మొదటి విడత పంచాయతీ, మలి విడత పురపాలక ఓటింగ్ ప్రారంభం - లైవ్ అప్ డేట్స్
మొదటి విడత పంచాయతీ, మలి విడత పురపాలక ఓటింగ్ ప్రారంభం - లైవ్ అప్ డేట్స్
PRP Vijaysai Reddy: వైఎస్ కుటుంబ ఆస్తుల గుట్టు నాకు, కేవీపీకే తెలుసు.. కోర్టు పిలిస్తే అన్నీ చెబుతా - విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు
వైఎస్ కుటుంబ ఆస్తుల గుట్టు నాకు, కేవీపీకే తెలుసు.. కోర్టు పిలిస్తే అన్నీ చెబుతా - విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు
YS Sharmila Son In Law: వైఎస్ షర్మిల అల్లుడు ఏం చేస్తుంటాడో తెలుసా?.. రఘురామ్ రెడ్డి పూర్తి వివరాలు!
వైఎస్ షర్మిల అల్లుడు ఏం చేస్తుంటాడో తెలుసా?.. రఘురామ్ రెడ్డి పూర్తి వివరాలు!
Tirumala 121 Kg Gold Donation: శ్రీవారికి 121 కిలోల బంగారం విరాళం ఇచ్చిన దాత వర్థమాన్ జైన్ - ఈయన ఎవరంటే?
శ్రీవారికి 121 కిలోల బంగారం విరాళం ఇచ్చిన దాత వర్థమాన్ జైన్ - ఈయన ఎవరంటే?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
మొదటి విడత పంచాయతీ, మలి విడత పురపాలక ఓటింగ్ ప్రారంభం - లైవ్ అప్ డేట్స్
మొదటి విడత పంచాయతీ, మలి విడత పురపాలక ఓటింగ్ ప్రారంభం - లైవ్ అప్ డేట్స్
Thiruparankundram Deepam Row: తిరుప్పరకుండ్రం దీపం వివాదంలో సీఎం విజయ్ తప్పిదం.. రెంటికీ చెడ్డ రేవడిలా మారారా?
తిరుప్పరకుండ్రం దీపం వివాదంలో సీఎం విజయ్ తప్పిదం.. రెంటికీ చెడ్డ రేవడిలా మారారా?
Kallakurichi Collector Row: కళ్లకురిచి వివాదంలో సీఎం విజయ్‌కు ధర్మసంకటం! ఇటు అధికారిణి.. అటు సొంత ఎమ్మెల్యే?
కళ్లకురిచి వివాదంలో సీఎం విజయ్‌కు ధర్మసంకటం! ఇటు అధికారిణి.. అటు సొంత ఎమ్మెల్యే?
Amaravati Capital Works: అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు పర్యటన.. రాజధాని పనుల పురోగతిపై సమీక్ష!
అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు పర్యటన.. రాజధాని పనుల పురోగతిపై సమీక్ష!
TG Church Grant Application: తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ కానుక.. చర్చిలకు రూ.30 వేల ఆర్థిక సాయం.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ కానుక.. చర్చిలకు రూ.30 వేల ఆర్థిక సాయం.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
Megastar Chiranjeevi on drugs:
"లక్ష్యాన్ని వ్యసనంగా మార్చుకోండి.. వ్యసనాన్ని జీవితంగా మార్చుకోకండి".. డ్రగ్స్ వద్దని యువతకు చిరంజీవి పిలుపు
YS Sharmila vs K Kavitha: ఇద్దరు ఆడబిడ్డల తిరుగుబాటు సెగ.. వైసీపీ, బీఆర్ఎస్‌లకు కుటుంబ సమస్యలే పెద్ద తలనొప్పిగా మారాయా?
ఇద్దరు ఆడబిడ్డల తిరుగుబాటు సెగ.. వైసీపీ, బీఆర్ఎస్‌లకు కుటుంబ సమస్యలే పెద్ద తలనొప్పిగా మారాయా?
Garividi Lakshmi OTT : ఓటీటీలో గరివిడి లక్ష్మి - మూడు భాషల్లో స్ట్రీమింగ్... థియేటర్లలో మిస్ అయితే...
ఓటీటీలో గరివిడి లక్ష్మి - మూడు భాషల్లో స్ట్రీమింగ్... థియేటర్లలో మిస్ అయితే...
Embed widget