Cm Jagan: జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై టీఎస్ హైకోర్టులో విచారణ... నోటీసులు జారీ చేసిన హైకోర్టు
సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని ఎంపీ రఘురామ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై సోమవారం విచారణ జరిపిన కోర్టు.. సీఎం జగన్ కు నోటీసులు జారీచేసింది.
ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్‌పై 11 ఛార్జ్‌షీట్లు ఉన్నాయని పిటిషనర్ కోర్టుకి తెలిపారు. బెయిల్ రద్దు చేసి 11 ఛార్జ్ షీట్ లను విచారణ చేయాలని రఘురామకృష్ణరాజు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే బెయిల్ రద్దు పిటిషన్ ను సీబీఐ కోర్టు కొట్టి వేయడంతో ఎంపీ హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్ రద్దు పిటిషన్ పై సీఎం జగన్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను రెండు వారాలు పాటు వాయిదా వేసింది.
Also Read: ఫిట్‌మెంట్ ప్రకటన మంగళవారమే .. కొన్ని ఉద్యోగ సంఘాలకు సజ్జల సమాచారం !
రఘురామ పిటషన్ పై హైకోర్టులో విచారణ
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ బెయిల్ రద్దుపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తున్నారు. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ ను సీబీఐ ప్రత్యేక కోర్టు గతంలో కొట్టివేసింది. దీంతో ఎంపీ రఘురామ సీబీఐ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జగన్ పై ఉన్న 11 ఛార్జ్ షీట్లపై సమగ్రమైన దర్యాప్తు చేయాలని, బెయిల్ రద్దు చేసి సీబీఐ విచారణ వేగవంతం చేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. రఘురామ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. అదనపు ఆస్తుల కేసులో బెయిల్ పై విడుదలైన జగన్ సీఎం పదవిలో ఉన్నందున సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని అందువలన జగన్, విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు చేయాలని రఘురామకృష్ణరాజు నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు.
Also Read: తిట్ల నుంచి హత్య కుట్ర ఆరోపణల వరకూ ఏపీ రాజకీయాలు ! రాజకీయం అంటే అదేనా ? నేతలకు నైతికతే ఉండదా?
బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేత
ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేసిన సీబీఐ కోర్టు సెప్టెంబర్ 15న తీర్పు ఇచ్చింది. వైఎస్ జగన్, విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ ను కొట్టేసింది. అనంతరం బెయిల్ రద్దు పిటిషన్ ను మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసింది. దీనిని హైకోర్టు తోసిపుచ్చింది. సరైన కారణం లేకుండా బదిలీ చేయడం కుదరదని చెప్పింది. ఇప్పుడు సీబీఐ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ రఘురామ హైకోర్టులో వేసిన పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ప్రస్తుతం విచారణ జరుగుతోంది.
Also Read: ఏపీ హైకోర్టుకు అదనపు భవనం.. భూమి పూజ చేసిన చీఫ్ జస్టిస్ !