By: ABP Desam | Updated at : 14 Dec 2021 12:05 PM (IST)
Edited By: RamaLakshmibai
Bhagavadgita, Geeta Jayanti
సాక్షాత్తూ శ్రీ కృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించిన జీవిత సారాంశమే భగవద్గీత. కురుక్షేత్ర సంగ్రామంలో తన సోదరులని, బంధువులని, గురువులని, స్నేహితులని చూసి, హృదయం వికలమై.. రాజ్యం కోసం వారిని నేను వధించలేనని బాధపడిన అర్జునుడికి చెప్పిన బ్రహ్మజ్ఞానం భగవద్గీత. ఈ పవిత్రగ్రంధ్రం ఆవిర్భవించిన రోజైన మార్గశిర శుక్ల ఏకాదశిని గీతా జయంతిగా జరుపుకుంటారు. భగవధ్గీతలో మొత్తం 700 శ్లోకాలున్నాయి. ఉరకల పరుగుల జీవనంలో మొత్తం చదివే అవకాశం అందరికీ ఉండకపోవచ్చు. అందుకే చదివిన వారికి ఎంతవరకూ అర్థమైంది, చదవని వారు తెలుసుకోవాల్సిన విషయాలను కొన్ని ప్రశ్నలు సమాధానాల రూపంలో ఇస్తున్నాం.
Also Read: ఒక భగవద్గీత - 108 ప్రశ్నలు- Part 1
Part 1, Part-2 లో 40 ప్రశ్నలు-సమాధానాలు ఇచ్చాం... 41 నుంచి 60 వరకూ ప్రశ్నలు సమాధానాలు ఇక్కడ చూడొచ్చు.
41. అనేక తలలు గల నాగులలో తాను ఏ నాగునని శ్రీకృష్ణుడు చెప్పాడు?
అనంతుడు
42. మహాభారత సంగ్రామ ప్రారంభంలో నకులుడు ఊదిన శంఖం పేరేమిటి?
సుఘోషం
43. ఛందస్సులలో తను ఏ ఛందస్సు అని శ్రీకృష్ణుడు చెప్పాడు.?
గాయత్రీ ఛందస్సు
44. జీవునకు ఈ శరీరంలో ఎన్ని అవస్థలు కలుగుతాయని శ్రీకృష్ణుడు చెప్పాడు?
నాలుగు (బాల్యం, యౌవ్వనం, వార్థక్యం, దేహాంతర ప్రాప్తి)
45. నదులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పాడు?
గంగానది.
46. ఆత్మ ఎలాంటింది?
నాశరహితమైనది
47. కొంత ఆచరించి మధ్యలో వదిలివేసిననూ నిష్ఫలము కాని కర్మను ఏమంటారు?
నిష్కామ కర్మ
Also Read: భగవద్గీత మా అమ్మ లేని లోటు తీర్చిందన్న స్వాతంత్ర్య సమరయోధుడెవరు… ఒక భగవద్గీత - 108 ప్రశ్నలు- Part 2
48. మనుజునకు దేనియందు అధికారము ఉంది?
కర్మలు చేయుటయందు మాత్రమే. (ఫలమునాశించుట యందులేదు.)
49. అర్జునుడు ఎవరి లక్షణాలు-భాష, నివాసం, నడవడిక తెలుపమని శ్రీకృష్ణుని అడిగెను?
స్థితప్రజ్ఞుడు
50. వృక్షాల్లో తాను ఏ వృక్షమని శ్రీ కృష్ణుడు చెప్పెను?
రావిచెట్టు.
51. పంచభూతములచే నాశనము పొందనిది ఏది?
ఆత్మ
52. మహాభారత సంగ్రామ ప్రారంభంలో సహదేవుడు ఊదిన శంఖం పేరేమిటి?
మణిపుష్పకం
53. ప్రపంచంలో పూర్ణానందం ఎక్కడ లభిస్తుంది?
ఆత్మయందు
Also Read: భగవద్గీత పూజించడానికి మాత్రమే కాదు.. మనిషిగా బతకడానికి
54. మహాభారత సంగ్రామంలో అర్జునుని రధం జెండాపై గల వానరుడెవరు?
హనుమంతుడు
55. పక్షుల్లో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పాడు?
గరుత్మంతుడు
56. ఏ జంతువు వలె యోగి అయినవాడు తన ఇంద్రియములను వెనుకకు మరల్చును?
తాబేలు.
57. కర్మచేయుటం మేలా..యకుండా ఉండడం మేలా..
చేయుటయే మేలు.
58. బ్రహ్మదేవుడు ప్రజలను సృష్టించినప్పుడు వారితో సహా ఏం సృష్టించాడు?
యజ్ఞములు (సత్కార్యములు, దైవకార్యములు)
59. వివేకవంతుడు కర్మలు ఎందుకు చేయాలి?
లోక క్షేమం కోసం
60. ఆవుల్లో తాను ఏ ఆవునని శ్రీకృష్ణుడు చెప్పాడు?
కామధేనువు
Also Read: ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని- ప్రపంచ సాంస్కృతిక నగరం… వారణాసి గొప్పతనం ఇదే..
Also Read: వారణాసి మహిమను వివరించే కాశీవిశ్వనాథ్ కారిడార్.. అక్కడ అణువణువూ ప్రత్యేకమే
Also Read: శవాలు దహనం చేసే ఘాట్ సహా కాశీలో ముఖ్యమైన ఘాట్లు ఇవి..
Also Read: కాశీలో వదిలేయాల్సింది కాకరకాయో, కమలాపండో కాదు…
Also Read: జీవిత కాలంలో ఒక్కసారైన దర్శించుకోవాల్సిన శైవ క్షేత్రాలివి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండిAlso Read:
Jagannath Temple: దేవుడికి దహన సంస్కారాలు, ఈ ఆలయంలో విగ్రహాలను దహనం చేసేస్తారు, మళ్లీ ఇలా ప్రాణం పోసుకుంటాయ్!
Kumar Sashti 2022 : కుజ దోష, నాగ దోషం, సంతాన లేమి నివారణకోసం కుమారషష్టి రోజు ఇలా చేయండి!
Ashada Masam 2022: ఆషాఢం మాసంలో కొత్త దంపతులను ఎందుకు దూరంగా ఉంచుతారు!
Horoscope 5th July 2022: ఈ రాశివారు సీక్రెట్ ని సీక్రెట్ గా ఉంచాలి, జులై 5 మంగళవారం మీ రాశిఫలితం తెలుసుకోండి!
Panchang 5th July 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, శ్రీ హనుమాన్ బడబానల స్తోత్రం
Pavitra Lokesh: నరేష్ తో రూమర్స్ - సినిమా ఛాన్స్ లు పోగొట్టుకున్న పవిత్ర?
Smita Sabharwal Job Tips: నిరాశ చెందవద్దు, ప్రణాళికా ప్రకారం ప్రిపేర్ అవ్వాలి - ఉద్యోగార్థులకు స్మితా సబర్వాల్ సూచనలివే
IND vs ENG, Day 4 Highlights: నాలుగో రోజు ఇంగ్లండ్‌దే - విజయానికి 119 పరుగులు!
Hair Pulling Disorder: వెంట్రుకలు పీక్కుంటున్నారా? అది అలవాటు కాదు రోగం, ఆ రోగానికి కారణాలు ఇవే