By: ABP Desam | Updated at : 15 Dec 2021 12:22 PM (IST)
Edited By: RamaLakshmibai
2022 రాశి ఫలితాలు
రెండేళ్లుగా కరోనా చెడుగుడు ఆడేస్తోంది. ఇప్పుడిప్పుడే పరిస్థితి కాస్త సర్దుమణుగుతోంది. గడిచిన బ్యాడ్ డేస్ ని వదిలేసి సరికొత్తగా కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారంతా. కొత్త ఆశలు, ఎన్నో కోర్కెలు, మరెన్నో అంచనాలతో 2022 కి వెల్ కమ్ చెప్పనున్నారు. మరి జ్యోతిష్యశాస్త్రం ప్రకారం 2022 కొత్త ఏడాదిలో ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి.
ధనుస్సు
ధనస్సు రాశివారికి ఏడాది ఆరంభం అద్భుతంగా ఉంటుంది. ఆర్థికంగా ఎదుగుదలకు చేసిన ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఈ రాశి విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. చదువుపరంగా వచ్చే ఇబ్బందులు తొలగిపోతాయి. గ్రహాల ప్రతికూల ప్రభావాల కారణంగా మీలో మానసిక ఆందోళనలు పెరుగుతాయి. మీ వైవాహిక జీవితంలో ప్రతికూలతలు ఎదుర్కోవాల్సి రావొచ్చు. ఏడాది చివర్లో మీరు పనిచేస్తున్న రంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు, ఉద్యోగులు మంచి ఫలితాలు పొందుతారు.
మకరం
మకర రాశివారికి ఈ ఏడాది అంత అనుకూల ఫలితాలు లేవు. వ్యక్తిగత జీవితంలో ఎదురైన సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు. ఆరోగ్యం విషయంలో అస్సలు నిర్లక్ష్యంగా వ్యవహరించకండి. చిన్న సమస్య వచ్చినా అప్రమత్తం అవండి. ఆర్థిక సంబంధింత విషయంలో అజాగ్రత్తగా ఉండొద్దు. మీ కుటుంబ సభ్యులకు మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నించండి. వారికి తగిన సమయం ఇవ్వండి. ఇంట్లో వచ్చే సమస్యలను ప్రశాంతంగా పరష్కరించుకునేందుకు ప్రయత్నించండి. ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులు కొన్ని సవాళ్లు ఎదుర్కొనే అవకాశం ఉంది.
Also Read: భగవద్గీత బోధన తర్వాత విశ్వరూపం చూసింది కేవలం అర్జునుడు మాత్రమే కాదు.. మరో మగ్గురున్నారు, ఒక భగవద్గీత - 108 ప్రశ్నలు- Part 5
కుంభం
ఈ రాశి వారికి 2022 భలే ఉంటుంది. పెళ్లికాని వారికి మంచి సంబంధాలు కుదురుతాయి. వివాహితులు సంతోషంగా ఉంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా కలిసొచ్చే ఏడాది ఇది. కెరీర్ పరంగా పరిస్థితులన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి. సొంత వ్యాపారం ఉన్నవారు విజయం సాధిస్తారు. భాగస్వామితో కలిసి పని చేస్తున్నట్లయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. విదేశాలకు వెళ్లాలనే ఆలోచన ఉంటే 2022 చివరి నాటికి నెరవేరే అవకాశం ఉంది.
మీనం
2022లో మీన రాశివారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఏడాది ఆరంభంలోనే అప్పులన్నీ క్లియర్ చేసుకుంటారు. ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున ప్లాన్ ప్రకారం ముందడుగేస్తే మంచిది. ఈ ఏడాది విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండొచ్చు. వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి 2022 కలిసొస్తుంది. కార్యాలయం నుంచి వాహనం లేదా మరికొన్ని సౌకర్యాలు పొందుతారు. 2022 ద్వితీయార్థంలో ప్రమోషన్ పొందే అవకాశం ఉంది.
Also Read: ఒక భగవద్గీత - 108 ప్రశ్నలు- Part 1
Also Read: భగవద్గీత మా అమ్మ లేని లోటు తీర్చిందన్న స్వాతంత్ర్య సమరయోధుడెవరు… ఒక భగవద్గీత - 108 ప్రశ్నలు- Part 2
Also Read: ఆనందం ఎక్కడ దొరుకుతుంది… ఒక భగవద్గీత - 108 ప్రశ్నలు- Part 3
Also Read: మనసు నిగ్రహంగా ఉండాలంటే ఏం చేయాలి… ఒక భగవద్గీత - 108 ప్రశ్నలు- Part 4
Also Read: భగవద్గీత పూజించడానికి మాత్రమే కాదు.. మనిషిగా బతకడానికి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Horoscope 6th July 2022: ఈ రాశులవారి దృష్టి తప్పుడు కార్యకలాపాలపైకి మళ్లుతుంది , జులై 6 బుధవారం రాశిఫలాలు
Panchang 6th July 2022: జులై 6 బుధవారం తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, వివస్వత సప్తమి సందర్భంగా సూర్య ధ్యానం
Jagannath Temple: దేవుడికి దహన సంస్కారాలు, ఈ ఆలయంలో విగ్రహాలను దహనం చేసేస్తారు, మళ్లీ ఇలా ప్రాణం పోసుకుంటాయ్!
Kumar Sashti 2022 : కుజ దోష, నాగ దోషం, సంతాన లేమి నివారణకోసం కుమారషష్టి రోజు ఇలా చేయండి!
Ashada Masam 2022: ఆషాఢం మాసంలో కొత్త దంపతులను ఎందుకు దూరంగా ఉంచుతారు!
Alia Bhatt On First Night: బాగా అలసిపోయాం- ఫస్ట్ నైట్పై ఆలియా భట్ బోల్డ్ కామెంట్
IND vs ENG, 5th Test: ఓటమికి తోడు టీమ్ఇండియాకు మరో షాక్! WTC ఫైనల్ అర్హతకు ప్రమాదం!
Pegasus House Committee : గత ప్రభుత్వంలో డేటా చోరీ జరిగింది - నివేదికను అసెంబ్లీకిస్తామన్న భూమన !
జియో యూజర్స్కు గుడ్ న్యూస్, ఈ ప్లాన్స్ తీసుకుంటే Netflix, Amazon Prime సబ్స్క్రిప్షన్ ఉచితం