అన్వేషించండి

Geetha Jayanthi Special: భగవద్గీత బోధన తర్వాత విశ్వరూపం చూసింది కేవలం అర్జునుడు మాత్రమే కాదు.. మరో మగ్గురున్నారు, ఒక భగవద్గీత - 108 ప్రశ్నలు- Part 5

భగవద్గీతకి సంబంధించిన ప్రశ్నలు-సమాధానాలు మరికొన్ని Par-5 లో చూడొచ్చు

భగవధ్గీతలో మొత్తం 700 శ్లోకాలున్నాయి. ఉరకల పరుగుల జీవనంలో మొత్తం చదివే అవకాశం అందరికీ ఉండకపోవచ్చు. అందుకే చదివిన వారికి ఎంతవరకూ అర్థమైంది, చదవని వారు తెలుసుకోవాల్సిన విషయాలను కొన్ని ప్రశ్నలు సమాధానాల రూపంలో ఇస్తున్నాం. 
Part 1, Part-2, Part-3, Part-4 లో 80 ప్రశ్నలు-సమాధానాలు ఇచ్చాం... 81 నుంచి 108 వరకూ ప్రశ్నలు సమాధానాలు ఇక్కడ చూడొచ్చు.
81. ఇంద్రియాల్లో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పాడు?
మనస్సు
82. పర్వతాల్లో తాను ఏ పర్వతం అన్నాడు?
మేరువు
83. పురోహితుల్లో తాను ఎవరినన్నాడు?
బృహస్పతి
84. వాక్కులలో ఎవరని శ్రీకృష్ణుడు చెప్పాడు?
ఓం కారం
85. యజ్ఞాల్లో ఎవరిని అన్నాడు?
జప యజ్ఞము
86. ఏనుగుల్లో  తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పాడు?
 ఐరావతము
87. గుర్రాల్లో ఎవరన్నాడు?
ఉచ్ఛైశ్శ్రవసము
Also Read: ఒక భగవద్గీత - 108 ప్రశ్నలు- Part 1
88. ఆహారం ఎన్ని రకాలని చెప్పాడు?
మూడు (సాత్విక, రాజస, తామసాహారము)
89. దేవఋషులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
నారదుడు
90. సిద్ధుల్లో  ఎవరినని శ్రీకృష్ణుడు చెప్పాడు?
కపిల మునీంద్రుడు
91. భగవద్గీత చివరి అధ్యాయం పేరేంటి?
 మోక్షసన్యాస యోగం
92. లెక్కపెట్టేవారిలో తాను ఎవరని చెప్పాడు?
కాలము
93. జలచరాల్లో తానెవరని శ్రీకృష్ణుడు చెప్పాడు?
మొసలి
94. ఆత్మను దేహంలో ఉంచాడానికి కారణమైన మూడు గుణాలేంటి?
సత్త్వ, రజ, తమో గుణములు.
95. వేగంగా సంచరిస్తూ పవిత్రమొనర్చు వారిలో తానెవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
వాయువు.
Also Read: భగవద్గీత మా అమ్మ లేని లోటు తీర్చిందన్న స్వాతంత్ర్య సమరయోధుడెవరు… ఒక భగవద్గీత - 108 ప్రశ్నలు- Part 2
96. భక్తియోగమైన పన్నెండో అధ్యాయంలో భక్తుని లక్షణాలు ఎన్నని చెప్పాడు?
35
97. విద్యల్లో ఏ విద్యనన్నాడు ?
ఆధ్యాత్మిక విద్య
98. రాగద్వేష రహితముగా, తత్త్వ నిశ్చయం కోసం వాదించువారిలో తానెవరని శ్రీకృష్ణుడు చెప్పాడు?
వాదము.
99. అక్షరాల్లో ఏ అక్షరమన్నాడు?
“అ”-కారము
100. భగవంతుని విశ్వరూప సందర్శనం ఎవరు మాత్రమే చూశారు?
అర్జునుడు. (వ్యాసుడు, వ్యాసుని వరం వలన సంజయుడు, రథ ధ్వజంపై అదృశ్యరూపంలో వున్న హనుమంతుడు కూడా)
101. మాసాల్లో తాను ఏ మాసమునని శ్రీకృష్ణుడు చెప్పాడు?
మార్గశిరం
102. క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగమైన 13వ అధ్యాయంలో జ్ఞానగుణాలు మొత్తం ఎన్ని చెప్పాడు?
20 (ఇరువై)
Also Read: ఆనందం ఎక్కడ దొరుకుతుంది… ఒక భగవద్గీత - 108 ప్రశ్నలు- Part 3
103. శ్రీకృష్ణ భగవానునుడు దైవగుణాలు ఎన్నని చెప్పాడు?
26 (ఇరువైఆరు)
104. అసుర గుణములు ఎన్ని?
6 (ఆరు)
105. తపస్సులెన్ని రకాలు?
మూడు (శారీరక, వాచిక, మానసిక)
106. పరబ్రహ్మకు ఎన్నిపేర్లు?
మూడు (ఓమ్, తత్, సత్).
107. మోక్షాన్ని పొందటానికి కర్మలను వదలాలా?
లేదు. కర్మలు చేసేటప్పుడు భగవంతుడిపై మనస్సు లగ్నమై ఉండాలి
108. సంజయుడు ఎవరి అనుగ్రహంతో  గీతాసంవాదాన్ని లైవ్ లో విన్నాడు?
వేదవ్యాసుడు
Also Read: మనసు నిగ్రహంగా ఉండాలంటే ఏం చేయాలి… ఒక భగవద్గీత - 108 ప్రశ్నలు- Part 4
Also Read: భగవద్గీత పూజించడానికి మాత్రమే కాదు.. మనిషిగా బతకడానికి
Also Read: వారణాసి మహిమను వివరించే కాశీవిశ్వనాథ్ కారిడార్.. అక్కడ అణువణువూ ప్రత్యేకమే
Also Read: శవాలు దహనం చేసే ఘాట్ సహా కాశీలో ముఖ్యమైన ఘాట్లు ఇవి..
Also Read: జీవిత కాలంలో ఒక్కసారైన దర్శించుకోవాల్సిన శైవ క్షేత్రాలివి
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP MLC Elections: ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల సీటు, నేతల మధ్య పెంచుతోంది హీటు... ఆ ఛాన్స్ ఎవరికో
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల సీటు, నేతల మధ్య పెంచుతోంది హీటు... ఆ ఛాన్స్ ఎవరికో
Australia In Semis: సెమీస్ కు ఆసీస్.. ఆఫ్గాన్ తో మ్యాచ్ ర‌ద్దు.. టోర్నీ నుంచి ఆఫ్గాన్ ఔట్..! సౌతాఫ్రికాపైనే అంద‌రి దృష్టి
సెమీస్ కు ఆసీస్.. ఆఫ్గాన్ తో మ్యాచ్ ర‌ద్దు.. టోర్నీ నుంచి ఆఫ్గాన్ ఔట్..! సౌతాఫ్రికాపైనే అంద‌రి దృష్టి
Good Bad Ugly Teaser: అజిత్ మాస్... ఇది కదా ఫ్యాన్స్ కోరుకునేది - 'గుడ్ బ్యాడ్ అగ్లీ' టీజర్ అదిరిందంతే
అజిత్ మాస్... ఇది కదా ఫ్యాన్స్ కోరుకునేది - 'గుడ్ బ్యాడ్ అగ్లీ' టీజర్ అదిరిందంతే
Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ - త్వరలోనే పనులు ప్రారంభం
వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ - త్వరలోనే పనులు ప్రారంభం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Badrinath Avalanche Workers Trapped | మంచుచరియల కింద చిక్కుకుపోయిన 41మంది | ABP DesamFlash Floods in Kullu Manali | బియాస్ నదికి ఆకస్మిక వరదలు | ABP DesamSuriya Jyothika With Kids First Time | సూర్య, జ్యోతిక పిల్లలు ఎంత పెద్ద వాళ్లైపోయారో | ABP DesamSLBC Tunnel Incident vs Uttarakhand Tunnel | ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ సక్సెస్..SLBC లో దేనికి ఆటంకం.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLC Elections: ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల సీటు, నేతల మధ్య పెంచుతోంది హీటు... ఆ ఛాన్స్ ఎవరికో
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల సీటు, నేతల మధ్య పెంచుతోంది హీటు... ఆ ఛాన్స్ ఎవరికో
Australia In Semis: సెమీస్ కు ఆసీస్.. ఆఫ్గాన్ తో మ్యాచ్ ర‌ద్దు.. టోర్నీ నుంచి ఆఫ్గాన్ ఔట్..! సౌతాఫ్రికాపైనే అంద‌రి దృష్టి
సెమీస్ కు ఆసీస్.. ఆఫ్గాన్ తో మ్యాచ్ ర‌ద్దు.. టోర్నీ నుంచి ఆఫ్గాన్ ఔట్..! సౌతాఫ్రికాపైనే అంద‌రి దృష్టి
Good Bad Ugly Teaser: అజిత్ మాస్... ఇది కదా ఫ్యాన్స్ కోరుకునేది - 'గుడ్ బ్యాడ్ అగ్లీ' టీజర్ అదిరిందంతే
అజిత్ మాస్... ఇది కదా ఫ్యాన్స్ కోరుకునేది - 'గుడ్ బ్యాడ్ అగ్లీ' టీజర్ అదిరిందంతే
Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ - త్వరలోనే పనులు ప్రారంభం
వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ - త్వరలోనే పనులు ప్రారంభం
Andhra Pradesh Budget 2025: అమరావతికి కేటాయింపులు ఎందుకు?: పయ్యావుల ఆసక్తికర కామెంట్స్
అమరావతికి కేటాయింపులు ఎందుకు?: పయ్యావుల ఆసక్తికర కామెంట్స్
Revanth on Kishan Reddy:  కిషన్ రెడ్డి వల్లే తెలంగాణకు అన్యాయం - మరోసారి రేవంత్ ఆగ్రహం
కిషన్ రెడ్డి వల్లే తెలంగాణకు అన్యాయం - మరోసారి రేవంత్ ఆగ్రహం
Viral News: కోనసీమలో మోనాలిసా అంటూ బాలిక వీడియో తీశాడు.. చివరకు ఆ యువకుడి పరిస్థితి ఇదీ
కోనసీమలో మోనాలిసా అంటూ బాలిక వీడియో తీశాడు.. చివరకు ఆ యువకుడి పరిస్థితి ఇదీ
Ram Charan - Chiranjeevi: రామ్ చరణ్ సినిమాలో అతిథిగా మెగాస్టార్... అందులో నిజం ఎంతంటే?
రామ్ చరణ్ సినిమాలో అతిథిగా మెగాస్టార్... అందులో నిజం ఎంతంటే?
Embed widget