By: ABP Desam | Updated at : 15 Dec 2021 06:57 PM (IST)
Kolkata Durga Puja In UNESCO 'Intangible Cultural Heritage'
కోల్ కతా దుర్గామాత దసరా వేడుకలకు ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. దీనికి ప్రతిష్ఠాత్మక 'ఐక్యరాజ్య సమితి విద్య, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ (యునెస్కో)' సాంస్కృతిక జాబితాలో చోటు దక్కింది. దుర్గామాత పూజ, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగే తీరును జనం మెచ్చిన ఉత్తమ ప్రదర్శనగా గుర్తిస్తూ 'ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ' అనే జాబితాలో స్థానం కల్పించింది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాంస్కృతిక, సంప్రదాయల జాబితాలో శ్రేష్టమైన హోదా కల్పిస్తూ యునెస్కో ట్వీట్ చేసింది.
📢Durga Puja in #Kolkata has just been inscribed on the #IntangibleHeritage list!
— UNESCO New Delhi (@unesconewdelhi) December 15, 2021
Inscriptions to the Representative List are one of the several ways by which #UNESCO advocates the promotion and safeguarding of intangible cultural heritagehttps://t.co/rpVdNJgLIb #LivingHeritage pic.twitter.com/FBKiRaRbio
ఏటా సెప్టెంబరు ఆఖర్లో లేగా అక్టోబరులో దసరా వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతుంటాయి. ముఖ్యంగా కోల్ కతా లో వేడుకలు వర్ణించేందుకు మాటలు చాలవు. కన్నుల పండువగా తీర్చిదిద్దే పండళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలతో కోల్ కతా నగరం మారుమోగిపోతుంది. ముఖ్యంగా చివరి మూడు రోజులు దుర్గాష్టమి, మహర్నవమి, దశమి రోజు నగరం భక్తులతో కళకళలాడిపోతుంది.శరన్నవరాత్రుల వేడుక సందర్భంగా పండళ్లు తీర్చిదిద్దేందుకు, కల్చరల్ యాక్టివిటీస్ తో చాలామంది ఉపాధి లభించడం అద్బుతం అంది యునెస్కో.
Also Read: 2022 లో ఈ నాలుగు రాశుల వారు అన్నింటా విజయం సాధిస్తారు, ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం..
ప్రఖ్యాత నిర్మాణాలకు ప్రత్యేక గుర్తింపునిచ్చే ప్రపంచ వారసత్వ సంపద జాబితా, ఈ సాంస్కృతిక జాబితా వేర్వేరు. సాంస్కృతిక జాబితాలో మూడు విభాగాల్లో మొత్తం 550 అంశాలు ఉన్నాయి. ఇవి 127 దేశాలకు చెందినవి. ఇందులో ఏటా కొత్త అంశాలు చేరుతుంటాయి. 2017లో కుంభమేళాకు ఈ గుర్తింపు లభించింది. 2016లో యోగా UNESCO ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో చేరింది. 2014లో పంజాబ్ సంప్రదాయ ఇత్తడి, రాగి క్రాఫ్ట్, 2013లో మణిపూర్ సంకీర్తన ఆచార పాటలు, 2010లో చౌ, కల్బెలియా ముడియెట్టు నృత్య రూపాలకు ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో చోటు దక్కింది. సంప్రదాయాలు, ప్రదర్శన కళలు, ఆచారాలు, పండుగల సమయాల్లో నిర్వహించే కార్యక్రమాలు, సంప్రదాయ హస్తకళలను పరిగణలోకి తీసుకుని ఈ హోదా కల్పిస్తారు.
Also Read: 2022 ఈ నాలుగు రాశుల వారికి కొత్తకొత్తగా ఉంటుంది, చాలా సమస్యల నుంచి రిలీఫ్ పొందుతారు..
Also Read: 2022 లో ఈ నాలుగు రాశులవారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందంటే...
Also Read: భగవద్గీత బోధన తర్వాత విశ్వరూపం చూసింది కేవలం అర్జునుడు మాత్రమే కాదు.. మరో మగ్గురున్నారు, ఒక భగవద్గీత - 108 ప్రశ్నలు- Part 5
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Election Result 2023 Astrology: ఎన్నికల ఫలితాల్లో ఈ రాశులవారికి విజయం - వారికి అపజయం, గ్రహాలు చెప్పే ఎగ్జిట్ పోల్ ఇదే!
Horoscope Today December 23rd, 2023: ఈ రాశులవారికి ఆనందం - ఆ రాశులవారికి ఆందోళన, డిసెంబరు 03 రాశిఫలాలు
Astrology: ఈ 5 రాశులవారు అపర చాణక్యులు, వ్యూహం రచిస్తే తిరుగుండదు!
Margashira Masam 2023 Starting Ending Dates: ముక్కోటి ఏకాదశి, గీతాజయంతి సహా మార్గశిరమాసం ( డిసెంబరు) లో ముఖ్యమైన రోజులివే!
Christmas Celebrations 2023: ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలు ఈ చర్చిల్లో జరుపుకునేందుకు ప్లాన్ చేసుకోండి!
Telangana Election Results 2023 LIVE: తొలి రౌండ్ - గజ్వేల్ లో సీఎం కేసీఆర్ కు 300 ఓట్ల ఆధిక్యం
Election Results 2023:ఫలితాలపై పెరుగుతున్న ఉత్కంఠ, మరికొద్ది గంటల్లో తేలిపోనున్న భవితవ్యం
Telangana Elections Results 2023: 'కారు' హ్యాట్రికా! లేక అధికారం 'హస్త' గతమా ? - తెలంగాణ ప్రజల తీర్పు ఏంటి ?
DK Shivakumar to Hyderabad: కాంగ్రెస్ భారీ స్కెచ్, రంగంలోకి డీకే శివకుమార్ - కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సేఫ్!
/body>