By: ABP Desam | Updated at : 22 Dec 2021 04:09 PM (IST)
Edited By: RamaLakshmibai
Mahabharat:Padmavyuham
ఎవరైనా తీవ్రమైన సమస్యల వలయంలో చిక్కుకుంటే 'పద్మవ్యూహంలో చిక్కుకుపోయాడు' అంటారు. అంటే బయటకు రాలేనంత పెద్ద సమస్య అని అర్థంవచ్చేలా ఈ పదం వాడతారు. కానీ అసలైన పద్మవ్యూహం ఎలా ఉంటుందో తెలుసా. పద్మవ్యూహం...అతిరథ మహారథులకే అంతుపట్టని రహస్యం. లోపలికి వెళ్ళిన కొద్దీ చావును ఆహ్వానించే మృత్యుదారి. వలయాకారంలో ఉండడంతో దీన్ని ‘చక్రవ్యూహం’అని కూడా అంటారు. ఏడు వలయాల్లో రథ, గజ, తురగ, పదాతి సైన్యాలతో శత్రు దుర్భేద్యమైనది పద్మవ్యూహం. అసలు కురుక్షేత్రం సమయంలో పద్మవ్యూహంలోకి అభిమన్యుడు ఎలా వెళ్లాడు. ఎందుకు తిరిగి రాలేకపోయాడు.
ద్రోణుడు సృష్టించిన పద్మవ్యూహం
భీష్ముడి తర్వాత కౌరవ సర్వ సైన్యాధ్యక్షుడిగా ద్రోణుడిని నియమిస్తారు. రెండు రోజులు యుద్ధం జరిగినా ధర్మరాజును బంధించలేకపోయారంటూ దుర్యోధనుడు హేళనగా మాట్లాడతాడు. సిగ్గుపడిన ద్రోణుడు ఈ రోజు నేను ఓ వ్యూహాన్ని నిర్మిస్తాను అది దేవతలు కూడా భేదించలేనిది, మహావీరుడైతే తప్ప దాన్ని అర్థం చేసుకోలేడని అంటాడు. అదే పద్మవ్యూహం.
Also Read: రోజూ పెరుగుతున్న దేవుడి విగ్రహం.. విశిష్టత తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
ఇలా నిర్మించారు
కౌరవ సేనలను తామరపువ్వు ఆకారంలో నిల్చోబెట్టాడు ద్రోణుడు. వివిధ దేశాధిపతులు తామరపువ్వులోని రేకుల్లా.. వారి కుమారులు పువ్వు మధ్యభాగంలో కేసరిలా నిలబడ్డారు. కర్ణుడు, దుశ్శాసనుడు సేనలతో కలిసి పద్మం లోపలి భాగాన, వారి మధ్య దుర్యోధనుడూ ససైన్యంగా నిలిచారు. సైంధవుడూ, అశ్వత్థామా, కృపాచార్యుడు, శకుని, కృతవర్మ, భూరిశ్రవుడు, శలుడు, శల్యుడు, కౌరవులు వారంతా ద్రోణుడు కేటాయించిన స్థానాల్లో నిల్చున్నారు.
Also Read: కోరిన కోర్కెలు తీర్చే చింతల వెంకటరాయుడు సన్నిది.. ఇతర రాష్ట్రాల వారినీ ఆకర్షిస్తున్న పురాతన క్షేత్రం
అభిమన్యుడిని పంపిన ధర్మరాజు
దిక్కుతోచని పరిస్థితిలో ధర్మరాజుకు అభిమన్యుడుని పంపక తప్పలేదు. ఈ పద్మవ్యూహంలో చొరబడటం నీకూ, నీ తండ్రి అర్జునుడికి, శ్రీకృష్ణుడు, ప్రద్యుమ్నుడుకి మాత్రమే తెలుసు. మనల్ని చూసి నీ తండ్రి హేళన చేయకుండా ఆ పద్మ వ్యూహాన్ని ఛేదించు అని కోరతాడు. అభిమన్యుడు ఉత్సాహంగా ‘నా తండ్రి నాకీ వ్యూహాన్ని ఛేదించే లోపల ప్రవేశించడం వరకూ చెప్పాడు కౌరవ సైన్యాన్ని చీల్చి చెండాడుతా అంటాడు. నువ్వు దారి చూపి పద్మవ్యూహంలోకి ప్రవేశిస్తే, నీ వెంటే మేమంతా లోపలికి ప్రవేశిస్తాం అంటాడు ధర్మరాజు. సారథి సుమిత్రుడు అభిమన్యుణ్ని మరోసారి ఆలోచించుకోమని చెప్పినా... సందేహాలను కొట్టిపడేసి మెరుపు వేగంతో మండే అగ్నిగోళంలా పద్మవ్యూహంలోకి చొచ్చుకుని పోతాడు. కౌరవ సేనని చెల్లాచెదులు చేశాడు, కర్ణుడి కవచాన్ని పగలగొట్టాడు. అభిమన్యుడి అస్త్రాల ధాటికి దుర్యోధనుడు పారిపోతాడు. మరోవైపు అభిమన్యునిని అనుసరిస్తూ పద్మవ్యూహంలోకి చొరబడిన పాండవులకు కౌరవుల బావమరిది సైంధవుడు అడ్డు తగిలాడు. అర్జునుడిని తప్ప మిగతా పాండవులను ఒక్కరోజు మాత్రం నిలువరించే వరాన్ని పరమేశ్వరుడి నుంచి పొందాడు సైంధవుడు. దాంతో అతడి అస్త్రాల ధాటికి తట్టుకోలేక పాండవ సైన్యం వెనుతిరుగుతుంది. వ్యూహంలో భాగంగా ఆ రోజు అర్జునుడిని యుద్ధభూమికి దక్షిణంగా వెళ్లేలా చేస్తారు.
Also Read: వాలు జడలో వంద కథలు.. ప్రతి జడకి, ముడికి అర్థం ఉంది..
యుద్ధనీతికి వ్యతిరేకంగా అభిమన్యుడిపై దాడి
కౌరవ సేనని చీల్చి చెండాడుతున్న అభిమన్యుడిని నిలువరించాలంటే కపటోపాయం తప్ప మరో విధంగా ఆపలేమంటాడు ద్రోణుడు. అప్పుడు కౌరవ యోధులంతా యుద్ధనీతికి వ్యతిరేకంగా అభిమన్యుడిపై దాడి చేసి నిరాయుధుణ్ణీ చేసి బాణాలు వదిలారు. అప్పుడు కూడా అభిమన్యుడు రథంలోని చక్రాయుధాన్ని తీసుకుని గిరగిరా తిప్పుతూ సింహనాదం చేస్తూ యుద్ధం చేశాడు. అన్ని వైపుల నుంచీ చుట్టు ముట్టి ఆ ఆయుధాన్నీ ముక్కలు చేశారు. ఆ తర్వాత దుశ్శాసనుని కుమారుడితో గదాయుద్ధం చేసి పోరాడి ప్రాణాలు వదిలాడు అభిమన్యుడు. అభిమన్యుడి మరణవార్త విని దుర్యోధనుడు తెగ సంబరపడిపోయాడట.
Also Read: ఈ టైమ్ లో చెడుమాట్లాడితే అంతే...
అభిమన్యుడికి ఎలా తెలుసంటే..
పద్మవ్యూహంలో ప్రవేశించటం గురించి అభిమన్యుడి తల్లి, కృష్ణుడి సోదరి సుభద్ర తన భర్త అర్జునుడిని అడిగింది. అప్పటికి అభిమన్యుడు సుభద్ర గర్భంలో ఉన్నాడు. పద్మవ్యూహం గురించి అర్జునుడు చెబుతుండగా, సుభద్ర ‘ఊ కొడుతూ’ నిద్రపోయింది. అయితే, ఆ తర్వాత నుంచి సుభద్ర గర్భంలో ఉన్న అభిమన్యుడు ‘ఊ కొట్టడం’ మొదలు పెట్టాడు. అది గమనించన అర్జునుడు పద్మవ్యూహాంలోకి ఎలా వెళ్లాలో చెబుతాడు..ఆ తర్వాత సుభద్ర నిద్రపోవడం గమనించి చెప్పడం ఆపేశాడు. అందుకే అభిమన్యుడికి వెళ్లడమే కానీ రావడం తెలియలేదు.
Also Read: తిరుప్పావై అంటే ఏంటి, ఆండాళ్ ఎవరు.. గోదాదేవి రాసిన 30 పాశురాల ప్రత్యేకత ఏంటి…
అప్పుడేం జరిగిందో తెలుసుకుంటే ఇప్పుడేం ప్రయోజనం అనేవారికోసం..
అభిమన్యుడి నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మనకు ఎంత తెలుసని కాదు..తెలిసింది సరిగ్గా వాడామా లేదా అన్నదే ముఖ్యం. జీవితంలో ఎన్నో అనుకుంటాం అన్నీ అనుకున్నట్టు జరగవు. అప్పుడు ఎదురైన పరిస్థితులకు తగినట్టు మారాలి. మన ముందు ఎంత పెద్ద కష్టం అయినా ఉండొచ్చు కానీ ఎంత పెద్ద కష్టమైనా పోరాడాలి. నిజమైన పోరాటానికి అర్థం ఓడిపోయేవరకూ పోరాడటం కాదు ఊపిరిపోయే వరకూ పోరాడటం. అభిమన్యుడి క్యారెక్టర్ మాత్రమే కాదు...మహాభారతంలో ప్రతి అక్షరం, ప్రతి పాత్ర ప్రస్తుత సమాజానికి అన్వయించుకోవాల్సినవే. మంచి-చెడు- స్నేహం-కపటం-మోసం-ప్రేమ..ఇలా అన్నింటిలోనూ ఎలా ఉండాలి- ఎలా ఉండకూడదో నేర్పించే గురువు మహాభారతం.
Also Read: జీవితకాలంలో ఈ ఏడు క్షేత్రాలను ఒక్కసారైనా దర్శించుకుంటే.. స్వర్గలోకంలోకి ఎంట్రీ ఖాయమట
Also Read: శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించిన రోజు ఇదే... ఈ నెలంతా ప్రత్యేకమే
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Horoscope 6th July 2022: ఈ రాశులవారి దృష్టి తప్పుడు కార్యకలాపాలపైకి మళ్లుతుంది , జులై 6 బుధవారం రాశిఫలాలు
Panchang 6th July 2022: జులై 6 బుధవారం తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, వివస్వత సప్తమి సందర్భంగా సూర్య ధ్యానం
Jagannath Temple: దేవుడికి దహన సంస్కారాలు, ఈ ఆలయంలో విగ్రహాలను దహనం చేసేస్తారు, మళ్లీ ఇలా ప్రాణం పోసుకుంటాయ్!
Kumar Sashti 2022 : కుజ దోష, నాగ దోషం, సంతాన లేమి నివారణకోసం కుమారషష్టి రోజు ఇలా చేయండి!
Ashada Masam 2022: ఆషాఢం మాసంలో కొత్త దంపతులను ఎందుకు దూరంగా ఉంచుతారు!
Mega Sentiment: 'మెగా'స్టార్ న్యూమరాలజీ సెంటిమెంట్ - పేరులో చిరు మార్పు
Twitter Moves Court : ప్రభుత్వం చెప్పినట్లు చేయలేం - కర్ణాటక హైకోర్టులో ట్విట్టర్ పిటిషన్ !
IND vs ENG 5th Test: బాజ్ బాలా? అదేంటో తెలియదంటున్న రాహుల్ ద్రవిడ్
Shaitan Web Series: ఓటీటీ కోసం 'యాత్ర' దర్శకుడి వెబ్ సిరీస్ - 'సైతాన్'