Spirituality: ఈ టైమ్ లో చెడుమాట్లాడితే అంతే...
తథాస్తు దేవతలున్నారు ఏది పడితే అది మాట్లాడకు అంటుంటారు కదా..నిజంగా తథాస్తు దేవతలున్నారా..మరెందుకు అలా అంటారు..
సాయంత్రం సమయంలో ఏదైనా మాట అనగానే...మంచి అంటే పర్వాలేదు కానీ చెడు మాట్లాడితే మాత్రం తథాస్తు దేవతలున్నారు జాగ్రత్త అంటారు పెద్దలు. సంధ్యాసమయంలో ఏమైనా అంటే అవి నిజం అయిపోతుంటాయనే ప్రచారం కూడా ఉంది. నిజంగా తథాస్తు దేవతలు ఉన్నారా అంటే పురాణాల్లో ఏం చెప్పారో తెలుసుకోవాలి. వేదాల్లో ‘అనుమతి’అనే దేవతలు ఉండేవారట. యజ్ఞాలు, యాగాలు లాంటి సత్కర్మలు ఆచరించేటప్పుడు ఈ దేవతలను స్మరిస్తే ఆ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయ్యేదని యజ్ఞ ప్రకరణంలో పేర్కొన్నారు. ఆ అనుమతి దేవతలనే సామాన్య భాషలో తథాస్తు దేవతలు అంటున్నారు. అంటే ఏం కోరుకుంటే అవి జరగాలని దీవించే దేవతలన్నమాట. తథాస్తు దేవతలనే అశ్వినీ దేవతలని కూడా అంటారు.
Also Read: జీవితకాలంలో ఈ ఏడు క్షేత్రాలను ఒక్కసారైనా దర్శించుకుంటే.. స్వర్గలోకంలోకి ఎంట్రీ ఖాయమట
అశ్వినీ (తథాస్తు) దేవతలు ఎవరంటే...
అశ్వరూపంలోకి మారినప్పుడు సూర్యుడు, ఛాయాదేవికి జన్మించిన వారే అశ్వినీదేవతలు అని చెబుతారు. వారు నిత్యం బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని సూర్యుడి లానే తూర్పు-పడమల దిశగా ప్రయాణిస్తుంటారట. అందుకే సంధ్యాసమయంలో ఏవైనా చెడు విషయాలను పదే పదే ఉచ్ఛరిస్తే తథాస్తు దేవతలు తథాస్తు అనేస్తారని చెడు జరుగుతుందని పెద్దలు చెబుతారు. కొందరు ఎంత ఉన్నా లేదని చెప్పుకుంటారు, సందర్భం లేకపోయినా చెడు విషయాలను మాట్లాడుతుంటారు. అలా కాకుండా మంగళకరమైన మాటలతోనే మంచి జరుగుతుందని.. చెడు మాటలు, అశుభవార్తలను ఇంట ఉపయోగించకూడదనే హెచ్చరికలో కూడా ఇది భాగం అంటారు పెద్దలు.
Also Read: శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించిన రోజు ఇదే... ఈ నెలంతా ప్రత్యేకమే
ఇంకా అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే ఓ ప్రొఫెషన్ కి సంబంధించి చాలామంది నిపుణులు ఉంటారు. కానీ వారిలో కొందరే అద్భుతం అనిపించుకుంటారు. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఆ డాక్టర్ హస్తవాసి మంచిదని చెబుతుంటారు. ఎందుకంటే ఆ వైద్యుడు తన వద్దకు వచ్చిన రోగి త్వరగా కోలుకోవాలని కోరుకుంటాడు, ప్రయత్న లోపం లేకుండా తన విధులు నిర్వర్తిస్తాడు. అంటే వృత్తి ధర్మాన్ని నిర్వర్తించడమే కాదు మంచి కోరుకుంటాడన్నమాట. అలా మంచి ఆలోచించడం వల్ల సరైన సమయంలో అవసరమైన వైద్యం అందించి రోగి కోలుకునేలా చేస్తాడు. తనలో మంచి ఆలోచనలే తథాస్తు అన్నట్టు నెరవేరుతాయన్నమాట. అంటే మంచి ఆలోచనతో తాను చేసిన పనని దేవతలు తథాస్తు అని దీవించారని చెబుతుంటారు. ఇదన్నమాట తథాస్తు దేవతల విషయం.
ఒకరికి చెడు జరగాలని అనుకోవడం లేదా మనకు చెడు జరుగుతుందేమోనని భయపడటం వల్ల తధాస్తు దేవతల ప్రభావంతో అవి ఫలించడం జరుగుతుందంటారు. అందుకే మంచినే తల్చుకుంటే అందరికీ మంచే జరుగుతుంది. వాస్తవంగా చెప్పాలంటే తథాస్తు దేవతలున్నారన్న మాట నిజమో కాదో తెలియదు, దీనిపై వితండ వాదన కూడా అనవసరం. ఎప్పుడూ మంచి మాట్లాడడం వల్ల మనకే కాదు మనవల్ల మరికొందరికి కూడా మంచి జరుగుతుందన్నది గుర్తిస్తే చాలు.
Also Read: ఒక భగవద్గీత - 108 ప్రశ్నలు- Part 1
Also Read: భగవద్గీత మా అమ్మ లేని లోటు తీర్చిందన్న స్వాతంత్ర్య సమరయోధుడెవరు… ఒక భగవద్గీత - 108 ప్రశ్నలు- Part 2
Also Read: ఆనందం ఎక్కడ దొరుకుతుంది… ఒక భగవద్గీత - 108 ప్రశ్నలు- Part 3
Also Read: మనసు నిగ్రహంగా ఉండాలంటే ఏం చేయాలి… ఒక భగవద్గీత - 108 ప్రశ్నలు- Part 4
Also Read: భగవద్గీత బోధన తర్వాత విశ్వరూపం చూసింది కేవలం అర్జునుడు మాత్రమే కాదు.. మరో మగ్గురున్నారు, ఒక భగవద్గీత - 108 ప్రశ్నలు- Part 5
Also Read: ప్రతిష్ఠాత్మక యునెస్కో జాబితాలో చేరిన కోల్ కతా దుర్గామాత వేడుకలు
Also Read: ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి