Mahabharat : అభిమన్యుడు, ఘటోత్కచుడు సహా ఈ 15 మంది పాండవుల సంతానమే..
మహాభారతంలో పంచ పాండవులకు భార్య ద్రౌపది అనే విషయం లోకవిదితం. అయితే ద్రౌపదికి ఐదుగురు భర్తలున్నట్టే పాండవులకు కూడా ద్రౌపది కాకుండా భార్యలు, సంతానం ఉన్నారు. వాళ్లెవరో చూద్దాం..
జీవిత పరమార్థాన్ని తెలుసుకోవాలంటే మహాభారతం చదవాలి లేదా తెలుసుకోవాలి అంటారు. మనిషి జీవితంలో ఎదురయ్యే ప్రతీ ప్రశ్నకు అందులో సమాధానం దొరుకుతుంది. ఈ పవిత్ర గ్రంధం గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సినవి మిగిలిపోతాయి. ఇప్పుడు మేం చెబుతున్న విషయం ఏంటంటే..పాండవులు-భార్యలు-పిల్లల గురించి. మహాభారతంలో ప్రధాన పాత్రలైన పంచపాండవుల భార్య అనగానే ద్రౌపది అంటారు. కానీ వారికి ద్రౌపది కాకుండా ఇంకా భార్యలున్నారు..వారి వల్ల కలిగిన సంతానం కూడా ఉన్నారు. వాళ్లలో అభిమన్యుడు, ఘటోత్కచుడు కూడా ఉన్నారు.
ధర్మ రాజు-భార్యలు-పిల్లలు
ద్రౌపది - ప్రతివింద్యుడు
దేవిక - యౌధేయుడు
పౌరవతి - దేవకుడు
భీముడి భార్యలు-పిల్లలు
ద్రౌపది - శ్రుతసోముడు
జలంధర - సర్వగుడు
కాళి - సర్వగతుడు
హిడింబి- ఘటోత్కచుడు
Also Read: పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే..
అర్జునుడి భార్యలు-పిల్లలు
ద్రౌపది - శ్రుతకీర్తి
ఉలూచి-ఇరా వంతుడు
చిత్రాంగద- బభ్రువాహనుడు
సుభద్ర- అభిమన్యుడు
నకులుడి భార్యలు-పిల్లలు
ద్రౌపది - శతానీకుడు
రేణుమతి - నిరమిత్రుడు
సహదేవుని భార్యలు-పిల్లలు
ద్రౌపది - శ్రుతసేనుడు
విజయ-సహోత్రుడు
భానుమతి- సంతానం లేరు
Also Read: ఆలయంలో ఎన్ని ప్రదక్షిణలు చేస్తున్నారు.. ఏ దేవుడికి ఎన్ని చేయాలో తెలుసా..
మహాభారతంలో పాండవుల జీవితంలో.... బహుభార్యత్వం కనిపిస్తుంది. అయితే అరణ్యవాసంలో ద్రౌపది మాత్రమే పాండవులతో ఉంటుంది. మరి యుద్ధం తరువాత ఎవరెక్కడ ఉన్నారనే ప్రశ్నకు చివరి వరకూ ద్రౌపది మాత్రమే అంటారు. ధర్మరాజు భార్య దేవిక తన పుట్టింట్లో ఉండిపోతుంది, భీముడి భార్య హిడింబి తిరిగి తన రాజ్యానికి వెళ్లిపోతుంది. సుభద్ర, ద్రౌపదితో పాటు చిత్రాంగద, ఉలూపి, వలంధర, కరేణుమతి, విజయ. వీళ్లంతా పాండవులతోపాటే చాలాఏళ్లపాటు హస్తినలోనే ఉంటారు. చివరకు మహాప్రస్థాన సమయానికి పాండవుల వెంట మరణం అంచుల వరకూ నడిచిన సహధర్మపత్ని మాత్రం కేవలం ద్రౌపది మాత్రమే..!!
Also Read: ఒక భగవద్గీత - 108 ప్రశ్నలు- Part 1
Also Read: భగవద్గీత మా అమ్మ లేని లోటు తీర్చిందన్న స్వాతంత్ర్య సమరయోధుడెవరు… ఒక భగవద్గీత - 108 ప్రశ్నలు- Part 2
Also Read: ఆనందం ఎక్కడ దొరుకుతుంది… ఒక భగవద్గీత - 108 ప్రశ్నలు- Part 3
Also Read: మనసు నిగ్రహంగా ఉండాలంటే ఏం చేయాలి… ఒక భగవద్గీత - 108 ప్రశ్నలు- Part 4
Also Read: భగవద్గీత బోధన తర్వాత విశ్వరూపం చూసింది కేవలం అర్జునుడు మాత్రమే కాదు.. మరో మగ్గురున్నారు, ఒక భగవద్గీత - 108 ప్రశ్నలు- Part 5
Also Read: జీవితకాలంలో ఈ ఏడు క్షేత్రాలను ఒక్కసారైనా దర్శించుకుంటే.. స్వర్గలోకంలోకి ఎంట్రీ ఖాయమట
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి