Spirituality: ఆలయంలో ఎన్ని ప్రదక్షిణలు చేస్తున్నారు.. ఏ దేవుడికి ఎన్ని చేయాలో తెలుసా..
దేవాలయాల్లో దేవుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. లోపల అడుగుపెట్టిన వెంటనే ధ్వజస్తంభానికి నమస్కరించి అక్కడి నుంచి మూడు ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుంటారు. ఇంతకీ ప్రదక్షిణలు ఎందుకు చేయాలి…
ప్రదక్షిణలో ప్రతి అక్షరానికి అర్థం ఉంది. 'ప్ర' అంటే పాప నాశనం, ' ద' అంటే కోర్కెలు నెరవేర్చడం, 'క్ష' అంటే జన్మల నుంచి విమోచనం , 'ణ' అంటే జ్ఞానం ద్వారా ముక్తిని ప్రసాదించేదని అర్థం.
వేదాంత పరంగా మొదటి ప్రదక్షిణలో తమలో తమోగుణాన్ని వదిలేయాలి.
రెండో ప్రదక్షిణలో రజోగుణాన్ని వదిలేయాలి
మూడో ప్రదక్షిణలో సత్వగుణాన్ని వదిలియాలి
మూడు ప్రదక్షిణల తర్వాత దేవాయలంలోకి వెళ్లి త్రిగుణాతీతుడైన ఆ పరమాత్మను దర్శించుకోవాలి.
Also Read: బొట్టు పెట్టుకునే అలవాటుందా .. అయితే ఈ వేలితో పెట్టుకుంటే ఆయుష్షు పెరుగుతుందట…
ఏ దేవుడికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలి
- ఏ దేవాలయంలో అయినా కనీసం మూడు ప్రదక్షిణలు తప్పనిసరి
- నవగ్రహాలకు కనీసం మూడు. దోషాలు పోవాలంటే తొమ్మిది చేయాలి, ఆయా గ్రహాల స్థితిని బట్టి 9, 11, 21, 27, 54 ఇలా ప్రదక్షిణలు చేయాలి
- ఆంజనేయుడి ఆలయంలో మూడు. గ్రహదోషాలు పోవాలనుకుంటే కనీసం 9 లేదా 11... భయం, రోగం, దుష్టశక్తుల బాధలు పోవాలంటే కనీసం 21 నుంచి 40 లేదా 108 ప్రదక్షిణలు చేయాలి.
- శివాలయంలో సాధారణ ప్రదక్షిణలు చేయకూడదు. చండీశ్వర ప్రదక్షిణ చేయాలి
- అమ్మవారి దేవాలయంలో కనీసం మూడు లేదా తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి.
- వేంకటేశ్వరస్వామి/బాబా, గణపతి దేవాలయాల్లో కనీసం 3,5,9,11 ప్రదక్షిణలు చేయాలి.
- సాధరణమైన, పరిశుభ్రమైన వస్త్రధారణతో దేవాలయంలో ప్రదక్షిణలు చేయాలి.
వేగంగా, పరుగు పరుగున... అదో పనిలా ప్రదక్షిణ చేయకూడదు. - పక్కనున్న వారితో ముచ్చట్లు పెట్టుకుని ప్రదక్షిణలు చేయరాదు
- ఎన్ని ప్రదక్షిణలు చేసినా మనస్సు స్వామి, అమ్మవార్లపై లగ్నం చేయాలన్న విషయం మర్చిపోరాదు...
Also Read: ఈ రాశుల వారు వివాదాల్లో చిక్కుకోకుండా జాగ్రత్తపడండి, మీ రాశి ఫలితం ఇక్కడ తెలుసుకోండి..
Also Read: తీర్థం తీసుకుని చేయి తలకు రాసుకుంటున్నారా…
Also Read: తిరుప్పావై అంటే ఏంటి, ఆండాళ్ ఎవరు.. గోదాదేవి రాసిన 30 పాశురాల ప్రత్యేకత ఏంటి…
Also Read: మంచి భర్త లభించాలన్నా.. సంసార జీవితం సంతోషంగా సాగాలన్నా ఈ నెలరోజులు చాలా ముఖ్యమట...
Also Read: కలియుగం అంతం అయ్యేసరికి మనిషి ఆయుష్షు ఎంతో తెలిస్తే షాకైపోతారు..
Also Read: పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి