Spirituality: తీర్థం తీసుకుని చేయి తలకు రాసుకుంటున్నారా…
నిత్యం అలవాటులో భాగంగా కొన్ని పనులు చేసుకెళ్లిపోతాం. కానీ ఎవరైనా చెప్పేవరకూ అలా చేయకూడదని చెప్పేవరకూ అస్సలు ఆ ఆలోచనే రాదు. ఈ కోవకు చెందినదే తీర్థం తీసుకుని చేయి తలపై రాసుకోవడం.
సాధారణంగా దేవాలయాలకు వెళ్ళినప్పుడు పురోహితులు అకాల మృత్యు హరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం పాదోదకం పావనం అనే మంత్రాన్ని చెబుతూ తీర్ధాన్ని మూడు సార్లు భక్తులు చేతిలో వేస్తారు. అకాల మరణాన్ని తప్పించే శక్తి, రోగాల నివారణ, పాపక్షయం అయిన కనుక తీర్థాన్ని స్వీకరించి భక్తుడు స్వచ్ఛమైన మనసుతో దేవునిపై దృష్టి ఉంచి తీర్థాన్ని స్వీకరించాలని పండితులు చెబుతున్నారు.
దేవాలయాలకు వెళ్లే వారంతా అక్కడ పూజ, దర్శనం అనంతరం తీర్థ, ప్రసాదాలు తీసుకుంటారు. గుడిలోకి వెళ్లగానే అసంకల్పిత ప్రతీకార చర్యలా చేతులు రెండూ జోడించి కళ్లు మూసుకుని నమస్కారం చేస్తారు, తీర్థం తీసుకున్నాక ఆ చేయిని తలపై రాసుకుంటారు. నమస్కారం సరే కానీ తీర్థం తీసుకున్నాక చేయి తలకు రాసుకోవడమే సరికాదంటున్నాయి శాస్త్రాలు. ఎందుకంటే సాధారణంగా గుడిలో తీర్థాన్ని పంచామృతంతో తయారు చేస్తారు. అంటే అందులో పంచదార, తేనె వేస్తారు కాబట్టి అవన్నీ తలకు రాసుకోవడం మంచిదికాదు.
- తీర్థం తీసుకున్నప్పుడు చేయి ఎంగిలి అవుతుంది. ఆ ఎంగిలి చేతిని కడుక్కోవాలి కానీ తలకు రాసుకోరాదు.
- తీర్థం తీసుకున్నాక స్వామి వారి శఠకోపం తలపై పెడతారు. ఎంగిలి చేయి తలపై రాసుకుంటే స్వామివారి పాదాలుగా భావించే శఠకోపం అపవిత్రం అవుతుందని చెబుతారు.
- తీర్ధం తీసుకున్న తర్వాత ఆ చేతిని కళ్ళకు అడ్డుకోవడం ఎంతో మంచిదని చెబుతారు పండితులు.
Also Read: పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే..
మూడు సార్లు తీర్థం ఎందుకు తీసుకోవాలంటే
- మొదటి సారి తీర్థం తీసుకోవడం వల్ల మానసిక, శారీరక శుద్ధి జరుగుతుంది.
- రెండోసారి తీర్థం తీసుకోవడం వల్లన్యాయ, ధర్మప్రవర్తనలు చక్కదిద్దుకుంటాయి
- మూడోసారి దేవదేవుడుకి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ తీర్థం తీసుకోవాలి
ఇలామాత్రమే చేయాలని కాదు..ఇలా చేస్తే మంచిదని చెబుతారంతే. పాటించడం-లేకపోవడం అన్నది ఎవరి విశ్వాసాలు వారివి అంటారు పండితులు.
Also Read: తిరుప్పావై అంటే ఏంటి, ఆండాళ్ ఎవరు.. గోదాదేవి రాసిన 30 పాశురాల ప్రత్యేకత ఏంటి…
Also Read: మంచి భర్త లభించాలన్నా.. సంసార జీవితం సంతోషంగా సాగాలన్నా ఈ నెలరోజులు చాలా ముఖ్యమట...
Also Read: కలియుగం అంతం అయ్యేసరికి మనిషి ఆయుష్షు ఎంతో తెలిస్తే షాకైపోతారు..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి