Dhanurmasam: మంచి భర్త లభించాలన్నా.. సంసార జీవితం సంతోషంగా సాగాలన్నా ఈ నెలరోజులు చాలా ముఖ్యమట...
ధనుర్మాసం మొదలైంది. వైష్ణవ ఆలాయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. అయితే ఈ నెల రోజులు పెళ్లికాని అమ్మాయిలకు చాలా ముఖ్యమైనది అని తెలుసా..
దక్షిణాయనానికి చివర, ఉత్తరాయణనానికి ముందుడే ధనుర్మాసంలో తెల్లవారుజామున కాలం అత్యంత పవిత్రమైనది. ధను అంచే ఏదో ఒకదానికోసం ప్రార్థించడం. ఈ నెల రోజులూ జరిగే ఆండాళమ్మ పూజ, తిరుప్పావై , గోదాకళ్యాణం ఇవన్నీ ద్రవిడుల సంప్రదాయాలు. అయితే తిరుమలలో మాత్రం ఈ నెలరోజులు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. సుప్రభాతానికి బదులు తిరుప్పావై పఠనం చేస్తారు. సహస్రనామార్చనలో తులసికి బదులు బిల్వపత్రాలతో పూజిస్తారు. ధనుర్మాసం నెలరోజులూ సూర్యోదయం, సూర్యాస్తమం సమయంలో దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుందని చెబుతారు. వైష్ణవ ఆలయాల్లో ఉదయం అర్చన తర్వాత ప్రసాదాన్ని నివేదించి వాటిని పిల్లలకు పంచుతారు. దీన్నే బాలభోగం అంటారు. సూర్యుడు ధనస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు అంటే భోగి వరకు ధనుర్మాసం కొనసాగుతుంది. మార్గశిర పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యమి నుంచి వైష్ణవులు ధనుర్మాస వ్రతం ప్రారంభిస్తారు. శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన ఈ నెలలో గోదాదేవి ధనుర్మాసంలో వ్రతాన్ని చేపట్టి నారాయణుని కొలిచింది. ఈ నెల రోజులు బ్రహ్మ ముహూర్తంలో పారాయణం చేసిన వారు దైవానుగ్రహాన్ని పొందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి.
Also Read: చెడు మాట్లాడకు.. తథాస్తు దేవతలున్నారు అంటారు కదా.. నిజంగా ఉన్నారా, దీని వెనుక అసలు విషయం ఏంటి..
తిరుప్పావై పూజతో అవివాహితుల కోరికలు ఫలిస్తాయి
సాక్షాత్తు భూదేవి అవతారమైన అండాళ్ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. ద్రవిడ భాషలో తిరు అంటే పవిత్రం, పావై అంటే వ్రతం అని అర్థం. వేదాలు, ఉపనిషత్తుల సారమే తిరుప్పావై అని హిందూ పురాణాల్లో పేర్కొన్నారు. విష్ణుచిత్తుడి కుమార్తె గోదాదేవి శ్రీరంగనాథుడినే వివాహం చేసుకుంటానని దీక్ష బూనుతుంది. ఆమె ధనుర్మాసంలో వేకువజామునే లేచి నిత్యం విష్ణువుని పూజిస్తూ తన అనుభూతిని, భావాలని కలపి పద్యం అనగా పాశురం రూపంలో రచించింది. అలా రోజుకొకటి చొప్పున 30 పాశురాలను ఆ మాసంలో రచించి వాటిని విష్ణువుకు అంకితం చేసింది. ఆమె భక్తికి మెచ్చి శ్రీ విష్ణువు ప్రత్యక్షమై ఆమెను శ్రీరంగం రమ్మని చెప్పి మాయమవుతాడు. ఆమె ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పడంతో ఆయన గోదాదేవిని తీసుకుని శ్రీరంగం చేరుకుంటాడు. రంగనాథస్వామితో వివాహం జరిగినంతనే గోదాదేవి ఆయన పాదాల చెంత మోకరిల్లి స్వామిలో అంతర్లీనమైపోతుంది. అందుకే పెళ్లీడుకొచ్చిన అమ్మాయిలు ధనుర్మాసం నెలరోజులూ ఇంటి ముందు ముగ్గులు, గొబ్బెమ్మలు వేసి, శక్తిమేరకు పూజ చేయడం వల్ల... కోరిన వరుడు లభిస్తాడని చెబుతారు. ఈ మాసంలో శ్రీ మహా విష్ణువును పూజించి మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పులగం నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత పదిహేను రోజులు దద్ధ్యోజనం నివేదించాలి. ధనుర్మాస వ్రతం గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం.
Also Read: శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించిన రోజు ఇదే... ఈ నెలంతా ప్రత్యేకమే
Also Read: భారతదేశం అనే పేరుకి కారణం ఒకరు, గోదావరి నదిని భూమిపైకి తీసుకొచ్చింది మరొకరు.. ఈ ఏడుగురి కథే వేరు..
Also Read: ప్రపంచానికి చదువు చెప్పిన భారతదేశం.. ఈ యూనివర్శిటీలో ఫీజులు కట్టక్కర్లేదు, పరీక్షలు ఉండవు..
Also Read: జీవితకాలంలో ఈ ఏడు క్షేత్రాలను ఒక్కసారైనా దర్శించుకుంటే.. స్వర్గలోకంలోకి ఎంట్రీ ఖాయమట
Also Read: కలియుగం అంతం అయ్యేసరికి మనిషి ఆయుష్షు ఎంతో తెలిస్తే షాకైపోతారు..
Also Read: ప్రతిష్ఠాత్మక యునెస్కో జాబితాలో చేరిన కోల్ కతా దుర్గామాత వేడుకలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి