అన్వేషించండి

Viral Video: మేనేజర్‌ను బట్టలూడదీసి దారుణంగా కొట్టిన హోటల్ ఓనర్ అరెస్ట్.. కారణం తెలిస్తే షాక్

Solapur Hotel Horror | షోలాపూర్‌లో మేనేజర్‌ను బట్టలూడతీయడంతో పాటు హోటల్ ఆవరణలో మెటల్ పైపుతో దాడి చేసిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు హోటల్ 7777 యజమానిని అరెస్టు చేశారు.

Solapur Crime News:  మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మధా తాలూకాలోని టెంభుర్ణిలో ఓ హోటల్ మేనేజర్ ను బట్టలూడదీయడంతో పాటు ఆపై ఓనర్ చేసిన దౌర్జన్యం సోషల్ మీడియాలో వైరల్ అయింది. మీడియాలో సైతం ఈ విషయం రావడంతో చివరికి హోటల్ ఓనర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.

సిబ్బందిని బెదిరించేందుకు ఇంత దారుణమా..

సోలాపూర్- పూణే జాతీయ రహదారిపై ఉన్న టెంభుర్ణిలోని హోటల్ 7777 లో ఈ ఘటన జరిగింది. ఈ హోటల్‌లో పనిచేస్తున్న మేనేజర్‌ను హోటల్ యజమాని లఖన్ మానే, ఇతర సిబ్బంది సమక్షంలో నగ్నంగా చేసి ఇనుప రాడ్డుతో దాడి చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఏబీపీ మాఝా సైతం ఈ దారుణ ఘటనను రిపోర్ట్ చేసింది. ఆ తర్వాత, హోటల్ యజమాని లఖన్ మానే, ఈ మేనేజర్‌ను తనతో పాటు తీసుకుని ఫేస్‌బుక్ ద్వారా వివరణ ఇచ్చాడు. మేనేజర్ తప్పు చేయడం వల్లే  కొట్టామని, వీడియో తప్పుగా వైరల్ అయిందన్నాడు. 

బాధితుడు అయిన మేనేజర్ నుంచి పోలీసులు ఫిర్యాదు తీసుకుని వాస్తవాన్ని వెలుగులోకి తెచ్చారు. మేనేజర్ ఉద్యోగం మానేసి వెళ్లకూడదనే ఉద్దేశంతో హోటల్ యజమాని లఖన్ మానే బెదిరించి, మేనేజర్‌ను నగ్నంగా చేసి కొట్టడమే కాక, అతని వద్ద ఉన్న డబ్బులు కూడా తీసుకున్నాడని టెంభుర్ణి పోలీసు ఇన్‌స్పెక్టర్ నారాయణ్ పవార్ తెలిపారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Grey Insights (@greyinsightsbharat)

మూడు నెలల కిందట ఘటన
ఈ సంఘటన మూడు నెలల కిందట జరిగిందని బాధితుడు నకాటే పోలీసులకు తెలిపాడు. లఖన్ మానే భయపెట్టడంతో ఇప్పటికీ అదే హోటల్‌లో పనిచేస్తున్నాడని, పోలీసులకు తన స్టేట్మెంట్ కూడా ఇచ్చాడని నారాయణ్ పవార్ చెప్పారు. ఏబీపీ మాఝా వార్త ప్రచురించిన తరువాత, పోలీసులు హోటల్ నుండి నిందితుడు లఖన్ మానేను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడైన హోటర్ ఓనర్ పై దాదాపు ఎనిమిది వేర్వేరు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. భయభ్రాంతులకు గురిచేయడం, హత్యాయత్నం వంటి వివిధ సెక్షన్లు ఉన్నాయి. సిబ్బందిలో భయాన్ని తీసుకురావాలని ఈ పనిచేశాడని, నిందితుడిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు ఇన్‌స్పెక్టర్ నారాయణ్ పవార్ హామీ ఇచ్చారు.

ఉద్యోగులతో మంచిగా ప్రవర్తించాలి కానీ వారి పట్ల ఇంత దారుణంగా ప్రవర్తించిన హోటల్ మేనేజర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. ఓ వ్యక్తిని, అందులోనూ హోటల్ లో మేనేజర్‌గా మంచి పొజిషన్‌లో ఉన్న అతడ్ని బట్టలూడదీసి కొట్టడం దారుణం అన్నారు. పైస్థాయి ఉద్యోగులకే ఇలాంటి పరిస్థితి తలెత్తితే ఇక కింది స్థాయి ఉద్యోగులను ఆ హోటల్ ఓనర్ ఇంకెంత దారుణంగా చూస్తాడో, వారికి ఎంత టార్చర్ చూపిస్తాడో అని కామెంట్ చేస్తున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
BCCI on Mustafizur Rahman: KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!
KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!
Advertisement

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
BCCI on Mustafizur Rahman: KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!
KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!
Gadchiroli Viral News: గడ్చిరోలిలో దారుణం! ప్రసవం కోసం 6 కిలోమీటర్లు నడిచి వెళ్లిన గర్భిణీ! బీపీ పెరిగి తల్లీ బిడ్డ మృతి
గడ్చిరోలిలో దారుణం! ప్రసవం కోసం 6 కిలోమీటర్లు నడిచి వెళ్లిన గర్భిణీ! బీపీ పెరిగి తల్లీ బిడ్డ మృతి
AP DSC 2026: ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
The Raja Saab Run Time : ప్రభాస్ 'ది రాజా సాబ్' రన్ టైం ఫిక్స్! - 3 గంటల్లోపే డార్లింగ్ హారర్ కామెడీ థ్రిల్లర్
ప్రభాస్ 'ది రాజా సాబ్' రన్ టైం ఫిక్స్! - 3 గంటల్లోపే డార్లింగ్ హారర్ కామెడీ థ్రిల్లర్
Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
Embed widget