Spirituality: బొట్టు పెట్టుకునే అలవాటుందా .. అయితే ఈ వేలితో పెట్టుకుంటే ఆయుష్షు పెరుగుతుందట…
బొట్టు పెట్టుకోవాలి, అది హిందువుల సంప్రదాయం అని అందరికీ తెలుసు. కానీ బొట్టు ఎందుకు పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, పెట్టుకోకుంటే ఏం జరుగుతుంది, పెట్టుకుంటే కలిగే ప్రయోజనం ఏంటన్నది తెలుసా..
ఎంత అలంకరించుకున్నా ముఖంలో బొట్టు పెట్టకపోతే పూర్తిస్థాయి నిండుదనం రాదంటారు. ఎందుకంటే ముఖం చూడగానే ముందుగా కనిపించేది బొట్టే. హిందువుల సంప్రదాయంలో బొట్టుకి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఐదో తనానికి చిహ్నంగా భావించే బొట్టు..ముత్తైదువల ముఖంలో లేకపోవడాన్ని చాలా దోషంగా భావిస్తారు. బొట్టు పెట్టుకోకుంటే శుభకార్యాలు నిర్వహించే అర్హత లేదని హిందువులు విశ్వాసం. ఎదుటి వారికి బొట్టుపెట్టటం మర్యాదకి గుర్తింపు. అందుకే ఎవరినైనా ఆహ్వానించడానికైనా, ఇంటికి వచ్చిన ముత్తైదువు వెళ్లినప్పుడైనా బొట్టు పెట్టి గౌరవించడం హిందూ సంప్రదాయం.
Also Read: తీర్థం తీసుకుని చేయి తలకు రాసుకుంటున్నారా…
బొట్టు పెట్టుకునేటప్పుడు స్మరించాల్సిన మంత్రం
సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణీ నమోస్తుతే అని జగన్మాతను స్మరించుకుంటూ నుదుటన బొట్టు పెట్టుకుంటే మంగళకరం.. శుభకరం అని చెబుతారు.
ఏ వేలితో బొట్టు పెట్టుకోవాలి
బొట్టు పెట్టుకునేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెబుతుంటారు. కొందరు మధ్య వేలు మంచిదని.. మరికొందరు ఉంగరపు వేలు మంచిదని అంటారు. మరికొందరు ఉంగరపు వేలుతో బొట్టు పెట్టుకుంటే శాంతి, మధ్య వేలితే పెట్టుకుంటే ఆయువు పెరుగుతుంది, బొటన వేలితో పెట్టుకుంటే పుష్ఠి కలుగుతుంది, చూపుడు వేలితో పెట్టుకుంటే ముక్తి కలుగుతుందని చెబుతారు.
Also Read: పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే..
నుదుటిపైనే బొట్టెందుకు పెట్టుకోవాలి
బొట్టు నుదుటిపైనే పెట్టుకోవాలనే సంప్రదాయం వెనక కారణాలున్నాయి. జ్ఞాపక శక్తికి, ఆలోచనా శక్తికి స్థానమైన కనుబొమ్మల మధ్య తిలకం పెడతాం. మరో అధ్యయనం ప్రకారం.. బ్రహ్మ స్థానం నుదురుగా భావిస్తారు. అందుకే కనుబొమ్మల మధ్య బొట్టు పెట్టుకుంటే.. బ్రహ్మను పూజించినట్లు అవుతుందని నమ్ముతారు.
Also Read: తిరుప్పావై అంటే ఏంటి, ఆండాళ్ ఎవరు.. గోదాదేవి రాసిన 30 పాశురాల ప్రత్యేకత ఏంటి…
ఎరుపు రంగే ఎందుకు పెట్టుకోవాలి
బొట్టు అంటే ఎరుపు రంగుకే ఎక్కువ ప్రాధాన్యమిస్తారెందుకంటే ... చతుర్ముఖ బ్రహ్మ రంగు ఎరుపు. అందుకే బ్రహ్మస్థానమైన నుదుటిపై ఎరుపు రంగు బొట్టు పెట్టుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు. మన ఆత్మ జ్యోతి స్వరూపమని.. అందుకే ఎరుపు రంగు బొట్టు పెట్టుకోవాలంటారు
కుంకుమ బొట్టుపై సూర్యకాంతి ప్రసరించి.. శరీరం మరింత ఉత్తేజితమవుతుందని చెబుతారు
కనుబొమ్మల మధ్యనున్న సూక్ష్మమైన స్థానం విద్యుదయస్కాంత తరంగ రూపాల్లో శక్తిని వెలువరిస్తుంది. అందుకే విచారంగా ఉన్నప్పుడు వేడి కలిగి తలనొప్పి వస్తుంది. తిలకం లేక కుంకుమ నుదుటిని చల్లబర్చి వేడి నుంచి ఉపశమనం ఇస్తుంది. శక్తిని కోల్పోకుండా మనల్ని కాపాడుతుంది. కొన్ని సమయాల్లో చందనం, విభూతి నుదుటున రాయడమూ మంచిదే.
Also Read: మంచి భర్త లభించాలన్నా.. సంసార జీవితం సంతోషంగా సాగాలన్నా ఈ నెలరోజులు చాలా ముఖ్యమట...
దాదాపు హిందూ ధర్మాన్ని పాటించే అందరూ బొట్టు పెట్టుకుంటారు. ఒకరు నామం, మరొకరు విభూతిరేఖలు, మరొకరు కుంకుమ, గంధం ఇలా రకరకాలుగా నుదుట బొట్టు పెట్టుకుంటారు. అయితే కుంకుమ పెట్టుకోవడం స్త్రీలకే పరిమితం కాలేదు. పురుషులు కూడా పెట్టుకోవడం మంచిదే. ఫైనల్ గా చెప్పేదేంటంటే బొట్టు పెట్టుకోవడం మూఢాచారం కాదు.. పెద్దలు నేర్పించిన ఆధ్యాత్మిక ఆరోగ్య రహస్యం.
Also Read: కలియుగం అంతం అయ్యేసరికి మనిషి ఆయుష్షు ఎంతో తెలిస్తే షాకైపోతారు..
Also Read: జీవితకాలంలో ఈ ఏడు క్షేత్రాలను ఒక్కసారైనా దర్శించుకుంటే.. స్వర్గలోకంలోకి ఎంట్రీ ఖాయమట
Also Read: శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించిన రోజు ఇదే... ఈ నెలంతా ప్రత్యేకమే
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి