అన్వేషించండి

CM Chandrababu Distributes Pension: యల్లమందలో పింఛన్ల పంపిణీ ప్రారంభించిన చంద్రబాబు - ఓ లబ్ధిదారుడికి రూ.5 లక్షలు ఇవ్వాలని ఆదేశం

AP CM Chandrababu Distributes pension at Narasaraopet | ఏపీలో జనవరి నెల పింఛన్ల పంపిణీ సీఎం చంద్రబాబు ప్రారంభించారు. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం యల్లమందలో లబ్దిదారులకు పింఛన్ పంపిణీ చేశారు.

Chandrababu Distributes Pensions in Narasaraopet | నరసరావుపేట: కూటమి ప్రభుత్వం ఒకరోజు ముందుగానే లబ్దిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇస్తోంది. ఇందులో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు మంగళవారం నాడు పల్నాడు జిల్లా నరసరావుపేటలో పర్యటిస్తున్నారు. ఉదయం 11.30కి ఉండవల్లిలోని నివాసం నుంచి బయలుదేరిన చంద్రబాబు 12 గంటలకు యల్లమందకు చేరుకున్నారు. మండలంలోని యల్లమంద గ్రామంలో లబ్దిదారు శారమ్మ ఇంటికి వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రూ.4 వేల పింఛన్ లబ్ధిదారుకు స్వయంగా సీఎం చంద్రబాబు అందజేశారు. బాగా చదువుకోవాలని శారమ్మ పిల్లలకు చంద్రబాబు సూచించారు. చురుకుగా ఉన్నావని, బాగా చదివితే మంచి స్థాయికి వస్తాయని ఆశీర్వదించారు.

ఏపీలో జనవరి నెల పింఛన్ల పంపిణీ మొదలైంది. ఏపీ సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. పింఛన్‌దారుల ఇంటికి వెళ్లి సీఎం చంద్రబాబు పింఛన్ పంపిణీ చేశారు. వారి కుటుంబంతో మాట్లాడి, సమస్యలు అడిగి తెలుసుకుని కూటమి ప్రభుత్వంలో అందరికీ న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.

రూ.5 లక్షలు అందించాలని సీఎం ఆదేశాలు

అనంతరం మరో పింఛన్ లబ్ధిదారుడు ఏడుకొండలు ఇంట్లో సీఎం చంద్రబాబు టీ పెట్టారు. తనకు టీ షాప్ పెట్టుకునేందుకు రూ.5 లక్షల లోన్ ఇవ్వాలని ఏడుకొండలు కోరారు. స్పందించిన సీఎం చంద్రబాబు బీసీ కార్పొరేషన్ ద్వారా రూ.5 లక్షలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇంటి నిర్మాణం పూర్తి చేసుకునేందుకు లోన్ ఇవ్వాలని అధికారును చంద్రబాబు ఆదేశించారు. గ్రామంలోని  కోదండరామస్వామి దేవాలయాన్ని చంద్రబాబు దర్శించుకున్నారు. అనంతరం హెలిప్యాడ్‌ ప్రాంతంలో సీఎం లంచ్ చేసి అనంతరం,  జిల్లా అధికారులతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.

కోటప్పకొండను దర్శించుకోనున్న సీఎం చంద్రబాబు

జిల్లా అధికారులు, పార్టీ నేతలతో సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు కోటప్పకొండకు చేరుకుంటారు. అక్కడ త్రికోటేశ్వరస్వామిని దర్శించుకుని, ఆలయంలో పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దర్శనం అనంతరం కోటప్పకొండ నుంచి యల్లమందలోని హెలిప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు. దాదాపు 3 నుంచి 4 గంటల మధ్య యల్లమంద నుంచి ఉండవల్లికి బయలుదేరతారని అధికారులు తెలిపారు. 

దేశంలోనే అత్యధిక పింఛన్ ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇంత ఎక్కువ పింఛన్లు ఇస్తున్న రాష్ట్రాన్ని దేశంలో చూపించగలరా? కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే వారికి ఇదే నా సవాల్. పేదవారి బాధలు చూసి ఎన్టీఆర్ పింఛన్లు తీసుకొచ్చారు. తెలంగాణలో పింఛన్లకు రూ.8,179 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తున్నారు. ఏపీకి దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. సూపర్ సిక్స్ ఏమైందని అడుగుతున్నారు. ఏపీలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది. - ఏపీ సీఎం చంద్రబాబు

12 గంటల వరకే 91 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి
నెలకు ముందు రోజే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కార్యక్రమం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని, మొదలుపెట్టిన రోజే మధ్యాహ్నం 12 గంటల వరకే పింఛన్ల పంపిణీ 91 శాతం పూర్తయ్యింది. జనవరి నెలకు సంబంధించి 63,77,943 మంది లబ్దిదారులకు పింఛన్ల పంపిణీ చేస్తున్నారు. సచివాలయ ఉద్యోగులు వేగంగా పింఛన్ల పంపిణీ చేస్తున్నారు. సాయంత్రానికల్లా పింఛన్ల పంపిణీ దాదాపు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

AP Assembly Session: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం, మండలిలో మెగా డీఎస్సీపై వైసీపీ ప్రశ్నలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం, మండలిలో మెగా డీఎస్సీపై వైసీపీ ప్రశ్నలు!
Breaking News: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం
TDP Janasena Social Media War: క్షేత్రస్థాయిలో పాలనలో సమన్వయం .. సోషల్ మీడియాలో సెల్ఫ్ గోల్ ! కూటమి సోషల్ వార్‌ను అరికట్టడం ఎలా?
క్షేత్రస్థాయిలో పాలనలో సమన్వయం .. సోషల్ మీడియాలో సెల్ఫ్ గోల్ ! కూటమి సోషల్ వార్‌ను అరికట్టడం ఎలా?
YSRCP MLA Disqualification Issue: అనర్హత వేటు వేసుకోండి .. వైసీపీ పొలిటికల్ ఆఫర్ వెనుక అసలు వ్యూహమేంటి? స్పీకర్ ఏం చేయబోతున్నారు?
అనర్హత వేటు వేసుకోండి .. వైసీపీ పొలిటికల్ ఆఫర్ వెనుక అసలు వ్యూహమేంటి? స్పీకర్ ఏం చేయబోతున్నారు?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Embed widget