అన్వేషించండి

Allu Arjun: సంధ్య థియేటర్ ఘటన... కిమ్స్ ఆస్పత్రిలో శ్రీతేజ్‌ను పరామర్శించాక మీడియాకు ముఖం చాటేసిన బన్నీ

Allu Arjun visits KIMS - Shri Tej: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మంగళవారం ఉదయం కిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో మరణించిన రేవతి కుమారుడు, ఆ ఘటనలో గాయపడిన శ్రీ తేజ్ ను పరామర్శించారు.

Allu Arjun visits Shri Tej: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ‌ రోజు (జనవరి 7, మంగళవారం) ఉదయం సికింద్రాబాద్ ఏరియాలోని కిమ్స్ ఆస్పత్రికి వెళ్లి వచ్చారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన రేవతి కుమారుడు, ఆ ఘటనలో గాయపడిన బాలుడు శ్రీ తేజ్ ను పరామర్శించారు. 

మీడియాతో మాట్లాడకుండా ఇంటికి!
సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఒకవేళ అల్లు అర్జున్ గనుక కిమ్స్ ఆసుపత్రికి వెళ్లే ఉద్దేశం ఉంటే తమకు ముందుగా సమాచారం అందించాలని సూచిస్తూ నోటీసులు ఇచ్చారు. పోలీసులకు సమాచారం ఇచ్చిన అల్లు అర్జున్... ఇవాళ ఉదయం 10 గంటల ప్రాంతంలో శ్రీ తేజ్ దగ్గరకు వెళ్లారు.

కిమ్స్ ఆసుపత్రికి అల్లు అర్జున్ వస్తున్నారనే సమాచారం బయటకు రావడంతో  అక్కడికి పెద్ద ఎత్తున మీడియా చేరుకుంది. అయితే... ఎటువంటి మీడియా మీట్ లేకుండానే అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. కేవలం రేవతి కుమారుడు, ఆమె కుటుంబ సభ్యుల పరామర్శకు మాత్రమే పరిమితం అయ్యారు.

భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు
కిమ్స్ ఆసుపత్రికి అల్లు అర్జున్ వస్తాడని తెలిసిన పోలీసులు మరొక‌ సారి సంధ్య‌‌ థియేటర్ తొక్కిసలాట ఘటన వంటివి జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.‌ మీడియాకు అటు అల్లు అర్జున్, ఇటు పోలీసులు సమాచారం ఇవ్వలేదు. అయితే విషయం బయటకు రావడంతో కొందరు అభిమానులు కూడా చేరుకున్నారు.

రేవతి కుటుంబానికి‌ బన్నీ కోటి రూపాయల సాయం... టోటల్ 2 కోట్లు
'పుష్ప ది రూల్' పెయిడ్ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గరకు అల్లు అర్జున్ వెళ్లడం, అభిమానులు పోటెత్తడంతో పోలీసుల లాఠీ చార్జ్ చేయడం,‌‌ ఆ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందడం వంటి విషయాలు తెలిసినవే. ఆ కేసులో మొత్తం 18 మందిని నిందితులుగా పోలీసులు చేర్చగా... అందులో అల్లు అర్జున్ ‌‌‌‌ఏ11‌. ఆయనను అరెస్టు‌ కావడంతో పాటు బెయిల్ మీద బన్నీ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. 

Also Readమాజీ సీఎంపై సెటైర్స్, ఆ హీరోకి ఇన్ డైరెక్ట్ కౌంటర్... 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్‌లో పవన్ కళ్యాణ్ చురకలు

సంధ్య‌ థియేటర్ ఘటన తమన ఎంతగానో కలచివేసిందని బన్నీతో పాటు పుష్ప ‌2 చిత్ర బృందం తమ ప్రాగాడ సంతాపాన్ని వ్యక్తం చేసింది.‌ రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ కోటి రూపాయల ఆర్థిక సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. చిత్ర దర్శకుడు సుకుమార్ 50 లక్షల రూపాయల, నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ మరొక 50 లక్షల రూపాయలు ఇచ్చారు. మొత్తం మీద రేవతి కుటుంబానికి రెండు కోట్ల రూపాయల సాయం అందుతోంది. 

Also Readవార్నీ... 'జబర్దస్త్' బ్యూటీ ఒరిజినల్ పేరు రీతూ చౌదరి కాదు - 700 కోట్ల లాండ్ స్కాంతో ఆ సీక్రెట్, అసలు పేరు వెలుగులోకి

టాప్ హెడ్ లైన్స్

Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Mahesh Babu : వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
Toxic Trailer : టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్
టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Embed widget