NTR Neel Movie: ఎన్టీఆర్ 'డ్రాగన్' కోసం రంగంలోకి మలయాళీ యాక్టర్స్... ప్రశాంత్ నీల్ ప్లాన్ మామూలుగా లేదుగా
Jr NTR - Prashanth Neel Movie: "డ్రాగన్" కోసం రంగంలోకి మలయాళ బెస్ట్ యాక్టర్స్ ను డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దింపబోతున్నారు అనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ ఇద్దరు మలయాళం స్టార్స్ ఎవరంటే?
'దేవర' హిట్ తర్వాత మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) చేయబోతున్న నెక్స్ట్ మూవీ గురించి ఆయన అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ 'వార్ 2' అనే హిందీ సినిమా షూటింగ్లో బిజీ అయ్యారు. త్వరలోనే ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి, ప్రశాంత్ నీల్ తో నెక్స్ట్ మూవీని షురూ చేయబోతున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ప్రశాంత్ నీల్ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. సంక్రాంతి తర్వాత ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతోందని తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించబోయే హీరోయిన్ల గురించి రూమర్లు చక్కర్లు కొడుతుండగా, తాజాగా ఈ సినిమా కోసం నీల్ బెస్ట్ మలయాళ స్టార్స్ ని రంగంలోకి దించుతున్నారని టాక్ నడుస్తోంది.
'డ్రాగన్' షూటింగ్ ఎప్పుడంటే?
ఎన్టీఆర్ హీరోగా, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న ప్రాజెక్ట్ టైటిల్ ని ఇంకా అనౌన్స్ చేయలేదు. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ ని 'ఎన్టీఆర్ నీల్' అనే వర్కింగ్ టైటిల్ తో పిలుచుకుంటున్నారు. ఈ సినిమాను మైత్రి మూవీస్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీకి 'డ్రాగన్' అనే టైటిల్ ను మేకర్స్ పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. 2026 సంక్రాంతికి ఈ మూవీని బరిలోకి దించే యోచనలో ఉన్నారు మేకర్స్. అంతలోగా ఎన్టీఆర్ నుంచి 'వార్ 2' మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ 'వార్ 2' మూవీకి సంబంధించిన షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో ,ప్రస్తుతం ఎన్టీఆర్ అభిమానుల దృష్టి 'డ్రాగన్' పై పడింది. తాజా సమాచారం ప్రకారం జనవరి 16 న 'డ్రాగన్' షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్లుగా రష్మిక మందన్నతో పాటు 'సప్త సాగరాలు దాటి' ఫేమ్ రుక్మిణి వసంత్ ను తీసుకున్నారని టాక్ నడుస్తోంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మలయాళ బెస్ట్ యాక్టర్స్ బీజు మీనన్, టోవినో థామస్ లు కీలక పాత్రలు పోషించబోతున్నారు అనే క్రేజీ టాక్ మొదలైంది.
టోవినో థామస్ టాలీవుడ్ ఎంట్రీ
ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం ప్రకారం టోవినో థామస్ 'డ్రాగన్' ప్రాజెక్టులో భాగమైతే ఆయనకు తెలుగులో ఇదే ఫస్ట్ మూవీ అవుతుంది. 2024లో టోవినో థామస్ నటించిన 'దృశ్య జలకంగళ్', 'నడికర్' సినిమాలను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. ఇక ఇప్పుడు ఈ మాలీవుడ్ స్టార్ హీరోని ఎన్టీఆర్ సినిమాలోకి తీసుకోబోతున్నారని టాక్ నడుస్తోంది. ఆ మూవీని కూడా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండడం విశేషం. రీసెంట్ గా 'ఐడెంటిటీ' మూవీతో థియేటర్లోకి వచ్చిన ఈ హీరో గత ఏడాది డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ని కూడా కలిశారు. అంతే కాదు తనకు టాలీవుడ్ నుంచి అవకాశాలు వస్తున్నాయని హింట్ కూడా ఇచ్చారు.
బిజూ మీనన్ రీఎంట్రీ...
ఇక 'డ్రాగన్' సినిమాలో పార్ట్ కాబోతున్నారంటూ వినిపిస్తున్న మరో మలయాళ స్టార్ బీజూ మీనన్. ఆయన ఇప్పటికే టాలీవుడ్లో 'ఖతర్నాక్' అనే సినిమాలో నటించారు. ఇక ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్ సినిమాతో టాలీవుడ్ లో రీఎంట్రీ ఇవ్వబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. 'అయ్యప్పనుమ్ కోషియుమ్' సినిమా తర్వాత తనకు ఇతర పరిశ్రమల నుంచి కూడా ఆఫర్స్ వస్తున్నాయని గత ఏడాది బిజూ వెల్లడించారు. ఈ వార్తలు గనక నిజమైతే 'డ్రాగన్' మూవీ స్టార్ట్ కావడానికంటే ముందే అంచనాలు ఆకాశాన్ని తాకడం ఖాయం. అలాగే బడ్జెట్ కూడా హైరేంజ్ లో ఉండబోతోంది.
Read Also : Allu Arjun News: పోలీసులు నోటీసులిచ్చినా తగ్గేదేలే- నేడు కిమ్స్ ఆస్పత్రికి అల్లు అర్జున్!