అన్వేషించండి

CapitaLand Investment: హైదరాబాద్​లో మరో ఐటీ పార్క్​.. రూ.450 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన క్యాపిటల్యాండ్​

Hyderabad IT park | హైదరాబాద్​లో మరో ఐటీ పార్క్​ ఏర్పాటు కోసం రూ.450 కోట్ల పెట్టుడబడులకు సింగపూర్​ సంస్థ ముందుకొచ్చింది.

IT park in Hyderabad: హైదరాబాద్​లో మరో ఐటీ పార్క్​ ఏర్పాటు చేసేందుకు మరో అంతర్జాతీయ సంస్థ ముందుకొచ్చింది. నగరంలో లక్ష చదరపు అడుగుల మేర భారీ ఐటీ పార్కు నిర్మించేందుకు సింగపూర్‌కు చెందిన క్యాపిటల్యాండ్​ సంస్థతో తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఐటీ పార్కు కోసం ఆ సంస్థ రూ.450 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. 

సీఎం సారథ్యంలో..
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఐటీ మినిస్టర్​ శ్రీధర్ బాబు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, డా.ఈ.విష్ణువర్ధన్ రెడ్డి, పెట్టుబడుల ప్రోత్సాహక ప్రత్యేక కార్యదర్శి, బి.అజిత్ రెడ్డి, సీఎంవో ప్రత్యేక కార్యదర్శి గౌరీ శంకర్‌ నాగభూషణం సహా సీనియర్ క్యాపిటల్యాండ్ అధికారులతో కూడిన తెలంగాణ రైజింగ్‌ ప్రతినిధి బృందం ప్రస్తుతం సింగపూర్‌ పర్యటన ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం క్యాపిటల్యాండ్‌ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ చర్చల్లో భాగంగా హైదరాబాద్‌లో రూ.450 కోట్ల పెట్టుబడికి క్యాపిటల్యాండ్​ సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు ఆ సంస్థతో సీఎం బృందం ఎంవోయూ కుదుర్చుకుంది.

మరింత బలోపేతం
బిజినెస్​ హబ్​గా హైదరాబాద్​ను మరింత బలోపేతం చేసేందుకు ఈ ఒప్పందం తోడ్పాటునందించనుంది. ప్రీమియం సౌకర్యాలను కోరుకునే గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ (జీసీసీలు), బ్లూ-చిప్ కంపెనీల నుంచి పెరుగుతున్న డిమాండ్​కు అనుగుణంగా ఇది పనిచేయనుంది. 

హైదరాబాద్​లో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు అందిస్తాం..
ఈ ఎంఓయూ సందర్భంగా సీఎంవో ప్రత్యేక కార్యదర్శి గౌరీ శంకర్‌ నాగభూషణం మాట్లాడుతూ.. ‘తెలంగాణ ప్రభుత్వ విజన్​కు తోడు​, రేవంత్ రెడ్డి డైనమిక్ నాయకత్వంలో వ్యాపార రంగంలో హైదరాబాద్ స్థిరంగా దూసుకెళుతోంది. హైదరాబాద్‌లో వ్యాపారాన్ని విస్తరించేందుకు సంతోషిస్తున్నాం. హైదరాబాద్​లో స్థిరమైన, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అందించేందుకు ప్రయత్నిస్తాం. దీంతో సాంకేతిక హబ్‌గా హైదరాబాద్ మరింత బలోపేతం కానుంది’ అని అన్నారు.

రూ.3,500 కోట్ల పెట్టుబడులు
సీఎం రేవంత్​ రెడ్డి సారథ్యంలో సింగపూర్​లో తెలంగాణ రైజింగ్‌ ప్రతినిధి బృందం పర్యటన విజయవంతంగా సాగుతోంది. తెలంగాణలో రూ.3,500 కోట్ల పెట్టుబడులకు శనివారం ఎస్టీ టెలీమీడియా గ్లోబల్‌ డేటా సెంటర్‌ ముందుకు వచ్చింది. రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల సమీపంలోని మీర్‌ఖాన్‌పేటలో అత్యాధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్‌ క్యాంపస్‌ను స్థాపించేందుకు ఈ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుంది. 100 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్​ ఏర్పాటు చేయనున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: విద్యాశాఖను ఎవ్వరికీ ఇయ్య.. నా దగ్గరే పెట్టుకుంటా.. హైదరాబాద్‌కు ఒలంపిక్స్ -రేవంత్ రెడ్డి
విద్యాశాఖను ఎవ్వరికీ ఇయ్య.. నా దగ్గరే పెట్టుకుంటా.. హైదరాబాద్‌కు ఒలంపిక్స్ -రేవంత్ రెడ్డి
Telangana Assembly: ఎంపీ స్థానాల పెంపు వాయిదా వేసి మా అసెంబ్లీ సీట్లు పెంచండి- తీర్మానం చేసిన తెలంగాణ
ఎంపీ స్థానాల పెంపు వాయిదా వేసి మా అసెంబ్లీ సీట్లు పెంచండి- తీర్మానం చేసిన తెలంగాణ
Kishan Reddy Letter : హెచ్‌సీయూ వద్ద భూములు వేలం వేయొద్దు- తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ 
హెచ్‌సీయూ వద్ద భూములు వేలం వేయొద్దు- తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ 
Empuraan Review - ఎల్2 ఎంపురాన్ రివ్యూ: మోహన్ లాల్ మూవీ హిట్టా? ఫట్టా? రిలీజ్‌కు ముందు వచ్చిన హైప్‌కు తగ్గట్టు ఉందా? లేదా?
ఎల్2 ఎంపురాన్ రివ్యూ: మోహన్ లాల్ మూవీ హిట్టా? ఫట్టా? రిలీజ్‌కు ముందు వచ్చిన హైప్‌కు తగ్గట్టు ఉందా? లేదా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

SRH vs LSG Match Preview IPL 2025 | నేడు సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ | ABPKL Rahul Joins Delhi Capitals | నైట్ పార్టీలో నానా హంగామా చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ | ABP DesamRC 16 Ram Charan Peddi First Look | రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా RC16 టైటిల్, ఫస్ట్ లుక్ | ABP DesamRiyan Parag Fan touches Feet | రియాన్ పరాగ్ కాళ్లు మొక్కిన అభిమాని | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: విద్యాశాఖను ఎవ్వరికీ ఇయ్య.. నా దగ్గరే పెట్టుకుంటా.. హైదరాబాద్‌కు ఒలంపిక్స్ -రేవంత్ రెడ్డి
విద్యాశాఖను ఎవ్వరికీ ఇయ్య.. నా దగ్గరే పెట్టుకుంటా.. హైదరాబాద్‌కు ఒలంపిక్స్ -రేవంత్ రెడ్డి
Telangana Assembly: ఎంపీ స్థానాల పెంపు వాయిదా వేసి మా అసెంబ్లీ సీట్లు పెంచండి- తీర్మానం చేసిన తెలంగాణ
ఎంపీ స్థానాల పెంపు వాయిదా వేసి మా అసెంబ్లీ సీట్లు పెంచండి- తీర్మానం చేసిన తెలంగాణ
Kishan Reddy Letter : హెచ్‌సీయూ వద్ద భూములు వేలం వేయొద్దు- తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ 
హెచ్‌సీయూ వద్ద భూములు వేలం వేయొద్దు- తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ 
Empuraan Review - ఎల్2 ఎంపురాన్ రివ్యూ: మోహన్ లాల్ మూవీ హిట్టా? ఫట్టా? రిలీజ్‌కు ముందు వచ్చిన హైప్‌కు తగ్గట్టు ఉందా? లేదా?
ఎల్2 ఎంపురాన్ రివ్యూ: మోహన్ లాల్ మూవీ హిట్టా? ఫట్టా? రిలీజ్‌కు ముందు వచ్చిన హైప్‌కు తగ్గట్టు ఉందా? లేదా?
Andhra Pradesh Latest News:ఏపీలో లోకల్ రాజకీయ రచ్చ - పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు
ఏపీలో లోకల్ రాజకీయ రచ్చ - పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు
Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్‌లో నాలా రద్దు, అధికారులు విజ్ఞాన ప్రదర్శన చేయొద్దు: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో నాలా రద్దు, అధికారులు విజ్ఞాన ప్రదర్శన చేయొద్దు: సీఎం చంద్రబాబు
RC16: రామ్‌చరణ్ బర్త్ డే గిఫ్ట్ వచ్చేసింది - 'పెద్ది'గా గ్లోబల్ స్టార్, మాస్ లుక్ అదిరిపోయిందిగా..
రామ్‌చరణ్ బర్త్ డే గిఫ్ట్ వచ్చేసింది - 'పెద్ది'గా గ్లోబల్ స్టార్, మాస్ లుక్ అదిరిపోయిందిగా..
AP Inter Results 2025: పేరెంట్స్ వాట్సాప్‌కే ఏపీ ఇంటర్‌ ఫలితాలు! విడుదల ఎప్పుడు అంటే?
పేరెంట్స్ వాట్సాప్‌కే ఏపీ ఇంటర్‌ ఫలితాలు! విడుదల ఎప్పుడు అంటే?
Embed widget