SVSN Varma: 'నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలి' - మీడియా ఛానళ్లు వక్రభాష్యం చేయడం సరికాదన్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ
Nara Lokesh: మంత్రి నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనే డిమాండ్‌కు ఆ పార్టీ సీనియర్ నేతల నుంచి మద్దతు పెరుగుతోంది. తాజాగా, ఎమ్మెల్యే సోమిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వర్మ సైతం మద్దతు తెలిపారు.

SVSN Varma Comments On Nara Lokesh Deputy CM Cadre: మంత్రి నారా లోకేశ్‌కు (Nara Lokesh) డిప్యూటీ సీఎం హోదా కల్పించాలన్న డిమాండ్ టీడీపీ క్యాడర్ నుంచి బలంగా వినిపిస్తోంది. ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ జిల్లా మైదుకూరులో ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు (CM Chandrababu) సమక్షంలోనే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి కోరారు. రాష్ట్రాభివృద్ధి కోసం లోకేశ్ చేస్తోన్న కృషిని గుర్తించాలని కోరారు. ఈ వ్యాఖ్యలు అంతటా హాట్ టాపిక్‌గా మారాయి. లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే ఇంకా పార్టీ పరంగా అభివృద్ధి పరంగా ఇంకా మంచి పాలన సాగుతుందనే వాదనలు ఆ పార్టీ క్యాడర్‌లో వినిపిస్తోంది. శ్రీనివాస్ రెడ్డి ప్రతిపాదనను ఏపీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు సమర్థించగా.. మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సైతం మద్దతు తెలిపారు. తాజాగా, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ సైతం ఈ డిమాండ్‌కు మద్దతు పలికారు.
'లోకేశ్ డిప్యూటీ సీఎం అంటే తప్పేంటి..?'
టీడీపీ సభ్యత్వాలు కోటి చేయించిన ఘనత మంత్రి నారా లోకేశ్‌కే (Nara Lokesh) దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ (SVSN Varma) అన్నారు. టీడీపీ భవిష్యత్తు లేదన్న వారందరికీ 'యువగళం'తోనే సమాధానం చెప్పారన్నారు. నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని కోరారు. 'ఎవరి పార్టీల కార్యకర్తల మనోభావాలు వారికి ఉంటాయి. నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలి. దీనిపై కొన్ని సోషల్ మీడియా, మీడియా ఛానళ్లు వక్రభాష్యం చేయడం సరికాదు. లోకేశ్ కష్టాన్ని గుర్తించాలని క్యాడర్ కోరుకోవడంలో తప్పేముంది.?. ఓడిపోయి భవిష్యత్ ఏంటో కూడా తెలియని జగన్నే సీఎం సీఎం అని పిలుస్తున్నారు. అలాంటిది పార్టీని బలోపేతం చేసి కార్యకర్తల్లో అంతులేని ధైర్యాన్ని నింపిన లోకేశ్‌ను డిప్యూటీ సీఎం అంటే తప్పేంటి.?. కరడుగట్టిన టీడీపీ కార్యకర్తగా ఆయన డిప్యూటీ సీఎం కావాలని కోరుకుంటున్నా. ఇది నా ఒక్కడి అభిప్రాయం కాదు. అందరి కార్యకర్తల మనసులోని మాట. చివరకి పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు తీసుకునే నిర్ణయమే కార్యకర్తలందరికీ శిరోధార్యం.' అని వర్మ పేర్కొన్నారు.
'లోకేశ్ వంద శాతం అర్హులు'
అటు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సైతం లోకేశ్‌ను డిప్యూటీ సీఎంను చేయాలనే డిమాండ్‌ను ట్విట్టర్ వేదికగా వినిపించారు. 'ఉప ముఖ్యమంత్రి పదవికి లోకేశ్ వంద శాతం అర్హులు. రాజకీయంగా లోకేశ్ ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. యువగళం పాదయాత్రతో నాయకత్వ పటిమను నిరూపించుకున్నారు. ఆయన పోరాట పటిమను చూసి టీడీపీ కేడర్‌తో పాటు ఏపీ ప్రజానీకం కూడా ఆయన నాయకత్వానికి జై కొట్టింది. అన్ని అర్హతలు ఉన్నా లోకేశ్ పేరును డిప్యూటీ సీఎం పదవికి పరిశీలించాలి.' అంటూ టీడీపీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

