రైతు బంధుపై ఎవరిదీ రాజకీయం?
రైతు బంధు విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాటతప్పిందని ప్రశ్నిస్తే మాపై కక్ష సాధిస్తున్నారని కేటిఆర్ అనేక సందర్బాల్లో కేటీఆర్ విమర్శిస్తున్నారు.రుణమాఫీ విషయంలోనూ కాంగ్రెస్ ను పదేపదే వెలెత్తి చూపుతున్నారు బిఆర్ ఎస్ నేతలు. గ్రామాల్లో వాస్తవ పరిస్దితులేంటి. రేవంత్ వచ్చాక జరిగిన మేలుపై రైతులను అడిగింది ఏబిపి దేశం. ర్యాండమ్ గా కొందరు రైతులు చెప్పిన అభిప్రాయాల సమాహారమే ఈ పబ్లిక్ టాక్.
తెలంగాణను మారుస్తానని చెప్పినా, ఒక్క మార్పు కూడా చేయలేదు. ఆరు గ్యారెంటీల్లో ఒక్కటీ అమలు కాలేదు. ఇరవై నాలుగు గంటల కరెంట్ అందిస్తామని చెప్పి, ఇప్పుడు పొద్దున్నే పోయిన కరెంట్ ఇప్పటివరకు రాలేదు. రైతులకు ఇవ్వాలని చెప్పిన 12 వేల రూపాయలు కూడా ఇప్పటివరకు అందజేయలేదు," . మార్పు చేస్తామని హామీ ఇచ్చినా, ఎలాంటి మార్పు కనిపించలేదు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి BRS పట్ల కక్ష సాధింపే తప్ప, రైతుల సమస్యలపై చర్యలు తీసుకోలేదు," అని రైతులు అభిప్రాయపడ్డారు. రేవంత్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తున్నా, ఎలాంటి గ్యారెంటీ అమలులోకి రాలేదు. ప్రస్తుత పరిస్థితులను చూస్తే, మనం గత పదేళ్లు వెనక్కి వెళ్లినట్లు అనిపిస్తోంది. ఈ ప్రభుత్వంలో ఎలాంటి మార్పు లేదు," అని వారు ఆవేదన వ్యక్తం చేశారు.





















