Pani OTT Release Date: ఐఎండీబీలో 6.8 రేటింగ్ ఉన్న రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్... మలయాళ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్... ఎందులో చూడొచ్చంటే?
Pani OTT Platform: పాపులర్ మలయాళ నటుడు జోజు జార్జ్ హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ 'పాని' మూవీ థియేటర్లలోకి వచ్చిన రెండు నెలల తరువాత ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది.
ప్రముఖ మలయాళ నటుడు జోజు జార్జ్ ప్రధాన పాత్రను పోషించిన మలయాళ యాక్షన్ ఎంటర్టైనర్ డిజిటల్ స్ట్రీమింగ్ సిద్ధమైంది. 'పాని' అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ ఓ కొత్త పోస్టర్‌ను వదిలారు.
సోనీ లివ్ ఓటీటీలోకి 'పాని'...
మలయాళ సినిమాల మాయలో ఓటీటీ మూవీ లవర్స్ ఎంతలా పడిపోయారో అందరికీ తెలిసిందే. అందులోనూ యాక్షన్ థ్రిల్లర్ అంటే ఆ కిక్కే వేరు కదూ... ప్రముఖ మలయాళ నటుడు జోజు జార్జ్ లీడ్ రోల్ పోషించిన మలయాళ యాక్షన్ ఎంటర్టైనర్ 'పాని'. ఈ సినిమాకు హీరోగా నటించిన జోజు జార్జ్ స్వయంగా మెగా ఫోన్ పట్టడం విశేషం. ఆయనతో పాటు ఈ మూవీలో జునైట్ విపి, బాబి కురియన్, సాగర్ సూర్య, అభయ హిరణ్మయి, అభినయ తదితరులు కీలకపాత్రలు పోషించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. 'పాని'ని ప్రొడక్షన్ బ్యానర్స్, ఏడీ స్టూడియోస్, అప్పు పత్తు పప్పు ప్రొడక్షన్స్ బ్యానర్లపై రియాజ్ ఆడమ్, సిజో వడక్కన్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో బోజు జార్జ్ పాత్ర పేరు గిరి. గత ఏడాది అక్టోబర్ 24న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది.
ఈ నేపథ్యంలోనే 'పాని' మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు సంబంధించిన అప్డేట్ ను తాజాగా అనౌన్స్ చేశారు. "గ్రిప్పింగ్ రివేంజ్ డ్రామా.... జోజు జార్జ్ తొలిసారిగా మెగా ఫోన్ పట్టిన మూవీ 'పాని'. ఈ సినిమా జనవరి 16 నుంచి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది" అనే క్యాప్షన్ తో కొత్త పోస్టర్ ద్వారా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేశారు. ఇక 'పాని' మూవీ మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో కూడా ఒకేసారి ఓటీటీలోకి రాబోతోంది.
View this post on Instagram
రెండు నెలలు ఆలస్యంగా...
'పాని' సినిమా మొత్తం కేరళలోని త్రిసూర్ నగరంలో ఉన్న ఒక పవర్ ఫుల్ డాన్ గిరి చుట్టూ తిరుగుతుంది. గిరి తన భార్య గౌరీ, కొంతమంది సన్నిహితులతో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతాడు. కాంట్రాక్ట్ హత్యల ద్వారా త్రిసూర్ నగరంలో ఒక మంచి డాన్ గా పేరు తెచ్చుకోవాలని కలలుగానే రౌడీలు డాన్, సిజూ అనే ఇద్దరు యంగ్ మెకానిక్ ల వల్ల భార్యాభర్తలైన గిరి, గౌరీల జీవితాల్లో కీలకమైన మలుపు చోటు చేసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది స్టోరీ. త్రిసూర్ లో ఉన్న రెండు గ్యాంగ్ ల మధ్య జరిగే వార్ ఓ జంట జీవితాన్ని ఎలా మార్చింది ? అనేది తెరపై చూడాల్సిందే. ఇక ఈ మూవీతో ఫస్ట్ టైం దర్శకుడిగా మారిన నటుడు జోజు జార్జ్... ఫస్ట్ మూవీ తోనే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిపించుకున్నారు. నిజానికి ఈ సినిమా గత డిసెంబర్లోనే డిజిటల్ ప్రీమియర్ అవుతుందని టాక్ నడిచింది. కానీ ఈ సినిమా చివరకు సోనీ లివ్ లో జనవరి 16న రిలీజ్ కాబోతోంది.