Break Out OTT Release: బ్రహ్మి తనయుడి సర్వైవల్ థ్రిల్లర్‌కు రెండేళ్ల తరువాత మోక్షం... ఓటీటీలో 'బ్రేక్ అవుట్', స్ట్రీమింగ్ ఎప్పుడో తెల్సా?
ETV Win Break Out Release Date: ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రలో నటించిన సర్వైవల్ థ్రిల్లర్ 'బ్రేక్ అవుట్'. ఈటీవీ విన్ యాప్ లో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
'మంజుమ్మెల్ బాయ్స్' సినిమా తరువాత సర్వైవల్ థ్రిల్లర్ సినిమాలకి ఓటీటీలో ఎంతటి ఆదరణ పెరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ తరహా మిస్టరీ అండ్ సర్వైవల్ మూవీతో హాస్యబ్రహ్మ బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ వస్తున్నాడు. ఆయన నటించిన 'బ్రేక్ అవుట్' అనే మూవీ డిజిటల్ ఎంట్రీకి సిద్ధమైంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.
రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి...
రాజా గౌతమ్ లీడ్ రోల్ పోషిస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల్లర్ 'బ్రేక్ అవుట్. ఈ వారం ఈటీవీ విన్ అనే తెలుగు ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. జనవరి 9 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయబోతున్నామంటూ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఈటీవీ విన్ వెల్లడించింది. నిజానికి ఈ సినిమా రిలీజ్ అయ్యి దాదాపు రెండేళ్లు అవుతోంది. మార్చి 10, 2023న 'బ్రేక్ అవుట్' మూవీ థియేటర్లలోకి వచ్చింది. కానీ ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కి మాత్రం చాలా కాలం వెయిట్ చేయాల్సి వచ్చింది. ఎట్టకేలకు ఈటీవీ విన్ "సిద్ధంగా ఉండండి" అంటూ 'బ్రేక్ అవుట్'కు సంబంధించిన గుడ్ న్యూస్ చెప్పింది. "సర్వేవల్ అండ్ కరేజ్ ఎక్సైటింగ్ స్టోరీని చూడడానికి రెడీగా ఉండండి... బ్రేక్ అవుట్ మూవీ జనవరి 9 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది" అనే క్యాప్షన్ తో ఈ అప్డేట్ ని పోస్ట్ చేశారు.
Also Read: ఆకలి తీర్చమన్న రోహిణి... హడలిపోయిన డాక్టర్ బాబు - సంక్రాంతి ఎపిసోడ్‌లో దీపక్క సందడి
View this post on Instagram
సంక్రాంతి సినిమాల లిస్టులో...
అయితే ఈటీవీ విన్ 2025 న్యూ ఇయర్స్ సందర్భంగా సంక్రాంతికి తమ ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాల లిస్ట్ ను ముందుగానే రిలీజ్ చేసింది. అందులో ఈ 'బ్రేక్ అవుట్' మూవీ కూడా ఉంది. ఈ మూవీతో కలిపి మొత్తం నాలుగు సినిమాలు జనవరిలో రిలీజ్ కాబోతున్నాయని ఈటీవీ విన్ ప్రకటించింది. కాకపోతే రిలీజ్ డేట్లు మాత్రం సస్పెన్స్ లో ఉంచింది. తాజాగా 'బ్రేక్ అవుట్' సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసింది. మరి మిగతా మూడు సినిమాల రిలీజ్ డేట్లు ఎప్పుడు అనౌన్స్ చేస్తుందో చూడాలి.
'బ్రేక్ అవుట్' కథ ఏంటంటే?
'బ్రేక్ అవుట్' సినిమాలో గౌతమ్ రాజా హీరోగా నటించగా, కిరీటి దామరాజు, రమణా రాఘవ్, ఆనంద చక్రపాణి లాంటి నటులు కీలకపాత్రలు పోషించారు. సుధాకర్ చెరుకూరి దర్శకత్వం వహించగా, ఈ మూవీని అనిల్ మోదుగా నిర్మించారు. ఈ సినిమాకు ఐఎమ్డిబిలో 6.8 రేటింగ్ వచ్చింది. థియేటర్లలో మాత్రం 'బ్రేక్ అవుట్' పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. స్టోరీ విషయానికి వస్తే... డైరెక్టర్ కావాలని కలలుకనే ఓ యువకుడి చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. అతనికి మోనోఫోబియా అనే వ్యాధి ఉంటుంది. ఇలాంటి వ్యక్తి ఓ గ్యారేజీలో ఒంటరిగా చిక్కుకోవడంతో కథ మలుపు తిరుగుతుంది. అసలే ఒంటరిగా ఉండాలంటే భయపడే హీరో ఈ పరిస్థితిలో ఏం చేశాడు? ఆ గ్యారేజీ నుంచి ఎలా తప్పించుకున్నాడు? తర్వాత ఏం జరిగింది ? అన్నది తెరపై చూడాల్సిందే.
Read also: ఓటీటీలోకి 'కిచ్చా' సుదీప్ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ 'మ్యాక్స్'... ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?