CM Chandrababu: దావోస్ పర్యటనకు ఏపీ సీఎం చంద్రబాబు - 'బ్రాండ్ ఏపీ ప్రమోషన్' పేరుతో 5 రోజుల పర్యటన
Andhra News: రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనకు బయల్దేరారు. 'బ్రాండ్ ఏపీ ప్రమోషన్' పేరుతో సీఎం బృందం 5 రోజుల పాటు పర్యటించనుంది.

AP CM Chandrababu Davos Tour: ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) దావోస్ పర్యటనకు బయలుదేరారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా ఆయన పర్యటన సాగనుంది. సీఎం బృందం అమరావతి నుంచి ఢిల్లీ మీదుగా దావోస్ (Davos) పర్యటనకు బయల్దేరనుంది. సీఎం ఉండవల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు వెళ్లారు. అక్కడి నుంచి దావోస్ వెళ్లే అధికారుల బృందంతో కలిసి ఢిల్లీ చేరుకుంటారు. ఢిల్లీ నుంచి అర్ధరాత్రి 1.30 గంటలకు జ్యూరిచ్‌కు వెళ్లనున్నారు. సోమవారం ఉదయం జ్యూరిచ్‌లో పలు సమావేశాల్లో చంద్రబాబు పాల్గొననున్నారు. జ్యూరిచ్‌లో పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు. తరువాత హయత్ హోటల్‌లో తెలుగు పారిశ్రామిక వేత్తలతో జరిగే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు.
అనంతరం రోడ్డు మార్గంలో జ్యూరిచ్ నుంచి దావోస్‌లో జరిగే WEF (వరల్డ్ ఎకనామిక్ ఫోరం) సదస్సులో పాల్గొంటారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు 'బ్రాండ్ ఏపీ ప్రమోషన్'తో రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా సీఎం చంద్రబాబు బృందం 5 రోజుల పాటు పర్యటించనుంది. ఈ సందర్భంగా దావోస్ పర్యటనకు బయల్దేరే ముందు సీఎంకు.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్, సీఎంవో అధికారులు విషెస్ చెప్పారు. దావోస్ పర్యటన ఫలవంతం అవ్వాలని, రాష్ట్రానికి పెట్టుబడులు రావాలని వారు ఆకాంక్షించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

