అన్వేషించండి

Shami Injury Handling: షమీని సరిగా వాడుకోలేదు.. బీజీటీలో తను ఉంటే లెక్క వేరే ఉండేది.. బీసీసీఐపై మాజీ కోచ్ ఫైర్

తాజా ఆస్ట్రేలియా పర్యనలో ఓడిపోవడంతో పదేళ్ల తర్వాత బీజీటీని భారత్ కోల్పోయింది. అలాగే ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ కు ముచ్చటగా మూడోసారి చేరుకోవాలన్న కల ఛిద్రమైపోయింది. 

Shami Vs Bumrah: ప్లేయర్ల ఫిట్ నెస్ పై బీసీసీఐ వ్యవహార ధోరణిని మాజీ కోచ్ రవి శాస్త్రి కడిగిపారేశాడు. ముఖ్యంగా స్టార్ పేసర్ మహ్మద్ షమీ.. గాయం కారణంగా సుదీర్ఘంగా క్రికెట్ కు దూరంగా ఉండటం ఏంటని ప్రశ్నించాడు. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఇన్నాళ్లుగా షమీతో ఏం చేస్తున్నారని అడిగాడు. నిజానికి బోర్డర్- గావస్కర్ ట్రోఫీ (బీజీటీ)లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు తోడుగా షమీ ఉంటే కథ వేరేగా ఉండేదని చాలామంది అభిప్రాయ పడ్డారు. సిరీస్ సగం ముగిసిన తర్వాత షమీని పిలిపించాలని కూడా డిమాండ్లు వెల్లువెత్తాయి. అయితే బీసీసీఐ ధోరణితో ఆటగాళ్ల పునరావాసంపై ప్రశ్నలు రేకెత్తుతున్నాయని శాస్త్రి విమర్శించాడు. ఆటగాళ్ల గాయాల అప్డేట్ పై ఇంత గోప్యం ఎందుకని, ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వాలని సూచించాడు. 

షమీని ఆసీస్ టూర్ కు తీసుకొస్తే బాగుండేది.. 
నిజానికి 2023 ప్రపంచ కప్ వన్డే ఫైనల్ తర్వాత చీలమండ గాయంతో షమీ జట్టుకు దూరమయ్యాడు. ఆ తర్వాత ఏడాది తనకు శస్త్ర చికిత్స కూడా జరిగింది. అప్పటి నుంచి షమీ కోలుకుంటూనే ఉన్నాడు. జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్నాడు. అయితే రిహాబిలిటేషన్ ను జట్టుతో పాటే కొనసాగించి ఉంటే బాగుండేదని శాస్త్రి అభిప్రాయ పడ్డాడు. అతడిని టీమిండియాతో పాటు ఆసీస్ టూర్ కు తీసుకొచ్చి, ఎప్పటికప్పుడు మోనిటర్ చేస్తే మంచి ఫలితాలు ఉండేవని వ్యాఖ్యానించాడు. అంతర్జాతీయ ఫిజియోలతో కలిసి ఈ విషయంలో ఇంకాస్త మెరుగ్గా వర్కౌట్ చేసి ఉంటే బాగుండేదని పేర్కొన్నాడు. షమీ లేని లోటు బీజీటీలో స్పష్టంగా కనిపించిందని వ్యాఖ్యానించాడు. బుమ్రాకు తోడుగా అతనుంటే ఫలితాలు వేరేగా వచ్చేవని పేర్కొన్నాడు. ఇక షమీ లేని లోటుతో బౌలింగ్ భారం బుమ్రా, సిరాజ్ లపైనే పడింది. ఇద్దరు సిరీస్ లో  చెరో 150కిపైగా ఓవర్లు బౌలింగ్ చేశారు. 

పేస్ ఆల్ రౌండర్ ఉన్నాడుగా..
ఇక ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అయితే ఒక అడుగు ముందుకేసి నాలుగో టెస్టు నుంచి షమీని ఆడిస్తే బాగుండేదని వ్యాఖ్యానించాడు. అప్పటికే జట్టులో బుమ్రా, సిరాజ్ ఉన్నారని వారికి తోడుగా షమీ ఆడేవాడని, రోజుకు కొన్ని ఓవర్లు చొప్పున అతడితో బౌలింగ్ వేస్తే బాగుండేదని, నితీశ్ రెడ్డి రూపంలో బ్యాకప్ పేసర్ కూడా అందుబాటులో ఉన్నాడని గుర్తు చేశాడు. ఈ సిరీస్ లో సిరాజ్ ఎంతో కష్టపడినప్పటికీ, అతనికి లక్కు కలిసి రాలేదని పేర్కొన్నాడు. అదే షమీ కూడా తోడుంటే టీమిండియాకు చాలా హెల్ప్ అయ్యుండేదని, బుమ్రా కూడా మధ్యలో గాయాల బారిన పడకుండా షమీ సలహాలు ఇచ్చేవాడని వ్యాఖ్యానించాడు. ఏదేమైనా టీమ్ మేనేజ్మెంట్ తప్పుడు ప్రణాళికలకు మూల్యం చెల్లించుకుంది. ఐదు టెస్టుల సిరీస్ ను 1-3తో చేజార్చుకుంది. దీంతో ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది. 

Also Read: India Revenge Plan Against NZ, Aus: ఆసీస్, కివీస్ లకు ధమ్కీ ఇచ్చేందుకు రెడీ- డబ్ల్యూటీసీ షెడ్యూల్లో 2 జట్లతో ఆడనున్న టీమిండియా 

టాప్ హెడ్ లైన్స్

Harbhajan - Sreesanth Drama: శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
Gambhir Coach Tenure: గంభీర్ హెడ్ కోచ్ పదవికి బిగ్ ప్రొటెక్షన్.. సాకింగ్ రూమర్స్ పై బిసిసిఐ క్లారిటీ!
గంభీర్ హెడ్ కోచ్ పదవికి బిగ్ ప్రొటెక్షన్.. సాకింగ్ రూమర్స్ పై బిసిసిఐ క్లారిటీ!
Rohit Sharma's Future Twist: రోహిత్ , 2027 వరల్డ్ కప్ ఫ్యూచర్ పై మాజీ క్రికెట‌ర్ మైండ్ బ్లాకింగ్ అనాల‌సిస్.. హిట్‌మ్యాన్ ఏజ్, ఎనర్జీపై వ్యాఖ్య‌లు!
రోహిత్ , 2027 వరల్డ్ కప్ ఫ్యూచర్ పై మాజీ క్రికెట‌ర్ మైండ్ బ్లాకింగ్ అనాల‌సిస్.. హిట్‌మ్యాన్ ఏజ్, ఎనర్జీపై వ్యాఖ్య‌లు!
Sarfaraz Vs Jurel IND vs SL: సర్ఫరాజ్ ఖాన్ రీ-ఎంట్రీతో ప్లేయింగ్ ఎలెవన్ లో బిగ్ డిబేట్..జురెల్, స‌ర్ఫ‌రాజ్ మ‌ధ్య‌లో పోటీ.. 15 నుంచి తొలి టెస్టు!
సర్ఫరాజ్ ఖాన్ రీ-ఎంట్రీతో ప్లేయింగ్ ఎలెవన్ లో బిగ్ డిబేట్..జురెల్, స‌ర్ఫ‌రాజ్ మ‌ధ్య‌లో పోటీ.. 15 నుంచి తొలి టెస్టు!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
Embed widget