అన్వేషించండి

Lent Days 2025: లెంట్ డేస్‌ అంటే ఏంటీ? క్రైస్తవులు ఎందుకు పాటిస్తారో తెలుసా?

Lent Days: మార్చి ఐదో తేదీ నుంచి ఈ లెంట్ డేస్ ప్రారంభం అయ్యాయి. యేసు క్రీస్తు సిలువపై మరణించి, తిరిగి లేచిన పునరుత్థాన దినం అదే ఈస్టర్ పండుగ ( ఏప్రిల్ 19వ తేదీ) వరకు లెంట్ డేస్ ను ఆచరిస్తారు.

Lent Days 2025: క్రైస్తవులకు ప్రధానంగా, యేసు క్రీస్తు పుట్టిన డిసెంబర్ 25వ తేదీని క్రిస్మస్‌గా,  ఆయన శిలువపై మరణించిన రోజును గుడ్ ఫ్రైడేగా, ఆయన తిరిగి లేచిన రోజును ఈస్టర్‌గా ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు. అదే రీతిలో లెంట్ డేస్‌ను కూడా ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవలు ఆచరిస్తారు. క్రైస్తవుల్లోని క్యాథలిక్కులు, ఫ్రోటెస్టంట్స్, ఆర్థడాక్స్ శాఖల వారందరూ ఈ లెంట్ డేస్‌ను పాటిస్తారు. దీన్నే శ్రమల కాలం అని, మండల కాలం అని, ఉపవాస దినాలు అని పిలుస్తారు. అయితే అసలు ఈ లెంట్ డేస్ అంటే ఏంటి? ఆ పేరు ఎందుకు వచ్చింది? ఎన్ని రోజులు ఇది ఆచరిస్తారు?ఆ రోజుల్లో వారు ఏం చేస్తారు? 

లెంట్ డేస్ అంటే ఏంటి ?
లెంట్ అనే పదం ప్రాచీన ఆంగ్ల భాషలోని LENCTEN  అనే పదం నుంచి వచ్చింది. ఈ పదానికి వసంత రుతువు అని అర్థం. ఇది యేసు క్రీస్తు శిలువ త్యాగం, తిరిగి పునరుత్థానం చెందడాన్ని గౌరవించేందుకు సంబంధించిన పవిత్రమైన కాలంగా క్రైస్తవులు భావిస్తారు. లాటిన్ భాషలో దీనికి సమాన అర్థం "Quadragesima" అంటే "నలభై" అని అర్థం వస్తుంది. యేసు క్రీస్తు బోధనలు ప్రారంభించే ముందు 40 రోజులు ఉపవాసం ఉన్నారని బైబిల్‌లో రాసి ఉంది. మానవులందరినీ పాపం నుంచి విముక్తి కలిగించడానికి వచ్చిన యేసు క్రీస్తు 40 దినాలు ఉపవాసం తర్వాతే తన కార్యాచరణ ప్రారంభించారని దానికి సూచనగా ఈ లెంట్ డేస్‌ను ఆచరిస్తారు.

బైబిల్‌లో ఈ నలభై రోజుల ఉపవాసానికి చాలా ప్రాధాన్యత ఉంది. మోషే, ఏలియా కూడా 40 రోజులు ఉపవాసం ఉన్నారని చెబుతారు. నోవహు కాలంలో 40 రోజుల పాటు ఆగకుండా వర్షం కురిపించారట. దాన్నే జళ ప్రళయంగా క్రైస్తవులు చెబుతారు. ఇలా నలభై రోజులు అనేది క్రైస్తవులకు ఓ ప్రత్యేకమైన అంశం. ఈ 40 రోజుల ఉపవాస కాలమే లెంట్ డేస్‌గా క్రైస్తవులు ఆచరిస్తారు.

లెంట్‌ డేస్ ఆచరణ ఏంటి ?
ఈ ఏడాది మార్చి ఐదో తేదీ నుంచి ఈ లెంట్ డేస్ ప్రారంభమయ్యాయి. యేసు క్రీస్తు శిలువపై మరణించి, తిరిగి లేచిన దినాన్ని పునరుత్థాన దినం అదే ఈస్టర్ పండుగ ( ఏప్రిల్ 19వ తేదీ) ఆ రోజు వరకు లెంట్ డేస్‌ను ఆచరిస్తారు. అయితే ఇవి 46 దినాలు. కాని ఆదివారాలు తీసేసి సరిగా ఈ నలబై దినాలు పాప ప్రాయచిత్తం కోసం, ఆత్మ శుద్ధి కోసం ఈ ఉపవాస దినాలు పాటిస్తారు. మరి కొద్ది మంది ఉపవాసం ఉండకున్నా ఈ నలబై రోజులు మాంసాహారం మానేస్తారు. ప్రార్థన, ఉపవాసం, దాన ధర్మాల వంటి వాటికి ఈ లెంట్ డేస్ పరమార్థంగా క్రైస్తవులు భావిస్తారు. 

ఉపవాసాలతోపాటు ప్రతీ రోజు సాయింత్రం చర్చిలో జరిగే ప్రార్థనలకు హజరవుతారు. చర్చిలో బైబిల్‌లోని ఓ పాత నిబంధన వాక్యం, ఒక కొత్త నిబంధనలోని వాక్యాన్ని ధ్యానిస్తారు. ఆ వాక్యానికి అన్వయించే పాటలు పాడతారు. పాపాలు ఒప్పుకుని, వాటిని విడిచి పెట్టే రీతిలో పశ్చాతాప్తపడతారు.    

లెంట్ డేస్ ఆచరణ ఎప్పటి నుంచి ప్రారంభమైంది?
ఈ లెంట్‌డేస్ ఆచరణ అనేది క్రీ.శ రెండో శతాబ్ధం నుంచే ఆరంభమైందని క్రైస్తవ మత పెద్దలు చెబుతారు. యేసు క్రీస్తును ఫాలో అయ్యే తొలి తరం శిష్యులు కూడా ఈ పద్ధతిని ఆచరించారని చెబుతారు. తొలుత ఈ లెంట్ డేస్‌ను స్వల్ప కాల ఉపవాస దీక్షగా ఆనాటి తొలి తరం క్రైస్తవులు ఆచరించేవారు. క్రీ.శ నాల్గో శతాబ్ధానికి వచ్చే నాటికి ఇది నలభై రోజుల ఉపవాస దీక్షగా మారింది. క్రీ.శ 325వ సంవత్సరంలో జరిగిన నైసియా కౌన్సిల్‌లో లెంట్ డేస్ ఆచరణ అనేది అధికారికంగా గుర్తించడం జరిగింది. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఈ లెంట్ డేస్ ఆచరణ అనేది అధికారికంగా చర్చిల్లో జరుపుతున్నారు. 

క్రైస్తవం ప్రారంభమైన తొలి నాళ్లలో చాలా మంది ఈ మతంలో చేరేందుకు వచ్చే వాళ్లు. అలా వచ్చిన వారంతా అందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నారా లేదా అని తెలుసుకునేందుకు 40 రోలుజ ఉపవాస పరీక్ష పెట్టేవాళ్లట. ఇలా 40 రోజులు ఉపవాస దీక్షతో సిద్దపడిన తర్వాతే వారికి బాప్టిజం ఇచ్చే వాళ్లను చెబుతారు. ఇలా ఆ తర్వాత కూడా ఈ నలభై రోజుల దీక్షను క్రైస్తవులంతా పాటించే విధానం అమల్లోకి వచ్చిందని చర్చి పెద్దలు చెబుతారు.

Also Read: రంజాన్ పండుగ ఎందుకు, ఎలా జరుపుకుంటారో మీకు తెలుసా ?

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

దుర్గాష్టమి శుభాకాంక్షలు: ఈ శ్లోకాలతో అమ్మవారి ఆశీస్సులు పొందండి, మీ సన్నిహితులకు పంపించండి!
దుర్గాష్టమి శుభాకాంక్షలు: ఈ శ్లోకాలతో అమ్మవారి ఆశీస్సులు పొందండి, మీ సన్నిహితులకు పంపించండి!
17-10-2026 శనివారం ధనస్సు, మకర, కుంభ, మీనం రాశిఫలాలు: మీ అదృష్టం, సవాళ్లు ఇవే!
17-10-2026 శనివారం ధనస్సు, మకర, కుంభ, మీనం రాశిఫలాలు: మీ అదృష్టం, సవాళ్లు ఇవే!
17-10-2026 శనివారం సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల్లో ఎవరికి అదృష్టం, ఎవరికి జాగ్రత్త అవసరం?
17-10-2026 శనివారం సింహం, కన్యా,తులా, వృశ్చిక రాశుల్లో ఎవరికి అదృష్టం, ఎవరికి జాగ్రత్త అవసరం?
17-10-2026 శనివారం రాశిఫలాలు: మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల భవిష్యత్తుకు గ్రహాల సూచనలు
17-10-2026 శనివారం రాశిఫలాలు: మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల భవిష్యత్తుకు గ్రహాల సూచనలు

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Embed widget