Shiva Rajkumar: రామ్ చరణ్ RC16లో శివరాజ్ కుమార్ లుక్ టెస్ట్ పూర్తి... త్వరలో సెట్స్‌లోకి ఎంట్రీ
Ram Charan's RC 16 Update: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కొత్త సినిమాలో కరుణాడ చక్రవర్తి శివరాజ్ కుమార్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఆయన లుక్ టెస్ట్ పూర్తి అయ్యింది.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కథానాయకుడిగా రూపొందుతున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమాలో కరుణాడ చక్రవర్తి శివ రాజ్ కుమార్ (Shiva Rajkumar) ఓ పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఆయన క్యారెక్టర్‌కు సంబంధించి లుక్ టెస్ట్ పూర్తి అయ్యింది.
శివన్నతో దర్శకుడు బుచ్చిబాబు సానా
శివరాజ్ కుమార్ ఇటీవల క్యాన్సర్ నుంచి కోలుకున్నారు. అమెరికా వెళ్లి సర్జరీ చేయించుకుని తిరిగి వచ్చారు. క్యాన్సర్ చికిత్సకు వెళ్ళడానికి ముందు ఆయన సినిమా షూటింగ్ చేశారు. తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ రెస్ట్ తీసుకోకుండా ఫిల్మ్ షూటింగ్స్ మొదలు పెట్టారు. హీరోగా ఆయన 131వ సినిమా (కన్నడలో) స్టార్ట్ చేశారు. ఈ రోజు రామ్ చరణ్ సినిమా కోసం లుక్ టెస్ట్ చేశారు. త్వరలో శివన్న చిత్రీకరణలో జాయిన్ కానున్నారని చిత్ర బృందం తెలిపింది. ఆయనతో దర్శకుడు దిగిన ఫోటోను షేర్ చేశారు.
Also Read: ఒరిస్సా అడుగు పెట్టిన మహేష్ బాబు... రాజమౌళి సినిమా కోసం, ఆయనతో ఎవరు వెళ్లారంటే?
View this post on Instagram
రామ్ చరణ్ 16వ సినిమాకు బుచ్చి బాబు సానా (RC 16 director) దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నయా అతిలోక సుందరి జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ గత ఏడాది ప్రారంభమైంది. కర్ణాటకలోని మైసూరులో గత ఏడాది నవంబరులో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేశారు. ఒక ఇటీవల హైదరాబాద్‌లో కీలక షెడ్యూల్ పూర్తి చేశారు.త్వరలో మరొక షెడ్యూల్ మొదలు కానుంది.
Also Read: మా అమ్మ సూసైడ్ అటెంప్ట్ చేయలేదు... సింగర్ కల్పన కేసులో క్లారిటీ ఇచ్చిన కుమార్తె
వృద్ధి సినిమాస్ పతాకం మీద వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. ఇందులో జగపతి బాబు, బాలీవుడ్ నటుడు - 'మీర్జాపూర్' ఫేమ్ దివ్యేందు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజికల్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఛాయాగ్రాహకుడిగా పని చేస్తున్నారు. ఈ సినిమాకు అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్.





















