Cardamom : రాత్రి పడుకునే ముందు యాలకులు తింటే ఇన్ని లాభాలా.. రెండు తింటే చాలట
Cardamom Benefits : యాలకులు ఆరోగ్యానికి మంచివని అందరికీ తెలుసు. అయితే రాత్రుళ్లు నిద్రపోయే ముందు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. అవేంటంటే..

Cardamom Before Bedtime : వంటింట్లో దొరికే ఎన్నో మసాలాలు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి. అలాంటివాటిలో యాలకులు ఒకటి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. అందుకే వీటిని వంటల్లో, నేరుగా, టీలలో కలిపి తీసుకుంటూ ఉంటారు. అయితే వీటిని రాత్రుళ్లు పడుకునేముందు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తున్నారు. కొన్ని ఆరోగ్య సమస్యలు దూరమవుతాయని చెప్తున్నారు. ఇంతకీ ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
యాలకుల్లో మెంథాన్ అసిడిటీ ఉంటుంది. ఇది ఔషద లక్షణాలు కలిగి ఉంటుంది. అంతేకాకుండా యాంటీఆక్సిడెంట్లు పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలతో నిండి ఉంటుంది. యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. అందుకే ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. మరి రాత్రుళ్లు తింటే కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
జీర్ణ సమస్యలు దూరం..
సమ్మర్లో జీర్ణ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. అలాగే రాత్రుళ్లు చాలామంది జీర్ణ సమస్యలతో ఇబ్బందిపడుతూ ఉంటారు. అలాంటివారు యాలకులు తినొచ్చు. అజీర్ణం నుంచి ఇవి ఉపశమనం ఇస్తాయి. వికారం, వాంతులను తగ్గించడంలో సహాయం చేస్తాయి. గ్యాస్, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. దీనివల్ల రాత్రి నిద్రకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంతేకాకుండా మెరుగైన, ప్రశాంతమైన నిద్రను అందించడంలో యాలకులు వండర్స్ చేస్తాయి.
శ్వాస సమస్యలు దూరం..
యాలకుల్లోని ఎక్స్‌పెక్టరెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి జలుబు సమయంలో ముక్కు రద్దీని తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. జలుబు వల్ల చాలామంది ముక్కు దిబ్బడ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల శ్వాస అందక రాత్రుళ్లు నిద్రపోలేకపోతారు. ఈ సమస్యను దూరం చేస్తూ.. మెరుగ్గా శ్వాస తీసుకోవడంలో యాలకులు హెల్ప్ చేస్తాయి. వీటిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు దగ్గు నుంచి ఉపశమనం ఇస్తాయి. దీనివల్ల కూడా మెరుగైన నిద్ర మీ సొంతమవుతుంది.
నోటి ఆరోగ్యం..
యాలకులు శ్వాశను ఫ్రెష్ చేస్తాయని అందరికీ తెలుసు. వీటిలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు శ్వాసను ఫ్రెష్‌గా మారుస్తాయి. నోటి దుర్వాసన సమస్యతో ఇబ్బంది పడేవారు రాత్రుళ్లు వీటిని తింటే సమస్యను దూరం చేసుకోవచ్చు. చిగుళ్ల వ్యాధులను కూడా ఇది దూరం చేస్తుంది. యాంటీఆక్సిడెంట్లు చిగుళ్ల వ్యాధులను నివారించడంలో హెల్ప్ చేస్తాయి. నోటి ఆరోగ్యంతో పాటు నిద్రను ప్రోత్సహిస్తాయి.
మానసిక ఆరోగ్యం..
యాలకుల వాసన ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. విశ్రాంతిని అందిస్తుంది. నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. కాబట్టి నిద్ర సమస్యలతో ఇబ్బంది పడేవారు దీనిని రోజూ తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. బీపీని కంట్రోల్ చేస్తుంది.
ఇలా తీసుకోండి..
రెండు యాలకులను నేరుగా తినొచ్చు. లేదా యాలకును చిదిమి.. వేడినీళల్లో వేసి మరిగించి టీగా పడుకునే ముందు తాగొచ్చు. అలాగే వేడి నీటిలో లేదా పాలల్లో యాలకుల పొడిని వేసుకుని తాగొచ్చు. సప్లిమెంట్స్ రూపంలో కూడా తీసుకోవచ్చు. అయితే మీరు వీటిని రొటీన్లో చేర్చుకోవాలనుకుంటే కచ్చితంగా వైద్యుల సహాయం, సూచనలు తీసుకోవాలి.
Also Read : గురక ఎక్కువగా వస్తుందా? కారణాలు ఇవే.. తగ్గించుకోవడానికి ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.






















