Reduce Bloating : కడుపు ఉబ్బరానికి కారణాలు ఇవే.. ఆ ఫుడ్స్‌కి దూరంగా ఉంటూ, FODMAP DIET ఫాలో అయిపోవాలట
Beat Bloating : కొందరు కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలతో ఇబ్బంది పడతారు. అసలు ఈ కడుపు ఉబ్బరం ఎందుకు వస్తుంది? ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిదో ఇప్పుడు చూసేద్దాం.

Bloating Causes and Prevention Tips : కొంచెం తిన్నా కడుపు ఉబ్బరం వచ్చేస్తుందబ్బా. అసలు తినాలో తినకూడదో.. ఏమి తినాలో అర్థమే కావట్లేదు. ఇలా పెద్దవాళ్లు చెప్తుంటారు. కానీ యుక్తవయసులో ఉండేవారిని కూడా ఈ కడుపు ఉబ్బరం సమస్య వేధిస్తుంది. దీనివల్ల సరిగ్గా తినలేరు. నచ్చిన డ్రెస్ వేసుకోలేరు. ఎప్పుడూ చూసిన పొట్ట బయటకు కనిపిస్తూ.. ఉబ్బరంగా ఉంటుంది. అయితే ఈ కడుపు ఉబ్బరం రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. తీసుకునే ఆహారం, గట్ హెల్త్, లైఫ్‌స్టైల్ వంటివి కడుపు ఉబ్బరాన్ని ప్రేరేపిస్తాయి. తినేప్పుడు ఎయిర్ని ఎక్కువగా మింగడం వల్ల కూడా ఇది జరుగుతుంది.
కడుపు ఉబ్బరానికి కారణాలివే
కడుపు ఉబ్బరానికి ప్రధాన కారణం ఏంటంటే చిన్న పేగుల్లో బ్యాక్టీరియల్ గ్రోత్ (Small Intestinal Bacterial Overgrowth-SIBO) ఎక్కువ అవ్వడమే. మీరు తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణంకాకుండా పెద్దపేగుల్లోకి వెళ్లినప్పుడు ఈ బ్యాక్టిరీయా ఆ ఆహారాన్ని పులియబెడుతుంది. దీనివల్ల కొన్ని గ్యాస్‌లు రిలీజ్ అవుతాయి. దీనివల్ల బ్లోటింగ్ వచ్చే అవకాశం ఉంటాది. గ్యాస్ ఎక్కువగా ప్రొడ్యూస్.. నీటి శాతం వల్ల మీ పేగులు ఉబ్బుతాయి. అలా ఉబ్బినప్పుడే కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. అప్పుడు మీరు కొంచెం తిన్నా కడుపు ఉబ్బరంగానే అనిపిస్తుంది.
FODMAP DIET
కడుపు ఉబ్బరం సమస్యను తగ్గించుకోవడానికి FODMAP DIETని ఫాలో అవ్వొచ్చు. తాత్కాలికంగా వీటిని తగ్గించి.. సమస్యను పూర్తిగా క్లియర్ చేసుకున్న తర్వాత అవసరానికి తగ్గట్లు మీరు ఫుడ్స్‌ని మార్చి తీసుకోవచ్చు. ఈ డైట్ ప్రకారం ఏ ఫుడ్స్ తీసుకోవాలో.. ఏ ఫుడ్స్ తింటే సమస్య ఎక్కువ అవుతుందో చూసేద్దాం.
తీసుకోవాల్సిన ఫుడ్స్
క్యారెట్, కీరదోస, లెట్యూస్ వంటి కూరగాయలు తీసుకోవచ్చు. స్ట్రాబెర్రీ, పైనాపిల్, ద్రాక్షలు వంటి పండ్లు మంచిది. చికెన్, గుడ్లు, టోఫుని ప్రోటీన్ కోసం తీసుకోవచ్చు. బటర్, వేరుశనగలు, నూనెలు ఫ్యాట్స్ కోసం తినొచ్చు. బంగాళదుంపల చిప్స్, పాప్ కార్న్ వంటివి స్నాక్స్ కోసం తినొచ్చు. ఇవి కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి.
తినకూడని ఫుడ్స్ ఇవే
వెల్లుల్లి, ఉల్లిపాయ, బీన్స్కి వీలైనంత దూరంలో ఉండాలి. బ్లాక్ బెర్రీలు, పుచ్చకాయ, పీచ్ వంటి ఫుడ్స్ కడుపు ఉబ్బరాన్ని పెంచుతాయి. సాసేజ్, బటర్డ్ ఫిష్, బ్రెడ్ స్నాక్స్ మంచివి కావు. అవకాడో, బాదం, పిస్తాలు ఆరోగ్యానికి మంచివే కానీ కడుపు ఉబ్బరాన్ని పెంచుతాయి. బీన్స్, గ్రూటన్ బేస్డ్ బ్రెడ్, మఫిన్స్ తీసుకోకపోవడమే మంచిది. ఈ సమస్యను తగ్గించుకునేందుకు చాలామంది కార్బొనేటెడ్ డ్రింక్స్ తీసుకుంటారు. దీనివల్ల బ్లోటింగ్ తగ్గడం కాదు.. ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది.
మరిన్ని టిప్స్
గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకునేందుకు పెరుగు, కిమ్చి వంటివి తీసుకోవాలి. వీటిలో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి గట్ బ్యాక్టీరియాను సమతుల్యం చేస్తాయి. పుష్కలంగా నీరు తాగాలి. పొటాషియం ఎక్కువగా ఉండే అరటిపండ్లు, బచ్చలికూర, చిలగడదుంపలు తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. భోజనం తిన్న తర్వాత నడిస్తే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఒత్తిడిని తగ్గించుకోవాలి. పొత్తికడుపును మసాజ్ చేయడం వల్ల కూడా మంచి ఫలితాలుంటాయి.
Also Read : ఐటీ ఉద్యోగుల్లో పెరుగుతున్న ఫ్యాటీ లివర్.. హైదరాబాద్‌లో 84% మందికి ఉందట, కారణాలివే

