అన్వేషించండి

RRB JE CBT-I Result: ఆర్‌ఆర్‌బీ జూనియర్ ఇంజినీర్ సీబీటీ-1 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే - స్కోరుకార్డులు డౌన్‌లోడ్ చేసుకోండి

RRB JE Results: రైల్వేశాఖలో జూనియర్ ఇంజినీర్, కెమికల్ సూపర్‌వైజర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్‌ మెటలర్జికల్ అసిస్టెంట్ సీబీటీ-1 ఫలితాలను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది.

RRB Junior Engineer Results: రైల్వేశాఖలో జూనియర్ ఇంజినీర్, కెమికల్ సూపర్‌వైజర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్‌ మెటలర్జికల్ అసిస్టెంట్ సీబీటీ-1 పరీక్షల ఫలితాలను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు మార్చి 5న విడుదల చేసింది. ఫలితాలతోపాటు, కేటగిరీలవారీగా కటాఫ్ మార్కుల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. మొదటి దశలో నిర్వహించిన సీబీటీ-1 పరీక్షల్లో మొత్తం 20,792 మంది అభ్యర్థులు సీబీటీ-2 పరీక్షకు అర్హత సాధించారు. అభ్యర్థుల రోల్‌ నంబర్లతో వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి స్కోరుకార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

రైల్వే జూనియర్ ఇంజినీర్ సీబీటీ-1 ఫలితాల కోసం క్లిక్ చేయండి..

కటాఫ్ మార్కుల వివరాల కోసం క్లిక్ చేయండి..

స్కోరుకార్డుల కోసం క్లిక్ చేయండి..

రైల్వేశాఖ పరిధిలో దేశవ్యాప్తంగా ఉన్న వివిధ జోన్లలో 7,951 ఖాళీల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) గతేడాది జులైలో నోటిఫికేషన్ (సీఈఎల్‌ నంబర్‌ 03/ 2024) విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా కెమికల్ సూపర్‌వైజర్/ రిసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్‌వైజర్/ రిసెర్చ్, జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్‌ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీచేయనున్నారు. అభ్యర్థుల నుంచి జులై 30 నుంచి ఆగస్టు 29 వరకు దరఖాస్తులు స్వీకరించారు. సీబీటీ-1 పరీక్ష అడ్మిట్ కార్డులను డిసెంబరు 12న విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం డిసెంబరు 16 నుంచి 18 వరకు పరీక్షలు నిర్వహించింది. తాజాగా ఈ పరీక్షల ఫలితాలను ఆర్‌ఆర్‌బీ విడుదల చేసింది. సీబీటీ-2 పరీక్షల తేదీలను వెల్లడించాల్సి ఉంది.

పోస్టుల వివరాలు..

మొత్తం ఖాళీల సంఖ్య: 7,951. 

జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్‌ మెటలర్జికల్ అసిస్టెంట్: 7,934 పోస్టులు 

కెమికల్ సూపర్‌వైజర్/ రిసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్‌వైజర్/ రిసెర్చ్ (ఆర్‌ఆర్‌బీ గోరఖ్‌పూర్ మాత్రమే): 17 పోస్టులు  

అర్హత: పోస్టులవారీగాసంబంధిత విభాగంలో డిప్లొమా (ఇంజినీరింగ్‌), బ్యాచిలర్ డిగ్రీ (ఇంజినీరింగ్/ టెక్నాలజీ), బీఎస్సీ (సివిల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, ఫిజిక్స్) ఉత్తీర్ణులై ఉండాలి. 

స్టేజ్‌-1 రాతపరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు స్టేజ్-1 రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో మ్యాథమెటిక్స్ 30 ప్రశ్నలు-30 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్‌ రీజనింగ్ 25 ప్రశ్నలు-25 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ 15 ప్రశ్నలు-15 మార్కులు, జనరల్ సైన్స్ 30 ప్రశ్నలు-30 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 90 నిమిషాలు.

స్టేజ్‌-2 రాతపరీక్ష విధానం: మొత్తం 150 మార్కులకు స్టేజ్-2 రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో జనరల్ అవేర్‌నెస్ 15 ప్రశ్నలు-15 మార్కులు, ఫిజిక్స్ అండ్‌ కెమిస్ట్రీ 15 ప్రశ్నలు-15 మార్కులు, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ 10 ప్రశ్నలు-10 మార్కులు, బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ 10 ప్రశ్నలు-10 మార్కులు, టెక్నికల్ ఎబిలిటీస్ 100 ప్రశ్నలు-100 మార్కులు ఉంటాయి. పరీక్ష వ్యవధి 120 నిమిషాలు. 

జీతం: 
➥జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్‌ మెటలర్జికల్ అసిస్టెంట్: రూ.35,400. 
➥ కెమికల్ సూపర్‌వైజర్/ రిసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్‌వైజర్/ రిసెర్చ్: రూ.44,900.  

Notification

ALSO READ:

ఐటీబీపీలో 133 కానిస్టేబుల్ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ (ఐటీబీపీ - ITBP) స్పోర్ట్స్ కోటాలో కానిస్టేబుల్‌ (జనరల్‌ డ్యూటీ), గ్రూప్-సి పరిధిలోని నాన్ గెజిటెడ్ (నాన్ మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి  నోటిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వారా 133 పోస్టులను భర్తీ చేయనున్నారు. పదో తరగతి (మెట్రిక్యులేషన్‌) లేదా తత్సమాన ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తుల స్వీకరణ మార్చి 4న ప్రారంభం కాగా, ఏప్రిల్ 2వ తేదీతో ముగియనుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

AP Job Calendar 2026 : ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
AP TET 2026 Hall Tickets Download:ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
Telangana Special TET: తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
Uday Ruddarraju: ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Embed widget