Naga Chaitanya Sobhita Wedding Date: నాగచైతన్య, శోభిత ధూళిపాల పెళ్లి డేట్ ఫిక్స్.. వచ్చే ఏడాది కాదు, ఈ సంవత్సరమేనట
Chay Sobhita Wedding Date : నాగచైతన్య, శోభితల పెళ్లి తేది ఇదేనంటూ ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అంతేకాకుండా వారి గురించి మరిన్ని అప్డేట్స్ వస్తున్నాయి. అవేంటంటే..

Naga Chaitanya and Sobhita Dhulipala Wedding Plans : అక్కినేని వారసుడు నాగచైతన్య, శోభిత ధూళిపాల పెళ్లి హడావుడి మొదలైపోయింది. ఈ విషయాన్ని శోభిత తన ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పోస్ట్ చేసింది. పెళ్లికి ముందు చేసే పసుపు దంచడం, గోధుమరాయి ప్రధాన కార్యక్రమాన్ని కూడా పూర్తి చేశారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ తంతు తర్వాతనే పెళ్లి పనులు ప్రారంభిస్తారు. మరి ఈ జంట ఏ రోజున పెళ్లి చేసుకోనున్నారు? డెస్టినేషన్ వెడ్డింగ్‌కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అనే విషయంపై వారి అభిమానులు తెగ ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వారి పెళ్లి తేది ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.
ఈ ఏడాదే పెళ్లి!?
నాగచైతన్య.. శోభిత వారి లవ్ ట్రాక్ రూమర్స్‌కు చెక్ పెడుతూ.. 8.8.8 మ్యాజికల్ తేదీ(ఆగస్టు 8వ తేది 2024)న నిశ్చితార్థం చేసుకున్నారు. అప్పటి నుంచి వారి పెళ్లి ఎప్పుడనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అక్కినేని అభిమానులు కూడా చై పెళ్లి అప్డేట్స్ గురించి క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలోనే వారి పెళ్లి డిసెంబర్లో జరగనున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అధికారిక ప్రకటన రాకపోయినా..
చై, శోభితల పెళ్లి.. డిసెంబర్ 4, 2024వ తేదీన వీరి పెళ్లి జరగనున్నట్లు చెప్పుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు వైరల్ అవుతున్న పోస్ట్‌లో ఉన్నాయి. చైతన్య, శోభితా తమ డెస్టినేషన్ వెడ్డింగ్‌ను రాజస్థాన్‌లో చేసుకోవాలనుకున్నారట. ఇప్పుడు ఆ ప్లాన్‌ను విరమించుకున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు పెళ్లి వెన్యూ హైదరాబాద్‌గా ఫిక్స్ చేశారని పోస్ట్‌లో ఉంది.
నిశ్చితార్థం తరహాలోనే..
హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీరి పెళ్లి జరుగుతుందని వైరల్ అవుతున్న పోస్టులో ఉంది. ఇప్పటికే విశాఖపట్నంలో వెడ్డింగ్ పనులు ప్రారంభించినట్లు శోభితా ఇన్‌స్టాలో తెలిపింది. అయితే వీరి వివాహానికి సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరుకావచ్చని భావిస్తున్నారు. ఎంగేజ్మెంట్ తరహాలోనే.. హడావుడి లేకుండా పెళ్లి జరుగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీరి పెళ్లి తేది గురించి.. ఎక్కడ జరుగుతుందనే దాని గురించి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.
Also Read : ఎంగేజ్మెంట్ తర్వాత మొదటిసారి శోభిత ఫోటో షేర్ చేసిన నాగచైతన్య.. లుక్, క్యాప్షన్ అదిరిందిగా
సమంతతో, నాగచైతన్య విడాకులు తీసుకున్న తర్వాత.. చై, శోభితల లవ్ ట్రాక్ తెరపైకి వచ్చింది. వీరిద్దరూ కలిసి ట్రిప్‌కి వెళ్లారంటూ ఫోటోలు, వార్తలు వచ్చాయి. కొన్నాళ్లు దీనిపై ఇద్దరూ స్పందించలేదు. కానీ సడెన్‌గా ఎంగేజ్మెంట్ చేసుకుని అందరని షాక్‌కు గురిచేశారు. నిశ్చితార్థం తర్వాత వీరిద్దరూ కలిసి బయటకు వెళ్తున్నారు. తాజాగా ఏయన్నార్ అవార్డు వేడుకల్లో కూడా శోభితా కనిపించింది. ఎంగేజ్మెంట్ తర్వాత తొలి దీపావళిని కూడా నాగచైతన్యతోనే కలిసి చేసుకుంది శోభితా. తెలుగు సంప్రదాయ పద్ధతిలోనే పెళ్లి చేసుకుంటానన్న శోభితా.. అవే పద్ధతులు పాటిస్తూ.. పెళ్లి పనులు కూడా మొదలు పెట్టేసింది.
View this post on Instagram
Also Read : నాగచైతన్య, శోభిత పెళ్లి పనులు మొదలైపోయాయి.. గోధుమ రాయి ఫంక్షన్ ఫోటోలు ఇవే
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

