MLC Results: గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఫస్ట్ రౌండ్‌లో టీడీపీకి భారీ లీడ్ - ఈ ట్రెండ్ కొనసాగితే ఆలపాటి గెలుపు ఈజీనే !
Alapati: గుంటూరు, కృష్ణా పట్టభద్రుల నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి మొదటి రౌండ్ లో లీడ్ లో ఉన్నారు. భారీ గ్యాప్ ఉండటంతో ఆయన విజయం ఖాయమని బావిస్తున్నారు.

TDP leading : ఏపీలో రెండు పట్టభద్రులు, ఒక గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీలకు జరిగిన ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. పూర్తిగా బ్యాలెట్ పేపర్లతో జరిగిన పోలింగ్ కావడంతో బ్యాలెటన్నీ కట్టలు కట్టి లెక్కిచే సరికి సమయం పట్టింది. మొదటి రౌండ్ ముగిసే సరికి.. గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ భారీ ఆధిక్యం సాధించారు. టీడీపీ అభ్యర్థికి తొలి రౌండ్ లో 17,246 ఓట్లు రాగా.. సమీప ప్రత్యర్థి పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావుకు 7156 ఓట్లు వచ్చాయి. అంటే ఒక్క రౌండ్ లోనే పది వేలకుపైగా మెజార్టీ సాధించారు. ట్రెండ్ ఇలాగే కొనసాగితే మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి.
తెలుగుదేశం పార్టీ తరపున ఆలపాటి రాజేంద్రప్రసాద్ పోటీ చేశారు కానీ.. వైసీపీ తరపున ఎవరూ పోటీ చేయలేదు. మొదట్లో పూనూరు గౌతం రెడ్డిని అభ్యర్థిగా ఖరారు చేశారు. అయితే తర్వాత ఆయన కూడా పోటీ నుంచి విరమించుకున్నారు. రెండు గ్రాడ్యూయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీ తన అభ్యర్థుల్ని నిలపలేదు. టీడీపీ రెండు పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఆలపాటి రాజేంద్రప్రసాద్, పేరాబత్తుల రాజశేఖరంలను నిలబెట్టారు. అలాగే టీచర్స్ నియోజకవర్గంలో ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మకు మద్దతు ఇచ్చారు.
ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరిగింది. తొలి ప్రాధాన్యత ఓట్లలో పీఆర్‌టీయూ అభ్యర్థి శ్రీనివాసులుకు 7,210 ఓట్లు, కూటమి, ఏపీటీఎఫ్ మద్దతు అభ్యర్థి రఘువర్మకు 6,845 ఓట్లు వచ్చాయి. అదే విధంగా యూటీఎఫ్ అభ్యర్థి విజయగౌరి 5,804 ఓట్లు సాధించారు. దీంతో తొలి ప్రాధాన్యత ఓట్లలో ఫలితం తేలలేదు. రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు.ఒక్కొక్కర్ని ఎలిమినేట్ చేస్తూ వారికి వచ్చిన ఓట్లలో ద్వితీయ ప్రాధాన్య ఓట్లు ఎవరికి వచ్చాయో వారికి ఓట్లు కలుపుతూ వెళ్తున్నారు. రెండో రౌండ్‌లో అభ్యర్థి శివప్రసాదరావు, మూడో రౌండ్‌లో అభ్యర్థి పద్మావతి ఎలిమినేషన్ అయినట్లు అధికారులు ప్రకటించారు. కాగా ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో మొత్తం ఆరు రౌండ్లు ఉన్నాయి. 10,068 ఓట్లు సాధించిన అభ్యర్థి విజేతగా నిలిస్తారు.
మరో గ్రాడ్యుయేట్ నియోజకవర్గం ఉభగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ స్థానం. అక్కడ కౌంటింగ్ ఇంకా తొలి రౌండ్ ముగియలేదు. టీడీపీ కూటమి అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖరం పోటీ చేయగా.. పీడీఎఫ్ తో పాటు ఇతర సంఘాల నుంచి అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మాజీ ఎంపీ హర్షకుమార్ కుమారుడు కూడా పోటీ చేశారు. ఇక్కడ కూడా ఎన్నిక ఉత్కంఠగా జరిగింది. మొత్తం ఓట్లలో సగం కన్నా ఒక్క ఓటు అధికంగా వస్తే..కౌంటింగ్ ఆపేసి విజేతగా ప్రకటిస్తారు. ఆ ఓట్లు రాకపోతే.. ఎలిమినేషన్ రౌండ్ ప్రారంభిచి... ద్వితీయ ప్రాధాన్య ఓట్లను లెక్కించి విజేతను తేలుస్తారు. మంగళవారం ఉదయానికి ఫలితాలు వస్తాయని భావిస్తున్నారు.
Also Read: 3 రాజధానులపై మారిన వైసీపీ విధానం - అమరావతికి జై కొట్టినట్లేనా ?- బొత్స సంచలనం
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

