అన్వేషించండి

YSRCP On Amaravati: 3 రాజధానులపై మారిన వైసీపీ విధానం - అమరావతికి జై కొట్టినట్లేనా ?- బొత్స సంచలనం

Three capitals : వైఎస్ఆర్‌సీపీ మూడు రాజధానుల వివాదంపై చల్లబడినట్లుగా కనిపిస్తోంది. మూడు రాజధానుల విదానం అప్పటి పరిస్థితిని బట్టి తీసుకున్నదని.. ఇప్పుడు పార్టీలో చర్చిస్తామని బొత్స చెబుతున్నారు.

Amarvati:  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మూడు రాజధానుల నినాదం. ఈ నినాదంతోనే ఎన్నికలకు వెళ్లిపోయారు. ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే ఈ నినాదం వల్లనే ఓడిపోయామని వారు అంగీకరించడం లేదు. కూటమి ప్రభుత్వం ఏకైక రాజధాని.. అది కూడా అమరావతి అన్న నినాదంతో ఎన్నికలకు వెళ్లింది. ఘన విజయం సాధించింది. వచ్చే ఐదేళ్లలో అమరావతికి ఓ రూపు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో వైసీపీ విధానం ఏమిటన్నదానిపై ఆసక్తి ఏర్పడింది. మార్చుకుంటారా ... మూడు రాజధానులకే కట్టుబడి ఉంటారా అని చర్చించుకోవడం ప్రారంభించారు. ఈ సమయంలో మాజీ మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు చేశారు. 

శాసనమండలిలో అమరావతిని శ్మశానం అన్న బొత్స - దుమారం 

మండలిలో రాజధాని అంశంపై దుమారం రేగిన తర్వాత బొత్స సత్యనారాయణ ఇద తరహాలో బయట మాట్లాడారు. మూడు రాజదానుల విధానానికే కట్టుబడి ఉన్నారా అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు బొత్స సూటిగా సమాధానం ఇవ్వలేదు. మూడు రాజధానుల విధానం అనేది అప్పటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయం అన్నారు. ఇప్పుడు మళ్లీ త మపార్టీ మూడు రాజధానులకే కట్టుబడి ఉందా లేదా అన్నది తాము పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.   బొత్స సత్యనారాయణ .. కొద్ది రోజుల కిందట తమ విధానం  మూడు రాజధానులేనని చెప్పారు. అయితే ఇప్పుడు ఆ విధానానికి కాలం చెల్లిందని.. మళ్లీ పార్టీలో చర్చిస్తామన్నారు.          

మూడు రాజధానులు అప్పటి రాజకీయాల ప్రకారం తీసుకున్న నిర్ణయం - పార్టీలో చర్చించి మళ్లీ నిర్ణయం             

వైసీపీ 2019 ఎన్నికలకు ముందు రాజధానిని మార్చబోమని ప్రజలకు హామీ ఇచ్చింది. అయితే ఎన్నికలు అయ్యాక మూడు రాజధానులు అని చెప్పి విశాఖకు పాలనను తీసుకెళ్లాలని అనుకున్నారు. కానీ ఐదేళ్ల కాలంలో ఆ పని చేయలేకపోయారు. ఈ మధ్య కాలంలో ఎన్నో వివాదాలు వచ్చాయి. అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామని ఇంకా అద్భుతంగా నిర్మిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక మాట మార్చారన్న విమర్శలు వచ్చాయి. అసెంబ్లీలో అమరావతిని ఏకగ్రీవంగా ఆమోదించి కూడా జగన్ .. అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులని మార్చారని విమర్శలు వచ్చాయి. అయితే వైసీపీ మాత్రం ముందుకే వెళ్లింది.            

వైసీపీకి కలసి రాని మూడు రాజధానుల నినాదం                                

జ్యూడిషియల్ క్యాపిటల్ గా ప్రకటించిన కర్నూలులోనూ... ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రకటించిన విశాఖలోనూ వైసీపీకి ఒక్క సీటు కూడా రాలేదు. దాంతో ప్రజలకు ఆ నినాదం నచ్చలేదని అర్థమైంది. అయితే వైసీపీ ఎన్నికల తర్వాత మూడు రాజధానుల నినాదం ఎత్తడం లేదు. అదే సమయంలో అమరావతికి కూడా వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. కానీ మద్దతుగా కూడా మాట్లాడటం లేదు. ఈ క్రమంలో బొత్స వ్యాఖ్యల ప్రకారం పార్టీలో చర్చించి అమరావతిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఈ ఏడాదిలోనే తెలంగాణలో ఉప ఎన్నికలు: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఈ ఏడాదిలోనే తెలంగాణలో ఉప ఎన్నికలు: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
AP DSC Notification 2025: గతంలో డీఎస్సీకి అప్లై చేసిన అభ్యర్థులు మళ్లీ ఫీజు చెల్లించాలా.. ఇదిగో క్లారిటీ
గతంలో DSCకి అప్లై చేసిన అభ్యర్థులు మళ్లీ ఫీజు చెల్లించాలా.. ఇదిగో క్లారిటీ
JD Vance India Visit: ఫ్యామిలీతో భారత పర్యటనకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్- ఢిల్లీలో భద్రత పెంచిన పోలీసులు
ఫ్యామిలీతో భారత పర్యటనకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్- ఢిల్లీలో భద్రత పెంచిన పోలీసులు, మాక్ డ్రిల్స్ పూర్తి
Online Betting Case: వైసీపీ నేతపై ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ కేసు నమోదు, స్పెషల్ టీమ్స్‌ ఏర్పాటు చేసి గాలిస్తున్న పోలీసులు
వైసీపీ నేతపై ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ కేసు నమోదు, స్పెషల్ టీమ్స్‌ ఏర్పాటు చేసి గాలిస్తున్న పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ayush Mhatre Batting | MI vs CSK IPL 2025 మ్యాచ్ ద్వారా పుట్టిన మరో కొత్త స్టార్ ఆయుష్ మాత్రేVirat Kohli vs Shreyas Iyer Controversy | IPL 2025 లో కొత్త శత్రువులుగా విరాట్, శ్రేయస్ అయ్యర్Rohit Sharma 76* vs CSK IPL 2025 | హిట్ మ్యాన్ ఫామ్ లోకి వస్తే ఎలా ఉంటుందో చూపించిన రోహిత్MI vs CSK Match HighLights IPL 2025 | చెన్నై సూపర్ కింగ్స్ పై 9వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ సూపర్ విక్టరీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఈ ఏడాదిలోనే తెలంగాణలో ఉప ఎన్నికలు: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఈ ఏడాదిలోనే తెలంగాణలో ఉప ఎన్నికలు: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
AP DSC Notification 2025: గతంలో డీఎస్సీకి అప్లై చేసిన అభ్యర్థులు మళ్లీ ఫీజు చెల్లించాలా.. ఇదిగో క్లారిటీ
గతంలో DSCకి అప్లై చేసిన అభ్యర్థులు మళ్లీ ఫీజు చెల్లించాలా.. ఇదిగో క్లారిటీ
JD Vance India Visit: ఫ్యామిలీతో భారత పర్యటనకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్- ఢిల్లీలో భద్రత పెంచిన పోలీసులు
ఫ్యామిలీతో భారత పర్యటనకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్- ఢిల్లీలో భద్రత పెంచిన పోలీసులు, మాక్ డ్రిల్స్ పూర్తి
Online Betting Case: వైసీపీ నేతపై ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ కేసు నమోదు, స్పెషల్ టీమ్స్‌ ఏర్పాటు చేసి గాలిస్తున్న పోలీసులు
వైసీపీ నేతపై ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ కేసు నమోదు, స్పెషల్ టీమ్స్‌ ఏర్పాటు చేసి గాలిస్తున్న పోలీసులు
Odela 3: 'ఓదెల 3' ట్విస్ట్ రివీల్ చేసిన సంపత్ నంది... తిరుపతి ఆత్మ మళ్ళీ ఎందుకు వచ్చిందంటే?
'ఓదెల 3' ట్విస్ట్ రివీల్ చేసిన సంపత్ నంది... తిరుపతి ఆత్మ మళ్ళీ ఎందుకు వచ్చిందంటే?
MI vs CSK Highlights: సీఎస్కేపై రివేంజ్ తీర్చుకున్న ముంబై.. రోహిత్, సూర్య విశ్వరూపం - జడ్డూ, దూబే హాఫ్ సెంచరీలు వృథా
సీఎస్కేపై రివేంజ్ తీర్చుకున్న ముంబై.. రోహిత్, సూర్య విశ్వరూపం - జడ్డూ, దూబే హాఫ్ సెంచరీలు వృథా
CM Revanth Reddy: త్వరలో హైదరాబాద్‌లో ఎకో టౌన్ ఏర్పాటు, జపాన్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
త్వరలో హైదరాబాద్‌లో ఎకో టౌన్ ఏర్పాటు, జపాన్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
Telugu TV Movies Today: బాలయ్య ‘వీరసింహారెడ్డి’, మహేష్ ‘దూకుడు’ to రామ్ చరణ్ ‘చిరుత’, ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ వరకు- ఈ సోమవారం (ఏప్రిల్ 21) టీవీలలో వచ్చే సినిమాలివే
బాలయ్య ‘వీరసింహారెడ్డి’, మహేష్ ‘దూకుడు’ to రామ్ చరణ్ ‘చిరుత’, ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ వరకు- ఈ సోమవారం (ఏప్రిల్ 21) టీవీలలో వచ్చే సినిమాలివే
Embed widget