Hyderabad Crime News: చంపేసి సైలెంట్‌గా డోర్ డెలివరీ చేసేయబోయారు -ఇంటి కోడలిపై ఇంత ఘోరమా ?
Crime News: హైదరాబాద్‌లో ఓ మహిళను చంపేసి వారి అంటికి అంబులెన్స్‌లో తరలించేందుకు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు పసిగట్టారు. నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు.

Hyderabad: ఎవరైనా ఇంట్లో వారికి గుండెపోటు వస్తే అర్జంట్ గా సీపీఆర్ చేసి ఆస్పత్రికి తరలిస్తారు. కానీ హైదరాబాద్ లోని మలక్ పేటలో నివాసం ఉండే ఓ కుటుంబం మాత్రం మా ఇంట్లో కోడలికి గుండె నోప్పి వచ్చింది.. చనిపోయింది.. ఇంటికి పంపించేస్తున్నామని అంబులెన్స్ మాట్లాడారు. కానీ వాళల తీరుతో ఏదో తేడా రావడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అసలు విషయం కనిపెట్టారు.
మలక్ పేటలో సింగం శిరీష అనే మహిళ అనుమానాస్పద మృతి
మలక్‌పేట జమున టవర్స్‌లో సింగం శిరిష, వినయ్ కుమార్ అనే దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే హఠాత్తుగా సింగం శిరీష చనిపోయిందని భర్త వినయ్ కుమార్ బంధువులకు సమాచారం ఇచ్చారు. హఠాత్తుగా గుండె నొప్పి అని చెప్పిందని. కాసేపటికి చనిపోయిందని అందరికీ చెప్పాడు. వెంటే అంబులెన్స్ ను మాట్లాడాడు. ఆమె సొంత గ్రామానికి డోర్ డెలివరీ చేసేందుకు ఏర్పాట్లు చేశాడు. గుండె నొప్పి వస్త కనీసం ఆస్పత్రికి తీసుకెళ్లకుండా చనిపోయిందని చెప్పి.. ఆమె సొంత గ్రామానికి మృతదేహాన్ని పంపేందుకు చేసిన ప్రయత్నం తో ఏదో జరిగిందన్న అనుమానం బలపడటంతో చుట్టుపక్కల వాళ్లు పోలీసులుక సమాచారం ఇచ్చారు.
ఆస్పత్రికి కూడా తరలించకుండా ... స్వగ్రామానికి పంపించే ప్లాన్
వినయ్ కుమార్ తో పాటు.. అత్తమామలు కూడా మృతదేహాన్ని ఎంత త్వరగా పంపించేస్తే అంత మంచిదని.. ఆస్పత్రికి వద్దని హడావుడి చేశారు. పోలీసులు హుటాహుటిన వచ్చి తరలింపును అడ్డుకున్నారు. ఇంట్లో ఏం జరిగిందో కానీ.. అంబులెన్స్ లో మృతదేహాన్ని తరలించేందుకు చేసిన ప్రయత్నాలను సీసీ కెమెరాలో చూశారు. వెంటనే తృతేహాన్ని పరిశీలించారు. సింగం శిరీష ఒంటిపై చాలా వరకూ దెబ్బలు ఉన్నట్లుగా గుర్తంచారు. దీంతో మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం పంపించారు.
తమ కుమార్తెను కొట్టి చంపారంటున్న సింగం శిరీష తల్లిదండ్రులు
ఈ లోపు సింగం శిరీష కుటుంబసభ్యులు వచ్చారు. కొంత కాలంగా అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని కొట్టి చంపి ఉంటారని కన్నీరు మున్నీరయ్యారు. వారి దగ్గర నుంచి సమాచారాన్ని తీసుకున్న పోలీసులు కేసులు నోదు చేశారు. మృతురాలి స్వస్థలం శ్రీశైలం సమీపంలో దోమల పెంటగా చెబుతున్నారు. మృతదేహం పై గాయాలు ఉండటంతో కొట్టి చంపి.. గుండెపోటుగా చెపుతున్నారన్న అనుమానంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భర్తతో పాటు అత్తమామల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
Also Read: వీడు కొడుకు కాదు, కాల యముడు! ఎవరైనా కన్నతల్లిని ఇంత దారుణంగా చంపుతారా ?





















