Pelli Kani Prasad: కట్నం శాసనాల గ్రంథంలో ఆ రూల్స్ ఏంటో మరి? - నవ్వులు పూయిస్తోన్న 'పెళ్లి కాని ప్రసాద్', టీజర్ రిలీజ్ చేసిన రెబల్ స్టార్ ప్రభాస్
Sapthagiri Pelli Kani Prasad: కమెడియన్ సప్తగిరి హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'పెళ్లి కాని ప్రసాద్'. తాజాగా ఈ మూవీ టీజర్‌ను రెబల్ స్టార్ ప్రభాస్ రిలీజ్ చేశారు.

Sapthagiri's Pelli Kani Prasad Movie Teaser Unveiled By Rebel Star Prabhas: ప్రముఖ కమెడియన్ సప్తగిరి (Sapthagiri) హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ 'పెళ్లి కాని ప్రసాద్' (Pelli Kani Prasad). ఈ మూవీకి అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. ప్రియాంక శర్మ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ నెల 21న ఈ సినిమా థియేటర్లలోకి రిలీజ్ కానుండగా.. తాజాగా టీజర్‌ను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా మూవీ టీంకు ఆయన అభినందనలు తెలియజేశారు. 'ప్రసాద్ అనే నేను కట్నం శాసనలా గ్రంథంలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌కు రెస్పెక్ట్ ఇస్తూ తరతరాలుగా కట్నం విషయంలో మా తాత ముత్తాతలు ఫాలో అవుతోన్న టర్మ్స్ అండ్ కండీషన్స్ కు కట్టుబడి ఉంటానని వారి మీద ప్రమాణం చేస్తున్నా.' అంటూ టీజర్‌లో సప్తగిరి చేసే ప్రమాణం నవ్వులు పూయిస్తోంది. సినిమాలో మురళీధర్ గౌడ్, అన్నపూర్ణ, ప్రమోదిని, వడ్లమాని శ్రీనివాస్ కీలక పాత్రలు పోషించారు.
Thanks to Our Beloved #Mana #Maharaju #Darling #Prabhas Garu🙏..! Love You Anna Forever..!
— Sapthagiri (@MeSapthagiri) March 3, 2025
Gear up for a rollercoaster ride of uproarious fun and emotions❤️🔥
Presenting the hilarious #PelliKaniPrasad teaser😆
▶️ https://t.co/FxvoNRHVeC
In Cinemas from March 21st
Theatrical… pic.twitter.com/pizXZML0DA
అసలు ఈ ప్రసాద్‌కు పెళ్లవుతుందా..?
తాత ముత్తాతలు కట్నం విషయంలో పెట్టిన కండిషన్స్‌తో పెళ్లి కోసం ఎదురుచూసే ఓ యువకుడి కథను కామెడీ జానర్‌లో 'పెళ్లి కాని ప్రసాద్' తెరకెక్కించినట్లు టీజర్‌ను బట్టి తెలుస్తోంది. 'కట్నం రూల్ బుక్'లో రూల్స్ యువకుని పెళ్లికి సవాల్‌గా మారుతాయని అర్థమవుతోంది. ప్రసాద్ వివాహం కావాలంటే.. రూ.2 కోట్ల కట్నం, అది కూడా నగదు రూపంలోనే చెల్లించాలి వంటి కండిషన్స్ సవాళ్లతో కూడుకున్నవి కాగా.. అసలు ఆ ప్రసాద్‌కు పెళ్లవుతుందా..? లేదా శాశ్వత బ్రహ్మచారిగా మిగిలిపోతాడా.? అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే. టీజర్ ఆద్యంతం కామెడీతోనే సాగనున్నట్లు తెలుస్తోంది. సప్తగిరి కామెడీ టైమింగ్, డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.
కమర్షియల్ హిట్ కొట్టేనా..?
కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించి హీరోగా ఎదిగిన నటుడు సప్తగిరి. తన కామెడీ టైమింగ్, డైలాగ్స్, ఎమోషన్స్‌తో ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్' మూవీతో హీరోగా మారగా.. సప్తగిరి ఎల్ఎల్‌బీ, వజ్రకవచధర గోవింద, గూడుపుఠాణి వంటి చిత్రాల్లోనూ లీడ్ రోల్ పోషించారు. కొన్ని సినిమాలు మంచి టాక్ తెచ్చుకున్నా.. కమర్షియల్‌గా సక్సెస్ అందుకోలేకపోయాయి. ఈ క్రమంలో ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలని సప్తగిరి భావిస్తున్నారు. లేటెస్ట్ మూవీ 'పెళ్లి కాని ప్రసాద్'తో కమర్షియల్‌గా మంచి విజయం సాధించాలని అనుకుంటున్నారు.
Also Read: ఓటీటీలోకి వచ్చేేసిన అజిత్ యాక్షన్ థ్రిల్లర్ 'పట్టుదల' - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?






















