Vidaamuyarchi OTT Streaming: ఓటీటీలోకి వచ్చేేసిన అజిత్ యాక్షన్ థ్రిల్లర్ 'పట్టుదల' - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
Vidaamuyarchi OTT Platform: తమిళ స్టార్ అజిత్, బ్యూటీ క్వీన్ త్రిష జంటగా నటించిన 'విడాముయర్చి' (తెలుగులో పట్టుదల) మూవీ నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

Ajith kumar's Vidaamuyarchi Now Streaming On Netflix: తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar), బ్యూటీ క్వీన్ త్రిష (Trisha) జంటగా నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'విడాముయర్చి' (Vidaamuyarchi) తెలుగులో 'పట్టుదల' (Pattudala) ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. సోమవారం (మార్చి 3) నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం 'నెట్ ఫ్లిక్స్'లో (Netflix).. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఫిబ్రవరి 6న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకోగా.. విడుదలైన నెల రోజుల లోపే ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. మేయిళ్ తిరుమేని దర్శకత్వం వహించగా.. అర్జున్ సర్జా, రెజీనా కసాండ్రా, అరవ్, నిఖిల్, సజిత్, దాశరథి, రవి రాఘవేంద్ర, జీవ రవి, గణేశ్ శరవణన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అజిత్ నటన, యాక్షన్ సీక్వెన్స్, త్రిష అందం, నటన, అభినయం సినిమాకే హైలెట్‌గా నిలవగా.. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.130 కోట్ల వరకూ కలెక్షన్లు రాబట్టగలిగింది. అనిరుథ్ రవిచందర్ మ్యూజిక్, బీజీఎం సినిమాకే అదనపు ఆకర్షణగా నిలిచాయి.
VIDAAMUYARCHI is now streaming on Netflix! 💥 Watch the action, feel the emotions, and witness the triumph. 💪#Vidaamuyarchi #VidaamuyarchiOnNetflix pic.twitter.com/7Clln4XVwW
— Lyca Productions (@LycaProductions) March 3, 2025
కథేంటంటే..?
అజర్ బైజాన్‌లోని బాకు నగరంలో ఓ కంపెనీలో అర్జున్ (అజిత్ కుమార్) ఉన్నతోద్యోగిగా చేస్తుంటాడు. కాయల్ (త్రిష) ప్రేమించి పెళ్లి చేసుకోగా.. దాదాపు 12 ఏళ్ల తర్వాత వీరు డివోర్స్ తీసుకునేందుకు సిద్ధపడతారు. అర్జున్ నుంచి విడిపోవాలనుకున్న కాయల్ తన పుట్టింటికి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటుంది. ఆమెను ఇంటి వద్దే తానే దిగబెడతాననే ఇది ఇద్దరికీ జీవితంలో గుర్తుండిపోయే ఆఖరి ప్రయాణం అంటూ అర్జున్ చెప్పగా.. అందుకు ఓకే చెప్తుంది. అలా మొదలైన వారి ప్రయాణంలో ఎదురైన అవాంతరాలు, కాయల్ అదృశ్యం కావడం, ఆమెను వెతుక్కుంటూ వెళ్లిన అర్జున్‌కు ఎదురైన సవాళ్లు.. మధ్యలో పరిచయమైన తెలుగు వాళ్లు రక్షిత్ (అర్జున్), దీపిక (రెజీనా)కు సంబంధం ఏంటనేదే కథ. యాక్షన్ మూవీస్ చేయడంలో అజిత్ కుమార్ స్టైలే వేరు. స్వతహాగా కార్ రేసర్ కావడంతో డూప్ లేకుండా ఛేజింగ్ సీక్వెన్సులు చేయడంలో ఆయనకు ఆయనే సాటి. ఆ కోవలోకే వచ్చిన యాక్షన్ థ్రిల్లర్‌గా 'విడాముయర్చి' తెరకెక్కినా అనుకున్నంత విజయం సాధించలేకపోయింది.
ఇప్పటివరకూ 6 సినిమాలు..
మరోవైపు, 'విడాముయర్చి' తర్వాత అజిత్, త్రిష కాంబోలో వస్తోన్న ఆరో మూవీ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. ఇప్పటివరకూ వీరు 5 సినిమాల్లో కలిసి నటించారు. 'కిరీదం', 'జి', 'గ్యాంబ్లర్' (తమిళంలో 'మంకత్తా'), 'ఎంతవాడుగాని' (తమిళంలో 'ఎన్నై ఆరిందాల్'), 'విడాముయర్చి' సినిమాల్లో ఈ జంట నటించి మెప్పించారు. 'గుడ్ బ్యాడ్ అగ్లీ'ని తెలుగు ఇండస్ట్రీలో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ప్రొడ్యూసర్లు. ఈ చిత్రానికి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏప్రిల్ 10న తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో సినిమా రిలీజ్ కానుంది.






















