The Paradise Glimpse: కడుపు మండిన కాకుల కథ.. జమానాలో నడిచే శవాల కథ - నేచురల్ స్టార్ నాని 'ది ప్యారడైజ్' గ్లింప్స్ వేరే లెవల్.. స్టోరీ అదేనా!
The Paradise Raw Statement: టాప్ హీరో నాని, దసరా ఫేం శ్రీకాంత్ ఓదెల కాంబో లేటెస్ట్ మూవీ 'ది ప్యారడైజ్'. మూవీ టీం తాజాగా 'THE RAW STATEMENT' పేరుతో గ్లింప్స్ విడుదల చేయగా భారీ హైప్ క్రియేట్ చేస్తోంది.

Nani's The Paradise Glimpse Released: నేచురల్ స్టార్ నాని (NANI), దసరా ఫేం శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తోన్న లేటెస్ట్ మూవీ 'ది ప్యారడైజ్' (THE PARADISE). ఈ సమ్మర్‌కు ప్రేక్షకుల ముందుకు రానుండగా.. మేకర్స్ తాజాగా 'THE RAW STATEMENT' పేరుతో గ్లింప్స్ విడుదల చేశారు. ఈ వీడియోలో నాని యాక్షన్ వేరే లెవల్‌లో ఉంది. 'చరిత్రలో అందరూ చిలకలు, పావురాల గురించి రాశారు కానీ.. అదే జాతిలో పుట్టిన కాకుల గురించి ఎవరూ రాయలేదు.' అంటూ మొదలయ్యే గ్లింప్స్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఇది కడుపు మండిన కాకుల కథ.. జమానా జమానాకెళ్లి నడిచే శవాల కథ.. అమ్మ రొమ్ములో పాలు లేక రక్తం పోసి పెంచిన ఓ జాతి కథ అంటూ సాగే ఎలివేషన్ చూస్తుంటే మూవీలో యాక్షన్ వేరే లెవల్‌లో ఉందని తెలుస్తోంది.
కాకుల తల్వార్లు పట్టినయ్.. స్టోరీ అదేనా..!
చరిత్రలో లేని అట్టడుగున ఉన్న ఓ జాతికి సంబంధించిన నాయకుడిగా నాని కనిపించనున్నట్లు గ్లింప్స్‌ను బట్టి అర్థమవుతోంది. సినిమాలో నాని లుక్ పూర్తిగా డిఫరెంట్‌గా గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ఆయనకు కాకి రెక్కలు తొడిగినట్లుగా ఉన్న లుక్ హైప్‌ను పెంచేసింది. 'ఒక థగడ్ వచ్చి మొత్తం జాతిలో జోష్ తెచ్చాడు. బానిసలా పెంచుకున్న కాకులు తల్వార్లు పట్టినయ్.. గిది ఆ కాకులను ఒక్కటి చేసిన ఒక కొడుకు కథ. నా కొడుకు నాయకుడైన కథ.' అంటూ చెప్పడం చూస్తుంటే బానిసల్లా చూసిన ఓ వర్గం వారిని ఏకతాటిపైకి తెచ్చిన ఓ నాయకుడు ప్రత్యర్థులపై పోరాడి వారికి అండగా ఎలా నిలిచాడో చూపించనున్నట్లు అర్థమవుతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు భారీ హైప్ క్రియేట్ చేయగా.. తాజాగా రిలీజైన గ్లింప్స్‌ను బట్టి ఈ మూవీ గ్యాంగ్ స్టర్ డ్రామా తెరకెక్కినట్లు తెలుస్తోంది. అనిరుధ్ రవిచందర్ బీజీఎం హైలెట్‌గా నిలిచింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, బెంగాలీ, కన్నడ, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లోనూ మూవీ గ్లింప్స్ విడుదలైంది. స్పానిష్ భాషల్లో డబ్బింగ్ చెప్పిన తొలి భారతీయ నటుడిగా నాని రికార్డు సృష్టించారు. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 26న థియేటర్లలోకి రానుంది.
This is our STATEMENT.
— Nani (@NameisNani) March 3, 2025
THE PARADISE
WILL RISE.@odela_srikanth & @anirudhofficial MADNESS. 🔥🐦⬛ https://t.co/r46KwAqYkf#TheParadise IN CINEMAS 𝟐𝟔𝐭𝐡 𝐌𝐀𝐑𝐂𝐇, 𝟐𝟎𝟐𝟔.@sudhakarcheruk5 @NavinNooli @dop_gkvishnu @artkolla @SLVCinemasOffl @TheParadiseOffl pic.twitter.com/rF78cxNRBx
గ్లింప్స్‌కు ఏకంగా రూ.కోటి ఖర్చు
ఈ మూవీని ఎస్ఎల్‌వీ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా.. 'ది ప్యారడైజ్' మూవీ గ్లింప్స్‌కే ఏకంగా దాదాపు రూ.కోటి ఖర్చు చేసినట్లు సమాచారం. గ్లింప్స్ వీడియోలోని హైక్వాలిటీ వీఎఫ్ఎక్స్ షాట్స్ హైలెట్‌గా నిలిచాయి. దాదాపు రూ.100 కోట్లతో మూవీ తెరకెక్కినట్లు తెలుస్తోంది. హీరో నానితో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఫస్ట్ మూవీ 'దసరా' మంచి హిట్ అందుకుంది. దీంతో ఈ మూవీపైనా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తుండగా.. జెర్సీ, గ్యాంగ్ లీడర్ విజయాల తర్వాత వీరి కాంబోలో వస్తోన్న మూడో చిత్రం అవడంతో హైప్ నెలకొంది.
Also Read: ఆస్కార్స్‌లో బ్రాడీ, హాలే బెర్రీ లిప్ లాక్ - 22 ఏళ్ల తర్వాత సేమ్ సీన్ రిపీట్.. వైరల్ వీడియో చూశారా?
ఈ సినిమా 1960 బ్యాక్ డ్రాప్‌లో రాబోతున్నట్లు తెలుస్తుండగా.. హీరో నాని పూర్తిగా డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నారు. ఓ గ్యాంగ్ స్టర్ డ్రామాగా 'ది ప్యారడైజ్' తెరకెక్కినట్లు గ్లింప్స్, పోస్టర్స్‌ను బట్టి అర్థమవుతోంది. ఇక ఈ మూవీలో సీనియర్ నటుడు మోహన్ బాబు నెగిటివ్ రోల్ చేస్తారని టాక్ వినిపిస్తుండగా.. అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు, శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తోన్న నాని 'హిట్ 3: ద థర్ట్ కేస్' మూవీలోనూ వయలెన్స్ ఓ రేంజ్‌లో ఉన్నట్లు టీజర్‌ను బట్టి తెలుస్తోంది. నాని లుక్, ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాలు, సస్పెన్స్, అదిరిపోయే బీజీఎం ఇందులో మెయిన్ హైలెట్‌గా నిలిచాయి. 'హిట్ 3' సినిమాలో నాని సరసన 'కేజిఎఫ్' ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. 2025 సమ్మర్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా మే 1న ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు.
Also Read: ఏడాది తర్వాత ఆ ఓటీటీలోకి శర్వానంద్ 'మనమే' - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

