Sai Dharam Tej : మెగా ఫ్యామిలీ నుంచి మరో గుడ్ న్యూస్ - పెళ్లిపై సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ అనౌన్స్‌మెంట్
Sai Dharam Tej Marriage : సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో తన పెళ్లిపై వస్తోన్న రూమర్లపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు.

Sai Dharam Tej Reaction On His Marriage : తన పెళ్లిపై వస్తోన్న రూమర్లపై సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ క్లారిటీ ఇచ్చేశారు. సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన... పెళ్లిపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు రియాక్ట్ అయ్యారు.
వచ్చే ఏడాదే పెళ్లి
ఎన్నో రోజులుగా తన పెళ్లిపై రూమర్స్ వస్తుండగా... వచ్చే ఏడాది తన పెళ్లి ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు సాయి తేజ్. 'మంచి చిత్రాలు, మంచి జీవితం ఇచ్చిన భగవంతుడికి కృతజ్ఞతలు తెలిపేందుకే తిరుమలకు వచ్చాను. కొత్త సంవత్సరం వస్తోన్న తరుణంలో శ్రీవారి ఆశీస్సులు కావాలని దర్శించుకున్నా. వచ్చే ఏడాదిలో నేను నటిస్తోన్న 'సంబరాల ఏటిగట్టు' రిలీజ్ అవుతోంది. మీరంతా ఆదరిస్తారని ఆశిస్తున్నా.' అంటూ చెప్పారు.
ఓ మీడియా ప్రతినిధి 'మీ పెళ్లిపై రూమర్స్ వస్తున్నాయి కదా?' అని ప్రశ్నించగా... 'వచ్చే ఏడాదిలోనే నా పెళ్లి ఉంటుంది' అంటూ చెప్పారు. దీంతో కొత్త మూవీ రిలీజ్ తర్వాత ఆయన పెళ్లి ఉండొచ్చు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : మాస్ మహారాజ రవితేజతో సమంత! - క్రేజీ డైరెక్టర్ విత్ థ్రిల్లింగ్ స్టోరీ
'విరూపాక్ష' వంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత పాన్ ఇండియా లెవల్ హై యాక్షన్ ఎంటర్టైనర్ 'సంబరాల ఏటిగట్టు'తో సాయి దుర్గా తేజ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన లుక్స్, గ్లింప్స్ వేరే లెవల్‌లో ఉన్నాయి. ఈ మూవీకి రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తుండగా... సీనియర్ హీరో శ్రీకాంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరితో పాటే జగపతి బాబు, ఐశ్వర్య లక్ష్మి, సాయి కుమార్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషిస్తున్నారు. 'ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్' బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తుండగా... అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.






















