Ravi Teja : మాస్ మహారాజ రవితేజతో సమంత! - ఫేమస్ డైరెక్టర్ విత్ థ్రిల్లింగ్ స్టోరీ
Ravi Teja Samantha : మాస్ మహారాజ రవితేజ నెక్స్ట్ మూవీపై క్రేజీ బజ్ వినిపిస్తోంది. ఇదివరకు ఎప్పుడూ లేని కాంబోలో థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో ఆయన మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది.

Ravi Teja New Movie With Director Shiva Nirvana : మాస్ మహారాజ రవితేజ మరో క్రేజీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ మూవీ మాత్రం చాలా స్పెషల్. నిన్ను కోరి, మజిలీ, టక్ జగదీష్, ఖుషి మూవీస్ తెరకెక్కించిన ఫేమస్ డైరెక్టర్ శివ నిర్వాణ ఈ కొత్త ప్రాజెక్టుకు దర్శకత్వం వహిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.
వెరీ వెరీ స్పెషల్ కాంబో
ఎవరూ ఊహించని కాంబో రవితేజ - శివ నిర్వాణ మూవీ అంటేనే స్పెషల్ క్రేజ్ నెలకొంది. వీరిద్దరూ కలిసి మూవీ చేస్తున్నట్లుగా ఇదివరకు ఎప్పుడూ వినిపించలేదు. లేటెస్ట్‌గా ఇది కన్ఫర్మ్ కావడంతో భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందించనుండగా... ఈ నెలలోనే ప్రారంభం కానున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరో క్రేజీ విషయం ఏంటంటే ఇందులో హీరోయిన్‌గా సమంత అనుకుంటున్నారట. అదే జరిగితే రవితేజ, సమంత కాంబోలో ఇదే ఫస్ట్ మూవీ అవుతుంది.
థ్రిల్ పంచేలా...
మాస్ మహారాజ్ క్రేజ్‌కు తగ్గట్లుగా... ఓ థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌ను శివ నిర్వాణ రెడీ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు అఫీషియల్‌గా అనౌన్స్ చేయనున్నారు.
రీసెంట్‌గా రవితేజ 'మాస్ జాతర' బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం రవితేజ కిశోర్ తిరుమల దర్శకత్వంలో క్లాసిక్ టైటిల్, డిఫరెంట్ కాన్సెప్ట్‌తో 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' చేస్తున్నారు. ఇందులో కేతికా శర్మ, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తుండగా... వెన్నెల కిశోర్, మురళీధర్ గౌడ్, సునీల్, సత్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా... భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి మూవీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
అటు, సమంత ప్రస్తుతం 'మా ఇంటి బంగారం' మూవీ చేస్తున్నారు. 'శుభం'లో అతిథి పాత్ర పోషించిన తర్వాత ఆమె చాలా గ్యాప్ తీసుకున్నారు. ఈ మూవీ పూర్తైన తర్వాతే రవితేజతో మూవీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read : 'కోర్ట్' హీరోయిన్ శ్రీదేవికి తమిళంలో మరో ఛాన్స్ - తెలుగులోనూ రిలీజ్... వరుస మూవీస్‌కు గ్రీన్ సిగ్నల్






















